పలుచోట్ల వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు ఏకగ్రీవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పలుచోట్ల వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు ఏకగ్రీవం

పలుచోట్ల వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు ఏకగ్రీవం

Written By news on Wednesday, July 17, 2013 | 7/17/2013

రాష్ట్రంలో పలు పంచాయతీలలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో 9 పంచాయతీలను ఆ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో 10 పంచాయతీలలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4 పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో 24 పంచాయతీలలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పుల్లంపేట మండలం జలగవారిపల్లెలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం గొల్లలకుంట పంచాయతీలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ మల్లవరం పంచాయాతీని ఆ పార్టీ మద్దతుదారుడే గెలుచుకున్నాడు. రంపచోడవరం నియోజకవర్గం ఎల్లవరం, మట్లపాడు పంచాయతీలలో కూడా ఆ పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవం అయ్యారు. 
రామచంద్రపురం నియోజకవర్గం పేకేరు, తామరపల్లి, ఎండగండి, ఆదివారపుపేట, తనుమళ్ల, తార్లంపూడిలలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు ఏకగ్రీవం అయ్యారు. 

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో 5 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. జలాల్పూర్, సిద్ధాపూర్, బొప్పాపూర్, రాంపూర్, పోచారం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మెదక్ జిల్లా జహిరాబాద్ మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం అయింది. 

వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో 2 సర్పంచ్ పదవులకు కాంగ్రెస్ మద్దతుదారులు, ఒకరు ఇండిపెండెంట్, ఇద్దరు టీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్ పదవులకు ఎంపికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీలలో వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు ఏకగ్రీవం అయ్యారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 24 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
Share this article :

0 comments: