200 రోజులు.. 100 నియోజకవర్గాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 200 రోజులు.. 100 నియోజకవర్గాలు

200 రోజులు.. 100 నియోజకవర్గాలు

Written By news on Thursday, July 4, 2013 | 7/04/2013

మరో ప్రజాప్రస్థానం 04-07-2013
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారంనాడు మరో మైలు రాయి చేరుకోనుంది. ఆమె పాదయాత్ర ప్రారంభించి శుక్రవారం నాటికి 200 రోజులు పూర్తవుతుంది. వంద నియోజకవర్గాల్లో నడిచిన తొలి మహిళగా కూడా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ, కిరణ్ కుమార్ రెడ్డిలపై ఆమె తనదైన శైలిలో చేస్తున్న విమర్శలు ఆమె పాదయాత్రకు విశేష స్పందన తెచ్చిపెడుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఆమె యాత్రకు హాజరవుతూ.. జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు గారికి లేనిదీ.. రాజన్నకు, జగనన్నకు ఉన్నదీ మాట మీద నిలబడడమనే లక్షణమని ఆమె చేసిన వ్యాఖ్య ప్రతి సభలోనూ హర్షధ్వానాలను అందుకుంటోంది. 

పాదయాత్రలో ఆమె వేసే ఒక్కో అడుగూ.. ఒక్కో చరిత్ర సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే 2500 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేసుకుని 3000 కిలోమీటర్ల లక్ష్యానికి ఆమె యాత్ర చేరువవుతోంది. కిందటేడాది అక్టోబరు 12న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత సమాధి నుంచి శ్రీమతి షర్మిల యాత్రను మొదలుపెట్టారు. విశాఖ సౌత్ నియోజకవర్గం ఆమె పాదయాత్ర చేయనున్న వందో నియోజకవర్గంగా నిలవనుంది. ఇప్పటికి పదకొండు జిల్లాల్లో పూర్తయిన యాత్ర ప్రస్తుతం పన్నెండో జిల్లాలో సాగుతోంది. వైయస్ఆర్ కడప జిల్లా, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తయ్యింది. ఇప్పుడు విశాఖలో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు తన పాదయాత్రలో 86 నియోజకవర్గాలలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం శ్రీమతి షర్మిల 97వ  నియోజకవర్గంలో యాత్ర చేస్తున్నారు. వైయస్ఆర్ జిల్లాలో ఒకటి, అనంతపురంలో ఐదు, కర్నూలు జిల్లాలో ఎనిమిది, మహబూబ్ నగర్ జిల్లాలో ఎనిమిది, రంగారెడ్డి జిల్లాలో మూడు, నల్గొండ జిల్లాలో ఐదు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 14 చొప్పున, ఖమ్మం జిల్లాలో ఎనిమిది, పశ్చిమ గోదావరి జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాలలో ఆమె పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లాలో ఆమె వందో నియోజకవర్గంలో యాత్ర చేయనున్నారు.  తమ జిల్లాలో రెండు వందల రోజులు, వంద నియోజకవర్గాలలో శ్రీమతి షర్మిల పాదయాత్రను పూర్తిచేయనుండటంపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.కె. బీచ్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. ఇంతవరకూ శ్రీమతి షర్మిల 38 పురపాలక సంఘాలు, 158 మండలాలు, 1565 గ్రామాలలోని ప్రజలను శ్రీమతి షర్మిల పలుకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ సాగారు. బుధవారానికి ఆమె పాదయాత్ర 2637 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈనెల పది లేదా పదకొండునాటికి శ్రీమతి షర్మిల పాదయాత్ర విజయనగరం జిల్లాలో అడుగుపెట్టనుంది.

http://www.ysrcongress.com/news/top_stories/sharmila-to-reach-another-milestone.html
Share this article :

0 comments: