881 పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 881 పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవం

881 పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవం

Written By ysrcongress on Thursday, July 18, 2013 | 7/18/2013

 881 లో 855 వివరాలు:
 
హైదరాబాద్, 18 జూలై 2013(www.ysrcongress.com : 
 
 వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రతో అధికార కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బు వెదజెల్లినా.. ప్రధాన ప్రతిపక్షం ‌టిడిపి కూడా దానితో కుమ్మక్కయినా పంచాయతీ ఎన్నికల్లోనూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అభిమానుల ప్రభంజనమే ‌వీస్తోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల ‘లెక్క’ చూస్తే ప్రత్యర్ధులపై వైయస్ఆర్‌ కాంగ్రెస్ స్పష్టమైన ఆధి‌క్యాన్ని చూపించింది. రాయలసీమ, ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో పార్టీ హవా బలంగా ఉంది. దీనితో కాంగ్రెస్, ‌టిడిపిల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో సర్పంచ్‌ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. తెలంగాణ జిల్లాల్లోనూ గణనీయమైన స్థానాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారు‌ ఏకగ్రీవ పంచాయతీల్లో జెండా ఎగరేశారు.


‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కాంగ్రెస్ పార్టీ‌కి అధికార కాంగ్రెస్‌ సీమాంధ్రలో ఒక్క విజయనగరం మినహా మరెక్కడా కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. సాక్షాత్తూ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో 150 పంచాయతీలను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ కేవలం 33, ‌టిడిపి 66 పంచాయతీలతోనే సరిపెట్టుకున్నాయి. వైయస్ఆర్ జిల్లాలో కాంగ్రెస్, ‌టిడిపి రెండూ కలిపి కేవలం 43 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఏకంగా 101 స్థానాలను కైవసం చేసుకున్నారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ భారీసంఖ్యలో పంచాయతీలు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పరమయ్యాయి. ఈ జిల్లాల్లో‌నూ కాంగ్రెస్, టిడిపిలు చతికిలపడ్డాయి.

ఇక పంచాయతీ ప్రచార పర్వం :
రాష్ట్ర వ్యాప్తంగా 2,600 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవు‌లు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం గడువు ముగియడంతో రంగంలో మిగిలిన అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21,441 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవులకు ఒకే నామినేష‌న్ వచ్చిన పంచాయతీలు 838 మాత్రమే ఉం‌డగా.. ఉపసంహరణ ముగిసిన తరువాత ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల సంఖ్య దాదాపు మూడింతలు పెరగడం గమనార్హం. ఏకగ్రీవమైన పంచాయతీల్లో నిబంధనల ప్రకారం ఉపసర్పంచ్ ఎన్నికలను ఆయా గ్రామాల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పూర్తిచేశారు.

‌నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి బుధవారం అర్ధరాత్రి వరకు జిల్లాల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం రాలేదు. ఉపసంహరణ తరువాత ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి? ఎన్ని పంచాయతీలకు ఎంతమంది అభ్యర్థులు ఇంకా రంగంలో ఉన్నారన్న వివరాలు గురువారానికి కానీ వెల్లడించలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 2006లో జరిగిన ఎన్నికల్లో దాదాపు మూడు వేల పైచిలుకు పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఇప్పుడా సంఖ్య తగ్గడం గమనార్హం.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటి దశ ఎన్నికల నిర్వహణపై దృష్టిపెట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు దాదాపు వారం రోజులు ప్రచార గడువు ఉండడంతో.. ప్రచార సరళిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు, వారి వెన్నంటి ఉన్న రాజకీయ పార్టీల వ్యూహాలను తిప్పికొట్టడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ఘర్షణ, దౌర్జన్యాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఎక్కడ చిన్న గొడవ జరిగినా సమాచారం అందిన వెంటనే ఆ గ్రామానికి వెళ్లడానికి వీలుగా ఫ్లయింగ్ స్క్వా‌డ్‌లను ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల్లో ఉండే విధంగా ఈసారి సీనియర్ ఐ‌ఎఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా ప్రతి జిల్లాకు ఇద్దరిని నియమించడంతో‌ పాటు, అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించడానికి ఒక్కో జిల్లాకు ఒక ఐఎఫ్ఎ‌స్ అధికారిని నియమించారు. వీరంతా ఆయా జిల్లాల్లో మకాం వేసి పరిస్థితి సమీక్షించనున్నారు.

ధన‌ం, మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఎక్సైజ్, పోలీసు అధికారులు కలిసి దాడుల నిర్వహించాలని, వాహనాలను తనిఖీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే పోలీసులు వాహనాల తనిఖీల్లో లక్షలాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమస్యాత్మక, సున్నితమైన గ్రామాల్లో ఎక్కువ పోలీసు బలగాలను నియమించాలని, ఇదివరకు కేటాయించిన పోలీసు సిబ్బందిని, ఏకగ్రీవమైన పంచాయతీల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరింది. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. ఓటర్లు 14 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది చూపించినా ఓటింగ్‌కు అనుమతించాలని ఎన్నికల సంఘం ఇదివరకే అధికారులను ఆదేశించింది. నామినేషన్ల వ్యవహారం ముగిసినందున ఈ నెల 23న మొదటి విడత, 27న రెండవ విడత, 31న మూడవ విడత ఎన్నికలు జరుగుతాయి.
 http://www.ysrcongress.com/news/top_stories/ysr-congress-wind-in-unanimus-panchayats.html
 
Share this article :

0 comments: