శ్రీకాకుళం జిల్లాలో షర్మిలకు ఆపూర్వ ఆదరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శ్రీకాకుళం జిల్లాలో షర్మిలకు ఆపూర్వ ఆదరణ

శ్రీకాకుళం జిల్లాలో షర్మిలకు ఆపూర్వ ఆదరణ

Written By news on Thursday, July 25, 2013 | 7/25/2013

మరో ప్రజాప్రస్థానం 25-07-2013
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆమె అడుగుపెట్టిన ప్రతిచోట అద్వితీయ స్పందన కనిపిస్తోంది. జోరు వాన, హోరు గాలిలో సైతం షర్మిల పాదయాత్ర కొనసాగిస్తునే ఉన్నారు. ప్రతికూల వాతావరణంలో కూడా అభిమానులు, కార్యకర్తలు ఆమె అడుగులో అడుగువేస్తూ నడుస్తున్నారు. దివంగత మహానేత హయాంలో తాము లబ్దిపొందిన పథకాలను గుర్తు చేసుకుంటున్నారు.

పాలకొండ నియోజకవర్గం కెల్ల గ్రామంలో ఈ నెల 21న షర్మిల ఈ జిల్లాలో అడుగుపెట్టారు. అక్కడ నుంచి మొదలైన అభిమానులు, కార్యకర్తల ఆదరణ కొనసాగుతూనే ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు షర్మిల పాలకొండ , ఆముదాలవలస నియోజకవర్గాల్లో నడిచారు. కెల్ల, పాలకొండ, ఆముదాలవలసలలో 3 బహిరంగ సభల్లో ప్రసంగించారు. 220వ రోజు పాదయాత్ర ఆముదాలవలస నియోజకవర్గంలో కొనసాగింది. ఆముదాలవలసలోని రైల్వేస్టేషన్‌ జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు ప్రజా సంక్షేమం పట్టదన్నారు. చంద్రబాబు బాటలోనే కిరణ్‌ ప్రభుత్వం పయనిస్తోందని విమర్శించారు.

దారిపొడవునా అభిమానులు, కార్యకర్తలు, వైఎస్ హయాంలో లబ్దిపొందినవారు ఆమెను కలుస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ బాధలు చెప్పుకుంటున్నారు. తాము లబ్దిపొందిన పథకాలను వివరిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పిల్లలను చదివించుకున్నామని, ఇప్పుడు ఆ పరిస్థితిలేదని మహిళలు చెప్పారు. పిల్లలను కాలేజీకి పంపించాలంటేనే భయమేస్తోందన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అటూఇటూ తిరగలేక చస్తున్నామన్నారు.
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వస్తే పనులు దొరుకుతాయని ఆశిస్తున్నట్లు రైతు కూలీలు పేర్కొన్నారు. మరోవైపు కాలేజీలకు వెళ్లాలంటే బస్సులు ఉండటంలేదని విద్యార్ధులు చెప్పారు. వృద్ధులు అనేకమంది షర్మిలను కలుస్తున్నారు. పింఛన్‌ ఇచ్చారని, ఒకరి దగ్గర చేయి చాపకుండా భరోసా ఇచ్చారనే అభిమానం చూపుతున్నారు. ఇంటికి పెద్ద కొడుకులా అన్ని చూసుకున్నారని చెబుతున్నారు. ఆ అభిమానంతో వృద్దులు మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్‌ వలనే సమాజంలో బతుకగలుగుతున్నామని ఇప్పటికీ లక్షల మంది వృధ్దులు షర్మిలకు స్వయంగా చెప్పారు. జగనన్న వస్తే 700 రూపాయలు పింఛన్ ఇస్తారు అని షర్మిల వృద్దులకు ధైర్యం చెప్పారు. 30 కేజీల బియ్యం ఇస్తారని భరోసా ఇచ్చారు. వృద్దుల్లో అంతులేని విశ్వాసాన్ని నింపుతున్నారు. వృద్దులు కనబడితే చాలు షర్మిల ఆగిపోతున్నారు. వృద్దుల చేతులు పట్టుకుని ముద్దాడుతూ తాత జాగ్రత్త, అవ్వా జాగ్రత్త అంటూ షర్మిల ముందుకు కదులుతున్నారు.

మరో ప్రజాప్రస్థానం 25-07-2013
జిల్లాలో ఈరోజు వరకు 61.7 కిలో మీటర్లు నడిచారు. శ్రీకాకుళం జిల్లాలో షర్మిల మరో 5 నియోజకవర్గాల్లో నడవాల్సి ఉంది.

మరో ప్రజా ప్రస్థానం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. అక్కడ పైలాన్‌ నిర్మాణానికి వైఎస్‌ఆర్‌ అభిమానులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే స్థల సేకరణ, భూమిపూజ జరిగాయి. వైఎస్ఆర్‌ కూడా ప్రజా ప్రస్థానాన్ని ఇచ్చాపురంలోనే ముగించారు. ఇప్పుడు షర్మిల మరో ప్రజా ప్రస్థానం కూడా ఇక్కడే ముగియనుండటంతో స్థానిక వైఎస్ఆర్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రజా ప్రస్థానం పైలాన్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెప్పారు.
Share this article :

0 comments: