ఈ నరకం మనకొద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ నరకం మనకొద్దు

ఈ నరకం మనకొద్దు

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013

* చంద్రబాబు పాలనలో ప్రజల కష్టాలే ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి: షర్మిల
* వేసిన ప్రతి పంటా నష్టమొచ్చి అప్పుల పాలైపోయామని రైతులు అంటున్నారు..
* ఉప్పు, పప్పు.. ఏది ముట్టుకున్నా ధర ఆకాశాన్నంటుతోంది
* రాబోయే రాజన్న రాజ్యంలో రాష్ట్రం మళ్లీ కళకళలాడుతుంది..
* ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు కట్టించే బాధ్యత జగనన్నదే
* రైతుల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రమంతా అల్లాడిపోయింది. ఆయన రైతుల్ని, పేదల్నీ అసలు మనుషుల్లా కూడా చూడలేదు. రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసిన ప్రతి పంటలోనూ నష్టమొచ్చి అప్పులపాలైపోయాం.. ఆదుకునేవారు లేరని ప్రతి రైతూ చెప్తున్నాడు. ఉప్పు, పప్పు, నూనె, చక్కెర ఏది ముట్టుకున్నా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. ఏదీ కొనేటట్టే లేదని ప్రతి మహిళా ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొన్ని నెలలు వేచి ఉండండి. మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన రాష్ట్రం కళకళలాడుతుంది. 

రాజన్న రాజ్యం రాకపోతే మన రాష్ట్రం బాగుపడదు. గ్రామాలు బాగుపడవు. మన కుటుంబాలు బాగుపడ వు. మన పిల్లలు చదువుకోలేరు. ఆరోగ్యశ్రీ ఉండదు. ఇలా ధరలు పెరుగుతూ పోతుంటాయి..ఈ నరకం ఇక మనకొద్దు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికినిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో సాగింది. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో జరిగిన రచ్చబండలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, కూలీలు తమ గోడు చెప్పుకొన్నారు. వారి కష్టాలు విని ఉద్వేగానికి లోనైన షర్మిల మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు..
‘‘మళ్లీ మాకు రాజన్న రాజ్యం కావాలని ప్రజలందరూ కోరుతున్నారు. దీనికి కారణం రాజశేఖరరెడ్డి అద్భుతమైన పథకాలు ఒకటైతే.. పెద్ద మనసు చేసుకుని ఆయన ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచకపోవడం ఇంకో కారణం. అందరూ కోరుతున్నట్లే త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్కరూ గుడిసెల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు అందించే బాధ్యత జగన్‌మోహన్‌రెడ్డి తన భుజాన వేసుకుంటారు. రైతన్న వాడు తను పండించిన పంటను మార్కెట్‌లో లాభానికి అమ్ముకోలేకపోతే.. ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతారు. రైతులంతా లాభపడేలా చూస్తారు. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. వడ్డీ లేకుండా రుణాలిచ్చే మాట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న మాట కాదు. ఆయనకు విలువ, విశ్వసనీయత లేదు. కనుకనే మాట ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. ఒక్కరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం లేదు. కానీ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి విలువలు, విశ్వసనీయత కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా పడే మనిషి. జగనన్న సీఎం అయ్యాక రైతులకు, మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఇస్తారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్య శ్రీ, అభయ హస్తం లాంటి పథకాలకు మళ్లీ జీవం పోస్తారు.

బెల్ట్ షాపులనేవే ఉండవు..: 
మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో మన ఊళ్లలో బెల్టుషాపులు ఉండవు.. ఒక నియోజకవర్గానికి ఒకే మద్యం షాపు ఉంటుందంతే. ప్రతి మహిళా తలెత్తుకుని మా కుటుంబం బాగుందనుకునే రోజు త్వరలోనే వస్తుంది. మన రాష్ట్రం, మన గ్రామం, మన కుటుంబాలు బాగుపడతాయి. రాజన్న రాజ్యం రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒకటి. రాబోయే ఎన్నికలన్నింటిలో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పి.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తే తప్ప మనకు రాజన్న రాజ్యం రాదు. ’’

11.2 కిలోమీటర్ల నడక
179వ రోజు శుక్రవారం పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు కాకినాడ సినిమారోడ్డులోని వెంకటేశ్వర ఫంక్షన్ హాలు నుంచి ప్రారంభమైంది. సినిమారోడ్డు, కొత్తపేట చిన్న మసీదు, టూటౌన్ పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్, నాగమల్లితోట జంక్షన్, బోటుక్లబ్, సర్పవరం జంక్షన్, భవానీ కాస్టింగ్స్, అచ్చంపేట జంక్షన్‌ల మీదుగా తిమ్మాపురం వరకు సాగింది. ఇక్కడ రచ్చబండలో పాల్గొన్న అనంతరం షర్మిల.. గోవర్ధన్ డెయిరీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బసకు రాత్రి ఏడు గంటల సమయంలో చేరుకున్నారు. 

శుక్రవారం నడిచిన 11.2 కిలోమీటర్లతో పాదయాత్ర 2,372 కిలో మీటర్లు పూర్తయింది. పాదయాత్రలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గనేత చలమలశెట్టి సునీల్, స్థానిక నేతలు చెల్లుబోయిన వేణు, కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

రోజుకి 4 గంటలే కరెంటు..
రచ్చబండలో ‘అమ్మా.. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది?’ అని షర్మిల అడగ్గా.. మహిళలందరూ నాలుగు వేళ్లు చూపిస్తూ నాలుగు గంటలే వస్తోందని చెప్పారు. దీంతో షర్మిల ‘24 గంటలకు 4 గంటలు మాత్రమే వస్తుందా?’ అని అడిగితే ‘అవును, అవును’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు భ్రష్టు పట్టిన తీరును షర్మిలకు వివరించారు. ‘‘అమ్మా.. మీ నాన్న మా కోసం ఎన్నో పథకాలు పెట్టారు. కానీ అవేవీ ఇప్పుడు అమలు జరగడం లేదమ్మా.

ప్రస్తుతం గ్రామాలలో చదువుకున్న వారందరూ ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారమ్మా’’ అని పెందుర్తి సుందరి ఉద్వేగంగా చెప్పింది. దివ్య అనే యువతి మాట్లాడుతూ.. ‘‘మా నాన్న గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేశారు. మరోసారి ఆపరేషన్ చేయటం కుదరదంటున్నారు. మా నాన్నకు మేం ముగ్గురు ఆడపిల్లలం, ఒక తమ్ముడు ఉన్నాం. మా నాన్న లేకపోతే మాకు దిక్కులేదు. మా నాన్న కష్టమ్మీదే మేం బతుకుతున్నాం. మీరే మాకు సహాయం చేయాలమ్మా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ఆమె కష్టాలు విని చలించిపోయిన షర్మిల వైద్యులతో మాట్లాడి వీలైనంత సాయం చేస్తామని ధైర్యం చెప్పారు. ‘‘పావలా వడ్డీ అన్నారు. తరువాత వడ్డీలేని రుణాలు అన్నారు. కానీ తీసుకున్న రుణాలకు రుపాయి వడ్డీ పడుతోంది. రాజశేఖరరెడ్డి సమయానికి అందించే డ్వాక్రా రుణాలు ఇప్పుడు ఇచ్చే వారు కనిపించటం లేదు’’ అంటూ సత్యవతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
Share this article :

0 comments: