జైల్లో గడిపిన కాలాన్ని తిరిగివ్వగలరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జైల్లో గడిపిన కాలాన్ని తిరిగివ్వగలరా?

జైల్లో గడిపిన కాలాన్ని తిరిగివ్వగలరా?

Written By news on Thursday, June 27, 2013 | 6/27/2013

 ఏడాదికిపైగా జగన్‌ను రిమాండ్‌లో ఉంచడం దారుణం
- ఎవరెన్ని కుట్రలు చేసినా మహానేత కుటుంబానికి
- అండగా ఉంటామన్న ఎమ్మిగనూరు ప్రజ

ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: ‘ఏ తప్పూ చేయని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించారు. ఏడాది గడచిపోయినా సాక్ష్యాల పేరిట కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు. రేపు జగన్ నిర్దోషిగా బయటికొస్తే జైల్లో గడిపిన కాలాన్ని తిరిగి ఇవ్వగలరా? ఆ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న మానసిక క్షోభకు అప్పుడేం సమాధానం చెబుతారు? చట్టాల్లోని లొసుగులతో రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం’ అంటూ ఎమ్మిగనూరు ప్రజలు కాంగ్రెస్, టీడీపీల తీరుపై మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఉప్పర కల్యాణ మంటపంలో బుధవారం డివిఎన్ కిశోర్ వ్యాఖ్యాతగా ‘సాక్షి’ చైతన్యపథం నిర్వహించారు. 

రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ షేక్ అహ్మద్ అకుల మాట్లాడుతూ,అభియోగాలతో ఓ వ్యక్తిపై ఇంత కక్ష సాధింపు తగదన్నారు. ఎవరో ఏదో ఆరోపించారని ప్రజాభిమానం కలిగిన నాయకుడ్ని జైల్లో పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. న్యాయవాది నాగరాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రకారం నేరం చేసినా, చేయకపోయినా బెయిల్ పొందేందుకు సర్వ హక్కులు ఉన్నాయన్నారు. సీబీఐ పరిధి దాటి వ్యవహరిస్తూ బెయిల్‌ను అడ్డుకుంటోందన్నారు. సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధాకర్ మాట్లాడుతూ సీబీఐ రాజకీయ పార్టీలకు తొత్తుగా మారటం దురదృష్టకరమన్నారు.

వారిది రాక్షసానందం...: రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సుందరీబాయి మాట్లాడుతూ, కుటుంబపెద్ద మరణంతో దుఃఖంలో ఉన్న భార్య, కుమారుడు, కూతురు, కోడలిని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నాయన్నారు. అభియోగాలు మాత్ర మే ఎదుర్కొంటున్న జగన్‌ను ఏడాదికిపైగా రిమాండ్‌లో ఉంచడం దారుణమన్నారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు యు.యు.ఉరుకుందు మాట్లాడుతూ, జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాల సృష్టికే సీబీఐ బెయిల్ రాకుండా చేస్తుందనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలో పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన వారికీ ఎఫ్‌ఐఆర్ నమోదైన మూడు నెలలకే బెయిల్ వచ్చిందని, జగన్ విషయంలో మాత్రమే లేనిపోని అడ్డంకులు సృష్టిస్తుండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. చేనేతసంఘం జిల్లా నాయకులు శంకరన్న మాట్లాడుతూ, చతికిలపడ్డ చేనేతరంగానికి 2004లో దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రాణం పోశాడన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, ప్రజాదరణ చూరగొన్నాడనే కారణంతో జగన్‌ను లేనిపోని కేసుల్లో ఇరికించడం అప్రజాస్వామికమన్నారు.
Share this article :

0 comments: