ప్రజాస్వామ్యమా?ఆటవిక సమాజమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాస్వామ్యమా?ఆటవిక సమాజమా?

ప్రజాస్వామ్యమా?ఆటవిక సమాజమా?

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని చూసేందుకు వచ్చిన ప్రజలను నిర్బంధించాల్చిన అవసరమేంటి? అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. సీబీఐ కంటే పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువైందన్నారు. మనం ఆటవిక సమాజంలో ఉన్నామా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అని అడిడారు. రాష్ట్రంలో సైనిక పాలన నడుస్తోందా? లేక రాచరిక పాలన నడుస్తోందా? అని ప్రశ్నించారు. 

15వ లోక్‌సభలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఏకైక వ్యక్తి జగన్మోహన రెడ్డి అని తెలిపారు. అలాంటి వ్యక్తిని కలిసేందుకు వస్తే కర్ఫ్యూ వాతావరణం విధించడం సమంజసమేనా అని ఆయన అడిగారు. పోలీసుల నిర్వాకం వెనుక అదృశ్య ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానం వ్యక్తం చేశారు. కొండాసురేఖ సవాల్‌పై చంద్రబాబు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? అని అడిగారు. చంద్రబాబు కేవలం కుప్పంకే పరిమితమయ్యే రోజు త్వరలోనే ఉందని అంబటి హెచ్చరించారు.

Share this article :

0 comments: