10,11 తేదీల్లో విజయనగరంలో షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 10,11 తేదీల్లో విజయనగరంలో షర్మిల పాదయాత్ర

10,11 తేదీల్లో విజయనగరంలో షర్మిల పాదయాత్ర

Written By news on Wednesday, July 3, 2013 | 7/03/2013

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 10, 11 తేదీల్లో విజయనగరం జిల్లాలో ప్రవేశించనుందని వైఎస్సార్సీపీ నేత సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో పడుతున్న ఇబ్బందులను షర్మిళతో చెప్పుకోవడానికి ప్రజలకు ఇదో మంచి అవకాశమని ఆయన బుధవారమిక్కడ అన్నారు. 

జిల్లాలో 9 నియోజకవర్గాల మీదుగా 160 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుందని రంగారావు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 8న ఇడుపులపాయలో జరగనున్న పార్టీ ప్లీనరీకి జిల్లా నుంచి పార్టీ ప్రతినిధులతో పాటు వైఎస్సార్ అభిమానులందరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ప్లీనరీ వాల్‌పోస్టర్‌ను మరో నేత పెన్మత్స సాంబశివరాజు ఆవిష్కరించారు 
Share this article :

0 comments: