షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్న 108 ఉద్యోగులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్న 108 ఉద్యోగులు

షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్న 108 ఉద్యోగులు

Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013


సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తే అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని 108 ఉద్యోగులు షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం భైరి జంక్షన్ వద్ద ఆమెను 108 ఉద్యోగులు కలిశారు. మహానేత వైఎస్సార్ చేసిన మేలును కొనియాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ వినతి పత్రం అందజేశారు. రోజుకి ఎనిమిది గంటలు పనిచేయించాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని, కనీసం వేతనం రూ.15వేలు చెల్లించాలని కోరుతూ సమ్మెకు దిగితే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదలై వచ్చామని వివరించారు. అరెస్టులెందుకు చేశారని షర్మిల ప్రశ్నించగా 108 వాహనాల షెడ్‌లలో ఎక్విప్‌మెంట్‌ను దొంగిలించామని, వాహనాలను పాడు చేస్తున్నామన్న ఆరోపణలతో అక్రమ కేసులు పెడుతున్నట్టు తెలిపారు. ఈ అభియోగాలు వాస్తవం కాదని, వాహనాలను పాడు చేస్తే భవిష్యత్‌లో ఇబ్బంది పడేది తామేనని, అలాంటి పని ఎక్కడా చేయలేదని వివరించారు. షర్మిల స్పందిస్తూ ఆరు నెలల్లో మన ప్రభుత్వం వస్తోందని, జగనన్న సీఎం కాగానే న్యాయం చేస్తారని, సమర్థంగా 108 సర్వీసును నిర్వహిస్తారని భరోసా ఇచ్చారు. దీనిపై పోలీసులతో, 108 యాజమాన్యంతో మాట్లాడాలని నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసుకు షర్మిల సూచించారు.
Share this article :

0 comments: