జగన్ మాత్రమే తమ నాయకుడని...ప్రజలు తేల్చి చెప్పబోతున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ మాత్రమే తమ నాయకుడని...ప్రజలు తేల్చి చెప్పబోతున్నారు

జగన్ మాత్రమే తమ నాయకుడని...ప్రజలు తేల్చి చెప్పబోతున్నారు

Written By news on Saturday, July 20, 2013 | 7/20/2013

జనహృదయనేత, పేదల పాలిట ఆశాదీపం, బడుగువర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని జైలుపాలు చేయడం ఒక సామాజికనేరం. ప్రజలకు మంచి చేస్తున్న వ్యక్తిని నిర్బంధించడమంటే ప్రజావ్యతిరేక విధానానికి పాల్పడడమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ గ్రహించడం లేదు. 

లెక్కకు మిక్కిలి ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సకాలంలో పేద, మధ్యతరగతి ప్రజలకు అందించిన ఘనత మహానేత వై.ఎస్.గారిదైతే... ఈ పథకాలన్నిటికీ తూట్లు పొడిచి ప్రజల కష్టాల్ని మరింత పెంచి, వారిని అయోమయంలో పడే సిన నిర్లక్ష్యం ప్రస్తుత ప్రభుత్వానిది. జగన్ కనుక బయట ఉండి ఉంటే ఇలా జరిగేదే కాదు. ఎప్పటికప్పుడు సభల ద్వారా, దీక్షల ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. అసలు అలా చేస్తారన్న భయంతోనే కాంగ్రెస్ ఇంత కుటిల రాజకీయానికి ఒడిగట్టిందని అర్థమౌతూనే ఉంది. నాడు పెద్దాయన సాయంతో పదవులు పొందిన వారు నేడు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన్ని విమర్శించడాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

పేదవారు ఏమి ఆశిస్తున్నారో వై.ఎస్.ఆర్.కి, జగన్మోహన్‌రెడ్డికి తెలిసినంతగా మరే నాయకుడికీ తెలియదని ఇప్పటికే రూఢీ అయింది. వచ్చే ఎన్నికల్లో ఇదే విషయం ఈ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులకు మరింత స్పష్టంగా తెలియజెప్పేలా ప్రజలు తీర్పు ఇస్తారు. జగన్ మాత్రమే తమ నాయకుడని తేల్చి చెబుతారు. కనీసం అప్పుడైనా ప్రస్తుత పాలక, ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకుంటాయని ఆశిద్దాం. ఆ రోజుకోసం అందరమూ ఎదురు చూద్దాం. 

- ఆర్.వెంకటేశ్, బెంగళూరు

జగనన్న విడుదలైతేనే... ప్రజలకొక భరోసా లభిస్తుంది

వైయస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిగారికి (మా జగనన్న) ప్రజల అండదండలు ఎప్పటికీ ఉంటాయి. జగనన్నకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కక్షపూరిత విమర్శలకు దిగజారుతున్నాయి. అసత్య ఆరోపణలతో ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నాయి. ఈ అవినీతి ప్రభుత్వానికి, దీనికి చేయూతగా నిలబడ్డ తెలుగుదేశంపార్టీకి ప్రజలు త్వరలోనే తగినరీతిలో బుద్ధి చెబుతారు. వై.ఎస్.ఆర్. ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు ప్రస్తుత ప్రభుత్వపాలనలో మూలన పడ్డాయి. వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు అందాల్సిన పింఛను ఇవ్వకుండా అధికారులు పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. 

పింఛనుకోసం పడిగాపులు పడలేక కొన్ని పండుటాకులు రాలిపోయాయి కూడా! ఆ ఉదంతాలు పత్రికలలో వచ్చినా కూడా ఆ అధికారులను కట్టడి చెయ్యలేని ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.

ప్రజలు ధీమాగా బతకాలంటే జగనన్న విడుదల కావడమొక్కటే మార్గం. ఆయన మాత్రమే రాజన్న పాలనను తిరిగి తేగలరు. మిగతావారంతా అధికారం కోసం ప్రజాసంక్షేమాన్ని జపిస్తున్నవారే కానీ నిజంగా ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్న తపన ఉన్నవారు కాదు. 

- శ్రీకాంత్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా
Share this article :

0 comments: