హాస్టళ్లలో మౌలిక వసతుల లేమిపై చలించిన షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హాస్టళ్లలో మౌలిక వసతుల లేమిపై చలించిన షర్మిల

హాస్టళ్లలో మౌలిక వసతుల లేమిపై చలించిన షర్మిల

Written By news on Saturday, June 29, 2013 | 6/29/2013

విశాఖ జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో రావికమతం బీసీ బాలికల హాస్టల్ పరిశీలన 
- హాస్టల్‌ని చూసి కంట నీరు పెట్టిన స్థానిక మహిళ
- తమ గుడిసెలోనే పిల్లలను ఇంకా మంచిగా సాకుతామని వెల్లడి
- బాలికలకు ఈ ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేదా? అంటూ షర్మిల ఆగ్రహం 
- విద్యార్థినులకు అండగా ఉంటామని, చక్కగా చదువుకోవాలని సూచన
- జగనన్న సీఎం అయితే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : ‘పుడితే ఆడపిల్లగానే పుట్టాలి.. అదీ ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాలి’. ఇదీ ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నినాదం. ‘బంగారు తల్లి’ పథకంతో ఆడపిల్లల భవిష్యత్తు అంతా బంగారుమయమేనని ఆయనే స్వయంగా ప్రకటించినప్పుడు, చిట్టి తల్లుల భవిష్యత్తు బంగారంలా ఉండాలి. పేదింట్లో పుట్టినా, పెద్ద చదువులు చదువుకోగల సౌకర్యాలు ఉండాలి. తొలిసారి తల్లి ఒడిని విడిచి బడిలో అడుగుపెట్టినప్పుడు స్కూళ్లు, హాస్టళ్లు వారిని ఆకర్షించేలా వసతులు ఉండాలి. వారికి భద్రత కల్పించగలగాలి. కానీ రాష్ట్రంలో బాలికల హాస్టళ్లు ఎంత భయంకరంగా ఉన్నాయో, అందులో వారి జీవనం ఎంత దుర్భరంగా ఉందో విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలోని ఓ హాస్టల్‌ను చూస్తే తేటతెల్లమైంది.

విశాఖ జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ హాస్టల్లో విద్యార్థినుల అవస్థలు చూసి చలించిపోయారు. ‘‘హాస్టళ్లలో పరిస్థితి ఇంత దుర్భరమా? ఈ ప్రభుత్వం బాలలకు కనీస వసతులు కూడా కల్పించలేదా? పేదరికంలో పుట్టినందుకు ప్రభుత్వం శిక్షలు వేస్తున్నట్లుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు అండగా ఉంటామని, చక్కగా చదువుకోవాలని చెప్పారు. జగనన్న సీఎం అయితే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో సాగింది. రావికమతం మండల కేంద్రం గుండా వెళ్తున్న షర్మిల అక్కడే కనిపించిన బీసీ బాలికల సంక్షేమ వసతి గృహంలోకి వె ళ్లారు. అక్కడి వసతులను పరిశీలించి, విద్యార్థినులతో మాట్లాడారు. 60 మంది ఆడపిల్లలకు నాలుగే పడక గదులు ఉన్నాయి. రెండు స్నానాల గదులు, రెండే మరుగుదొడ్లు ఉన్నాయి. వాటికీ నీటి సరఫరా లేదు. 

మూడేళ్ల కిందట బోర్ మోటార్ పాడయితే ఇంతవరకు మరమ్మతులు చేయించలేదు. స్నానాల గదులు సరిపోక బాలికలు చాటుగా ఒక వరండా సందులో మోకాళ్లు మొఖానికి తగిలేట్లు ముడుచుకొని స్నానాలు చేయాల్సిన దుస్థితి. కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఆత్మాభిమానం చంపుకోవాల్సిన పరిస్థితి. హాస్టల్లో విద్యార్థినుల అవస్థలు చూసి షర్మిల చలించిపోయారు. హాస్టళ్లలో వసతులు ఇంత అధ్వానంగా ఉన్నాయా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. షర్మిలతో పాటు హాస్టల్‌లోకి వచ్చిన దాంబూడి లక్ష్మి అనే స్థానిక మహిళ ఈ హాస్టల్‌ని చూసి ఆవేదన చెందింది.

‘‘మా కడుపు మాడ్చుకోనైనా మా పిల్లలకు ఇంతకంటే మంచిగా పెట్టుకుంటాం. గుడిసెలోనైనా పిల్లలను బాగానే సాకుతాం. పిల్లలు చదువుకుంటారని హాస్టల్‌కు పంపితే ఇంత ఘోరంగా పెంచుతారా’’ అంటూ కన్నీరు పెట్టింది. ఆమె ఆవేదన, ఇక్కడి వసతులు చూసి షర్మిల చలించిపోయారు. ‘‘చాలా కష్టంగా ఉంది. కనీసం తాగటానికి నీళ్లు లేవు. స్నానానికి నీళ్లు లేవు. స్నానాల గ దులు మరీ దరిద్రంగా ఉన్నాయి. మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలనమ్మా. సంక్షేమ హాస్టళ్లు చీకటి గదుల మాదిరిగా ఉన్నాయి. బాలికలకు ఈ ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేదా? పేదరికంలో పుట్టినందుకు ప్రభుత్వం పిల్లలకు బాల్యంలోనే శిక్షలు వేస్తున్నట్లు అనిపిస్తోంది. 

బాలికలు కనీసం స్నానాలు చేసేందుకూ వసతి కల్పించలేని పరిస్థితిలో ఇవాళ మన పాలకులున్నారు. వీళ్లంతా ఎదిగే పిల్లలు. ప్రతి బిడ్డకూ పౌష్టికాహారం అందించడం పాలకుల కనీస బాధ్యత. కానీ, లక్షలాది బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల కోసం నిధులివ్వడానికి ప్రభుత్వానికి మనసు రావడంలేదు. కనీసం మరుగు దొడ్ల నిర్వహణకూ మూడేళ్లుగా నిధులివ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతోంది. సంక్షేమ హాస్టళ్లలో అపరిశుభ్రత రాజ్యమేలి విద్యార్థులు రోగాల పాలవుతున్నారు. వైఎస్సార్ అధికారంలో ఉండగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రెండుసార్లు పెంచారు.

ఒకసారి 25 శాతం, మరోసారి 45 శాతం పెంచారు. వైఎస్ ఉంటే మరోసారి మెస్ చార్జీలు పెరిగేవని కుల సంఘాల నేతలంటున్నారు’’ అని అన్నారు. ‘‘అమ్మా.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీరు చదువులు ఆపొద్దు. కష్టపడి చదువుకోవాలి. జగనన్న సీఎం అయితే మన సమస్యలు తీరిపోతాయి. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తారు. బాగా చదువుకోండి తల్లీ’’ అని విద్యార్థినులకు సూచించారు. విద్యార్థినులు కాలకృత్యాలకు హాస్టల్ ప్రాంగణం దాటి బయటికి పోకుండా వసతులు మెరుగుపరచాలని, ముందుగా నీటి సౌకర్యం కల్పించాలని వైఎస్సార్‌సీపీ నేత పీవీఎస్‌ఎన్ రాజుకు షర్మిల సూచించారు.

మండుటెండనూ లెక్కచేయకుండా... 
శుక్రవారం 193వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం టి.అజ్జాపురం నుంచి సంగవరం వరకు సాగింది. చోడవరం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సూర్యుడు భగ్గుమన్నాడు. 39 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అయినా షర్మిల యాత్ర ఆగలేదు. ఉదయం నుంచే ఓ వైపు ఎండ... మరోవైపు ఉక్కపోతతో సతమతమవుతున్నా, షర్మిలను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. నెత్తిన ఎండ మాడుతున్నా రోడ్డు మీద నిల్చొని రాజన్న బిడ్డ కోసం వేచిచూశారు.

టి.అజ్జాపురంలో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల మేడివాడ, గర్నికం, రావికమతం, కోమళ్లపూడి, పొట్టిదొరపాలెంల మీదుగా సంగవరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 16.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,564.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. షర్మిల వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, ముదునూరి ప్రసాదరాజు, జ్యోతుల నెహ్రూ, చోడవరం సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పెట్ల ఉమాశంకర్ గణేష్, కిడారి సర్వేశ్వర్‌రావు, బొడ్డేటి ప్రసాద్, కోల గురువులు, తిప్పల నాగిరెడ్డి, కోరాడ రాజబాబు, స్థానిక నాయకులు కొణతాల లక్ష్మీనారాయణ, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు న్నారు.
Share this article :

0 comments: