‘జగన్ ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి.. ఆయన జనం సొంతం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘జగన్ ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి.. ఆయన జనం సొంతం..

‘జగన్ ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి.. ఆయన జనం సొంతం..

Written By news on Thursday, June 6, 2013 | 6/06/2013

*రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాశారు
*అక్రమాస్తుల కేసు అనే ప్రచారం తగదు
*క్విడ్‌ప్రోకోకు పాల్పడింది చంద్రబాబే 


‘జగన్ ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి.. ఆయన జనం సొంతం.. జగన్‌ను అరెస్టు చేసి జనం గొంతుకు సంకెళ్లు వేశారు. మనది ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం మన దేశంలో పుట్టిన వ్యక్తికి హక్కులు కల్పించింది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదీ..న్యాయస్థానాలదీ.. అటువంటిది జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో ఏడాదిగా నిర్బంధించారు. ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే’ అంటూ పలువురు మేధావులు, న్యాయవాదులు, మహిళలు అభిప్రాయపడ్డారు.

సాక్షి, తిరుపతి: సహజ న్యాయసూత్రాలను.. మానవ హక్కులను కాలరాసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో నిర్బంధించారని, అయితే జనం గుండెల్లో బందీ అయిన ఆయన్ను వారి మనసుల నుంచి తొలగించడం ఎవరికీ సాధ్యం కాదని పలువురు వక్తలు స్పష్టం చేశారు. నగరంలో బుధవారం ‘సాక్షి’ చైతన్యపథం చర్చా వేదిక నిర్వహించింది. ఈ చర్చావేదికకు స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చర్చావేదిక ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు అన్యాయమంటూ పలువురు మహిళలు వెక్కివెక్కి రోదించడంతో పలువురి గుండెలు బరువెక్కాయి. వ్యక్తి స్వేచ్ఛ హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు ఉద్యమిస్తామంటూ పలువురు యువకులు పిడికిళ్లు బిగించారు. 

ఉన్నత విలువలతో, న్యాయపరిరక్షణకు అహరహం కృషిచేసిన పలువురు న్యాయమూర్తులను నేడు న్యాయవ్యవస్థ లో కొనసాగుతున్నవారు ఆదర్శంగా తీసుకోవాలని అప్పుడే రాజకీయాలకు అతీతంగా సమన్యాయం అందుతుందని న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారు. చర్చావేదికలో పలువురు మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాంకుండా ప్రతిపక్ష పార్టీల నేతల కుమ్మక్కు వైఖరిపై దుమ్మెత్తిపోశారు. సోనియాగాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, బొత్స సత్యనారాయణ, చిరంజీవిపై వారు మండిపడ్డారు. తొలుత వ్యాఖ్యాత స్వప్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టును ఏవిధంగా పరిగణిస్తున్నారంటూ చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు కిరణ్‌రాయల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ జనాదరణ కలిగిన నేతగా ఎదుగుతున్న జగన్‌ను అడ్డుకునేందుకు, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకే కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి జగన్‌ను జైల్లోపెట్టి బైటకు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు.

క్విడ్‌ప్రోకోకు చంద్రబాబు అర్హుడు 

తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు నేడు వేలకోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని, అవి ఎలా వచ్చాయని రైతు సంఘం నాయకుడు ఆదికేశవులురెడ్డి ప్రశ్నించారు. క్విడ్‌ప్రోకోకు అర్హుడు చంద్రబాబునాయుడేనని, ముందుగా అరెస్టు చేయాల్సింది ఆయన్నేనన్నారు. ఏవ్యక్తినైనా అరెస్టుచేసి 90 రోజులు జైల్లో ఉంచితే బెయిల్ ఇవ్వాలని, జగన్ విషయంలో మాత్రం సహజ న్యాయసూత్రాలను పక్కనపెట్టి సీబీఐ, హైకోర్టు, సుప్రీంకోర్టు బైయిల్‌ను తిరస్కరించాయని మునిసిపల్ మాజీ కమిషనర్ మోహన్‌రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో 5 లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందిన జగన్ ప్రజా కోర్టులో నిర్దోషి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరిపివేయలేవన్నారు. ఓ ఇంటికి మగదిక్కుని.. రాష్ట్ర ప్రజల నాయకుడ్ని జైల్లోపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. 

ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనలో పలువురు జైలు పాలయ్యారని, అందులో తాను, భూమన కరుణాకరరెడ్డి ఉన్నట్టు శ్వేత మాజీ డెరైక్టర్ భూమన్ తెలిపారు. న్యాయ వ్యవస్థ తీరును వామపక్ష పార్టీలు కూడా తప్పుపడుతున్నాయని ఆయన అన్నారు. తన తండ్రి కోసం మరణించిన కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ఓదార్పుయాత్ర కొనసాగితే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని దళిత సంఘం నేత ధనశేఖర్ అన్నారు. బోఫోర్స్, 2జి స్పెక్ట్రం, స్టాంప్ కుంభకోణంలో అరెస్ట్ అయిన వారిని బె యిలుపై వదిలేశారని, ఎటువంటి నేరం రుజువుకాకపోయినా జగన్‌ను ఏడాదికిపైగా జైల్లో పెట్టటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదంతా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు కుమ్ముక్కై నడిపిస్తున్న నాటకమని విమర్శించారు.

తమిళనాడు గతే రాష్ట్రంలో కూడా 

కాంగ్రెస్‌కు తమిళనాడులో పట్టిన గతే ఆంధ్రరాష్ట్రంలోనూ పడుతుందని డాక్టర్ హేమకుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కొందరు వృద్ధనాయకులు అధిష్టానానికి నేరాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ పతనానికి కారకులయ్యారన్నారు. పులి కడుపున పులే పుడుతుందనేందుకు జగన్‌మోహన్‌రెడ్డి నిదర్శనమన్నారు. జగన్ పుట్టుతోనే నిష్కళంకమైన రాజకీయ నాయకుడన్నారు. కుటిల రాజకీయాలు రాజకీయ అనుభవంతో వచ్చేవేనని తేల్చిచెప్పారు. ఇందిరాగాంధీ నియంత పాలనతో ఆమె నామరూపాలు లేకుండా పోయిందని కుసుమకుమారి అభిప్రాయపడ్డారు. సీబీఐ, న్యాయవ్యవస్త, ఈడీ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నాయని మైనారిటీ సంఘం నాయకుడు మహ్మద్ ఖాద్రి అన్నారు.
Share this article :

0 comments: