ఇన్నిరోజులు పాదయాత్ర చేయడం చరిత్రాత్మకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇన్నిరోజులు పాదయాత్ర చేయడం చరిత్రాత్మకం

ఇన్నిరోజులు పాదయాత్ర చేయడం చరిత్రాత్మకం

Written By news on Thursday, July 18, 2013 | 7/18/2013

సమస్యలపై పోరాడాలి...
‘‘షర్మిల ఒక మహిళగా ఇన్ని రోజులు పాదయాత్ర చేయడం చరిత్రాత్మకం. ఈ పాదయాత్ర వల్ల ప్రజల సమస్యలను, ముఖ్యంగా వ్యవసాయ, రైతాంగ సమస్యలు తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. అయితే.. పాదయాత్రలో తె లుసుకున్న ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసినప్పుడే యాత్ర లక్ష్యం నెరవేరుతుంది.’’
- స్వరూపారాణి,
ఐద్వా ప్రధాన కార్యదర్శి


ప్రజలకు అండగా నిలవాలి..
‘‘షర్మిల పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసినందుకు నా అభినందనలు. ఒక మహిళగా ఆమె ఎంతో సాహసోపేతమైన యాత్ర చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆమె ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నాను.’’
- జాజుల గౌరి, బీజేపీ నాయకురాలు

ప్రజలకు నమ్మకముంది..
‘‘షర్మిలమ్మ మహా పాదయాత్రను గిన్నిస్‌బుక్‌లో చేర్చాలి. పాదయాత్ర ద్వారా ఆమె అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకుని, పరిష్కార మార్గాలను సైతం అన్వేషిస్తున్నారు. వారి కుటుంబంపై ప్రజలకు నమ్మకముంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆమె నోట్ చేసుకుని, భవిష్యత్తులో వాటి పరిష్కారానికి కృషిచేస్తారన్న నమ్మకం నాకుంది. ఏదిఏమైనా ఆమె ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.’’
- ఎ.రమ్యకుమారి,
మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు,
హైకోర్టు న్యాయవాది



అభినందిస్తున్నా.. 
‘‘షర్మిల దీక్షా, దక్షతలకు హర్షిస్తున్నా. ఇన్నివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నా. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని షర్మిల నిరూపించారు.’’
- పద్మజా రెడ్డి. జాతీయ పర్యాటక సలహా మండలి సభ్యురాలు,
నర్తకీమణి 



మహిళలకు గర్వకారణం..
‘‘షర్మిల రాష్ట్రంలోని మహిళలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నారు. ఒక మహిళ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదు. ఆమె ప్రజల సమస్యలన్నీ ఓర్పుతో వింటూ వారికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. రచ్చబండ ద్వారా ప్రజల వినతులను స్వీకరించి.. వాటి పరిష్కారం కోసం స్థానిక నాయకులకు సూచనలిస్తున్నారు.’’
- కొర్ల భారతి, వైఎస్సార్ కాంగ్రెస్

ఏదైనా సాధించగలరని నిరూపించారు..
‘‘అన్ని వేల కిలోమీటర్లు ఒక మహిళ పాదయాత్ర చేయడం గొప్ప విశేషం. మహిళలు ఏమైనా సాధించగలరని షర్మిల నిరూపించారు. ఆమె మానసిక బలం చాలా గొప్పది. ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’’
- డాక్టర్ శోభానాయుడు

ఎవరూ చేయని సాహసం.. 
‘‘ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చిన్న వయస్సులో ఏ రాజకీయ నేతా చేయని సాహసం షర్మిల పాదయాత్ర. రాబోయే రోజుల్లో ఆమె మంచి నాయకురాలిగా ఎదగాలని, మహిళల కోసం పాటుపడతారని ఆశిస్తున్నాను.’’
- జమీలా నిషాత్,
షాహీన్ ఉమెన్స్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, డెరైక్టర్



భావితరాలకు మేలుకొలుపు..
‘‘స్త్రీలకు పట్టుదల, సంకల్పం మెండుగా ఉంటాయి. షర్మిల పాదయాత్ర నేటి తరానికి మేలుకొలుపు అవుతుంది. నేటి తరం యువతులకు షర్మిల మార్గదర్శిగా నిలుస్తారు. దేశం బాగుంటే మనం బాగుంటామంటూ.. షర్మిల అందరి కోసం స్ఫూర్తివంతంగా పాదయాత్ర చేస్తున్నారు.’’
- మద్దాళి ఉషా గాయత్రి,
ప్రముఖ నర్తకీమణి 


మహిళాలోకానికి స్ఫూర్తి..
‘‘షర్మిల పాదయాత్ర మహిళాలోకానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలి. వారు ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని
చూపిస్తారు.’’
- అంజలి భాటియా, ప్రధాన కార్యదర్శి
(ఇంద్రప్రస్థ ప్రెస్‌క్లబ్, ఢిల్లీ)


అభినందనీయం..
‘‘ఇంటిని, కుటుంబాన్ని వదిలి చలి, ఎండా, వానను లెక్కచేయకుండా పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఇది మహిళాజాతికే కాదు అందరికీ స్ఫూర్తిదాయకం.’’
- నీలం జినా (ఇండియన్ వుమెన్స్ ప్రెస్‌కార్ప్స్)



 షర్మిల పాదయాత్ర ప్రపంచ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోని ఏ మహిళా ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేయలేదన్నారు. తాను 2,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లుగా ఒక నాయకుడు చెప్పుకున్నారని, అయితే షర్మిల ఇపుడు 2,800 కిలోమీటర్లు దాటి 2,900 కి.మీ. వైపు దూసుకు వెళుతున్నారని చెప్పారు.

షర్మిల యాత్ర ఆగస్టు మొదటి వారానికి 3,000 కి.మీ. మైలు రాయిని దాటుతుందన్నారు. షర్మిల దారి పొడవునా రెండున్నర కోట్ల మంది ప్రజల గుండెల్ని తాకుతూ వెళ్లారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తే ప్రతిపక్షం కూడా వారితో కుమ్మక్కై ప్రజల గురించి ఆలోచించడం మానేసిందన్నారు. వీరిద్దరి కుట్రలను నిరసిస్తూ షర్మిల చేపట్టిన యాత్ర అవార్డుల కోసమో, రివార్డుల కోసమో చేయడం లేదని, కడగండ్లలో ఉన్న వారికి ఓ భరోసా ఇవ్వడం కోసమే చేస్తున్నారని వివరించారు.
Share this article :

0 comments: