ఎవరు నిజాయితీగా ప్రజల కోసం పాటు పడితే వారిని మేము సపోర్ట్ చేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎవరు నిజాయితీగా ప్రజల కోసం పాటు పడితే వారిని మేము సపోర్ట్ చేస్తాం

ఎవరు నిజాయితీగా ప్రజల కోసం పాటు పడితే వారిని మేము సపోర్ట్ చేస్తాం

Written By news on Wednesday, June 26, 2013 | 6/26/2013

భారతదేశ న్యాయవ్యవస్థ చాలా గొప్పదని, దైవంతో సమానమైన న్యాయమూర్తులు హైకోర్టులో కాని సుప్రీంకోర్టులో కాని అనేక కేసులలో నిరూపించారు. అటువంటి మహానుభావులను ఆంధ్రప్రదేశ్‌లోని కోట్లాదిమంది హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అనే తారతమ్యం లేకుండా మేమంతా ఒకటే కోరుకుంటున్నాం! మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఎవరు నిజాయితీగా ప్రజల కోసం పాటు పడితే వారిని మేము సపోర్ట్ చేస్తాం. దయచేసి జగన్‌కి బెయిల్ మంజూరు చెయ్యండి. 

మొన్న ఎన్టీఆర్ ప్రభంజనం: 1983 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత దారుణమైన పరిస్థితులుండేవో, కాంగ్రెస్ ఎంతమంది ముఖ్యమంత్రులను మార్చిందో, ప్రజలంతా ఎంత విసిగి వేసారి పోయారో! సరిగ్గా అప్పుడే ఒక ప్రభంజనం ప్రారంభం అయ్యింది. తెలుగు ప్రజల ఆశాజ్యోతిగా పేద, మధ్య తరగతి ప్రజల అశాదీపంగా అవతరించి, ఢిల్లీ పార్లమెంటులో కూడా మన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకస్థానాన్ని, గుర్తింపును తెచ్చిన ఘనత ఆనాడు ఎన్టీఆర్‌కే దక్కింది. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబుగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరి మామగారికే వెన్నుపోటు పొడిచి చివరికి తనే ముఖ్యమంత్రి అయ్యారు. 

నిన్న వైయస్సార్ ప్రభంజనం: 1983 ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం ‘పులివెందుల ముద్దుబిడ్డ’ గా భారీ మెజారిటీతో గెలిచిన ప్రజాబంధువు వైయస్సార్ గారు. చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో హైటెక్ అంటూ పేద, మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేసి మేధావి పాలన కొనసాగించారు. ఆయన వల్ల జనం పడుతున్న బాధలను వైయస్సార్‌గారు తన పాదయాత్రలో స్వయంగా చూసి వారి బాధలను పోగొడతానని హామీలిచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే అద్భుతమైన పథకాలతో ఆ హామీలన్నిటినీ నెరవేర్చారు. 2004లో, 2009లో చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్ని ఎవరితో పొత్తుపెట్టుకున్నా ప్రజలు ఆయన్ని ఓడించారు.

రెండుసార్లు ఇటు రాష్ట్రంలోను, ఇటు కేంద్రంలోను కాంగ్రెస్ పాలనకు ముఖ్యకారకుడైన వైయస్సార్ గారి పాలనను ప్రజలంతా ఒక స్వర్ణయుగంగా నేటికీ కొనియాడుతుండడం తెలిసిందే.త్వరలో జెఎమ్‌ఆర్ ప్రభంజనం: 1983 లో ఎన్టీఆర్ ప్రభంజనం, 2004-2009లో వైయస్సార్ ప్రభంజనం చూశాం. త్వరలోనే 2014లో జెఎమ్మార్ (జగన్‌మోహన్‌రెడ్డి) ప్రభంజనం చూడబోతున్నాం. జగన్ పరిపాలన కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. అందుచేత ప్రజాభీష్టం మేరకు జగన్‌ను విడుదల చేయాలని ప్రజల్లో ఒకడిగా మన న్యాయమూర్తులను కోరుకుంటున్నాను. 
- ఎస్.రాము, కొత్తపేట, హైదరాబాద్
Share this article :

0 comments: