జైలు గోడలు బద్దలయ్యేలా ప్రజాతీర్పు వెలువడుతుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జైలు గోడలు బద్దలయ్యేలా ప్రజాతీర్పు వెలువడుతుంది

జైలు గోడలు బద్దలయ్యేలా ప్రజాతీర్పు వెలువడుతుంది

Written By news on Friday, July 12, 2013 | 7/12/2013


ఎన్ని అవరోధాలు ఎదురైనా లెక్కచేయకుండా తాము విశ్వసించే న్యాయమైన విలువల కోసం ఒంటరి పోరాటం సాగించిన ప్రజానాయకులు, యోధులు చరిత్రలో అతి కొద్దిమందే కనిపిస్తారు. ఆ కోవకు చెందే లీడరే జగనన్న. ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా సహిస్తూ ముందుకు సాగిపోయే గుణమే ఆయన ఓదార్పుయాత్రను విజయవంతం చేసింది. ఆయన విరోధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తప్పుచేసిన నాయకులు ఎంతోమంది బయట తిరుగుతుండగా, ప్రజానాయకుడిని తీసుకెళ్లి బలవంతంగా నిర్బంధించిన కాంగ్రెస్‌పార్టీకి రాష్ట్రప్రజలు తప్పక గుణపాఠం నేర్పుతారు. 2014లో జైలుగోడలు బద్దలయ్యేలా తీర్పు ఇస్తారు. జగనన్నని సి.ఎం.ని చేస్తారు.
- పి.మనోహరం, పులిదిండి, ఆత్రేయపురం (మం), తూ.గో.జిల్లా 

ఈరోజు ఇన్ని మాటలు అంటున్నవారికి...రేపు ఇక మాట్లాడేందుకు ఏమీ ఉండదు 

జగన్‌ని జైల్లో పెట్టి పదమూడు నెలలు దాటాయి. తలచుకుంటేనే గుండె బరువెక్కుతోంది. ఎందుకు ఆయనకు ఇంత పెద్ద శిక్ష? రాష్ట్రంలో మరణశయ్యపై ఉన్న కాంగ్రెస్‌పార్టీని వరుసగా రెండుసార్లు ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి తెచ్చినందుకా? పాదయాత్ర ద్వారా ప్రతి పేదవాడి కష్టం తెలుసుకుని సంక్షేమపథకాల అమలుతో ఆదుకున్నందుకా? వై.ఎస్.గారు ఎంతసేపూ రాష్ట్రప్రజల అభ్యున్నతి గురించే ఆలోచించారు తప్ప జగన్‌కోసం ఆయన చేసింది ఏమీ లేదు. పెపైచ్చు రాహుల్ ప్రధానిని చేయాలని పరితపించారు. అటువంటిది ఆ మహానేత తనయుడిపై కాంగ్రెస్ ఎందుకింత కక్ష కట్టింది? జగన్ నిజాయితీపరుడు కాబట్టి ఇంతకాలం జైల్లో ఉన్నా చెక్కుచెదరని నిబ్బరంతో ఉన్నారు. అదే తప్పు చేసి ఉంటే ఏనాడో సోనియాకి సరెండర్ అయివుండేవారు తప్ప ఇలా ప్రజలవైపు, ప్రజలకోసం నిలబడేవారు కారు. ఆ విధంగా చూస్తే జగన్‌దే అన్నివిధాలా నైతిక విజయం. రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్ సచ్ఛీలతే ఆయన్ని ముఖ్యమంత్రిగా నిలబెడుతుంది. ఈరోజు ఇన్ని మాటలు అంటున్న వారికి ఆరోజున ఇక మాట్లాడేందుకు ఏమీ ఉండదు.

- ఎస్.ఎం.బేగం, రాజమండ్రి

చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: