సుప్రీంకోర్టు అడిగినపుడు జీఓలు సక్రమమేనని ఎందుకు చెప్పలేదు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టు అడిగినపుడు జీఓలు సక్రమమేనని ఎందుకు చెప్పలేదు?

సుప్రీంకోర్టు అడిగినపుడు జీఓలు సక్రమమేనని ఎందుకు చెప్పలేదు?

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013

- సుప్రీంకోర్టు అడిగినపుడు జీఓలు సక్రమమేనని ఎందుకు చెప్పలేదు?
- యూపీఏ కాపలా కుక్కలాగా సీబీఐ...అందుకే స్టాలిన్ ఇంట్లో సోదాలు
- రాజంపేట సాక్షి చైతన్య పథంలో జనాభిప్రాయం

 ‘వైఎస్ జగన్ అరెస్టు తర్వాత చట్టం, న్యాయం విషయంలో విచిత్ర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.. రాజ్యాంగ హక్కులను సీబీఐ కాలరాస్తోంది..వివాదాస్పదమని భావిస్తున్న 26 జీవోలు సీఎం కిరణ్ చెప్పినట్లు సక్రమమే అయితే, సీబీఐ కేసు ఎందుకు నమోదు చేసినట్లు?జగన్‌ను ఎందుకు అరెస్టు చేసినట్లు..? సుప్రీం కోర్టు జీవోల విషయాన్ని ప్రశ్నించినపుడు సీఎం ఎందుకు నోరుమెదపలేదు..?’ అని వైఎస్సార్ జిల్లా రాజంపేటలో జరిగిన సాక్షి చైతన్యపథంలో వక్తలు ప్రశ్నించారు. 

రాజంపేటలో బుధవారం ఏఐటీఎస్ ఆడిటోరియంలో జరిగిన సాక్షి చైతన్యపథంలోని మేధావులు..వివిధ వర్గాల ప్రజలు హాజరయ్యా రు. రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమారరాజు మాట్లాడుతూ సీబీఐ ప్రజల్లో అపహాస్యమైందన్నారు. యేడాది పాటు జగన్‌ను జైలులో ఉంచడం చూస్తుంటే కుట్ర తప్ప మరొకటిలేదని సామాన్యజనం సైతం అర్ధంచేసుకున్నారన్నారు. 26 జీవోలపై సీఎం సానుకూలంగా మాట్లాడి..జగన్ దోషి కాదని.. నిర్దోషి అని చెప్పకనే చెప్పినట్లయిందన్నారు. 

చిన్నపిల్లల వైద్యనిపుణుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేబినెట్ నిర్ణయాలు జీవో రూపంలో వస్తాయని, అవి చట్టబద్ధత కలిగి ఉంటాయన్నారు. ఈ జీవోల్లో తప్పులేనప్పుడు..ఏ సంబంధంలేని జగన్‌కు ఏం సంబంధం ఉందని సీబీఐ అతడిని అక్రమంగా నిర్భందించిందని ప్రశ్నించారు. డ్వాక్రా సంఘ నాయకురాలు సుభాషిణి మాట్లాడుతూ ఆస్తుల గురించి మాట్లాడే సీబీఐ చంద్రబాబు విషయంలో మాత్రం పక్షపాతం చూపుతోందన్నారు. వాల్మీకి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సాకే బాలాజీ మాట్లాడుతూ కడప ఎంపీగా అత్యధికమెజార్టీతో గెలుపొందిన జగన్‌మోహనరెడ్డిని అక్రమంగా నిర్భంధించడం దారుణమన్నారు. యూపీఏ సర్కారుకు అనుకూలంగా ఉంటే సీబీఐ కన్నెర్ర చేయదని, వ్యతిరేకమైతే దాడులు చేస్తుందని ఇటీవల కరుణానిధి తనయుని విషయంలో తేటతెల్లమైందన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా స్వప్న వ్యవహరించారు. 

ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారు కదయ్యా! 
మాలాంటి బీద, బిక్కి ప్రజలకు రాజశేఖర్‌రెడ్డి ఎంతో సహాయం చేసిండు. స్థలాలు ఇచ్చే.. ఇళ్లు ఇచ్చే.. నెలపొద్దు పిం ఛన్, రోగమొస్తే డబ్బులు లేకుండా పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో సూపించే, పిల్లోళ్లకు ఊరికే చదువులు చెప్పించే, పేదోళ్లకు ఇన్ని చేసిన ఆయన భార్యాబిడ్డలను వేధిస్తున్నారు కదయ్యా.. ఇంత అన్యాయం, అక్ర మం ఎక్కడైనా ఉందా.. మీరే చెప్పండి సామీ. జగన్‌కు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్లకు కూడా దూరం చేసి ఆ పాపం కూడా మూట కట్టుకోవాలా... జగన్‌ను కష్టపెట్టేవారికి ప్రజల ఉసురు తగలక తప్పదు. 
- లక్షుమ్మ, సాతుపల్లె
Share this article :

0 comments: