పెద్దాయన... పెద్దాయన... ఇది స్వార్థపు లోకం పెద్దాయన! ఇది నిజం.. ప్రజలందరికి తెలిసిన సత్యం. వైయస్ బతికి ఉండగా జేజేలు కొట్టారు. వైయస్ అడుగులో అడుగు వేశారు, స్వరంలో స్వరం కలిపారు.. వైయస్ జిందాబాద్, వైఎస్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ సభలు, సమావేశాల్లో నినాదాలు చేసిన వారు మహానేత లేడు, ఇక తిరిగి రాలేడు అని తెలిసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ పదవులు కాపాడుకోవడానికి స్వరం మార్చారు. రోజుకో మాట, పూటకో అబద్ధం మాట్లాడుతున్నారు.
![]() యూపీఏ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది అని ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. సోనియాగాంధీ అల్లుడి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇది చూస్తేనే చెప్పవచ్చు - ఇది స్వార్థపు లోకమని! ఆరోపిస్తే విచారణ చేస్తారు. ఆధారాలు లేకపోయినా జైలులో పెడతారు. అన్ని ఆధారాలతో బట్టబయలైనా సోనియాగాంధీ అల్లుడిని ఎందుకు జైల్లో పెట్టలేదు? సోనియాకో న్యాయం, వైయస్ కుటుంబానికి మరో న్యాయం. ఇదెక్కడి నీతిమాలిన రాజకీయం? వైయస్ కుటుంబ సభ్యులపై కక్ష కట్టారు. అందుకోసమే జగన్‌ను విచారణ పేరుతో జైల్లో పెట్టారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్‌ను ఎంతకాలం జైలులో పెట్టినా ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తరగదు. రాబోయే కాలానికి కాబోయే సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రమే! - నందు, గోదావరిఖని, కరీంనగర్ జిల్లా. ప్రజాకోర్టులో జగన్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధర్మయుద్ధం అంటే యుద్ధం చేసే వ్యక్తులు ఆయుధాలు కలిగి ఉండి యుద్ధం చేయాలి కానీ జగన్ విషయంలో కుట్రలతో కూడిన యుద్ధం జరుగుతోంది. జగన్ మీద ఇప్పుడు ఏ ఆరోపణల మీద అయితే సీబీఐ విచారణ జరుపుతోందో అవే ఆరోపణలు 2009కి ముందు కూడా టీడీపీ చేసింది. కానీ అప్పుడు జగన్ మీద ఎలాంటి విచారణ జరగలేదు. నిజంగా జగన్ మీద కోర్టులో కేసు ఆరోజే (2009కి ముందు వైయస్సార్ బతికున్నప్పుడు) వేసి ఉంటే ఇప్పడు ఈ కేసు వేసిన వ్యక్తుల మీద కొంచెమైనా గౌరవం ఉండేది కానీ అలా జరగలేదు. వైయస్సార్ చనిపోయిన తర్వాత, జగన్ కాంగ్రెస్‌ని వీడిన తర్వాత జగన్‌కి ప్రజల ఆదరణ పెరుగుతోంది అని తెలిసి, కుట్రలతో ప్రత్యర్థులు (కాంగ్రెస్+టీడీపీ) అయినా కూడా జగన్ మీద కలిసి కేసులు వేశారు. నిజంగా వైయస్సార్ బతికున్నప్పుడు ఈ కేసులు వేసి ఉంటే అప్పుడు యుద్ధం ధర్మంగా జరిగేది. ఈ కేసులు పెట్టిన వ్యక్తుల మీద ప్రజలలో కూడా ఒక నమ్మకం ఉండేది. జగన్‌ని ఒంటరిని చేశామని టీడీపీ, కాంగ్రెస్ వాళ్ళు ఆనందపడుతూ ఉండవచ్చు కానీ ప్రజలు తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా, ఈ కుట్రలకు సమాధానం ఎప్పుడు చెబుదామా అని ఎదురుచూస్తున్నారు. ఈ కుట్రలతో జగన్‌ని బంధించవచ్చు కానీ ప్రజాకోర్టులో జగన్‌ను తప్పకుండా న్యాయం జరుగుతుంది. - జె.ఎన్. జవహర్, విజయవాడ |
Home »
» ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తరగదు...
ప్రజాదరణ పెరుగుతుందే తప్ప తరగదు...
Written By news on Saturday, July 6, 2013 | 7/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment