- రాజమండ్రి ఎంపీ వ్యాఖ్యలపై అంబటి ఫైర్
సాక్షి, హైదరాబాద్: వార్షిక నివేదిక పేరుతో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజమండ్రిలో నిర్వహించిన సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం వెనుక సోనియాగాంధీ హస్తముందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారని చెప్పిన ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆ విషయంలో తెగ బాధపడిపోతూ మాట్లాడుతున్నారని, అయితే వైఎస్‌ను దోషిగా నిలబెడుతూ సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పుడు ఉండవల్లి ఎక్కడికెళ్లారని అంబటి రాంబాబు విమర్శించారు.
ఉండవల్లి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైంది వైఎస్ చలవతోనేనని, అలాంటిది వైఎస్ ఉన్నప్పుడు ఆయన కొడుకు మంచివాడని, వైఎస్ మరణించిన తర్వాత జగన్ అవినీతిపరుడని మాట్లాడుతున్నారని, ఉండవల్లి ఎక్కడుంటే అక్కడ ఆ మాట మాట్లాడతారనే పేరుం దని నిందించారు. వైఎస్ చేసినవన్నీ మంచిపనులని అంటున్నారని, అలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన 26 జీవోల గురించి ఎందుకు మాట్లాడటం లేదని, కొంతమంది మంత్రులు జైల్లోనూ, మరికొందరు బయటా ఉంటే సీబీఐ దర్యాప్తుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గత ఏడాది వార్షిక నివేదిక విడుదల చేసినప్పుడు ఉండవల్లి ఏమీ మాట్లాడలేదని, ఇప్పుడు అధిష్టానం ఒత్తిడితోనే ఈ రకంగా మాట్లాడుతున్నారని సాక్షి టీవీతో చెప్పారు. అవినీతి ఎక్కడున్నా చీల్చి చెండాడుతాడని చెప్పుకునే ఉండవల్లి మరి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై భూముల కొనుగోలు ఆరోపణలు వస్తే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉండవల్లికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో ఆయనే చూస్తాడని అన్నారు.

0 comments:
Post a Comment