దోపిడీ దొంగల ప్రభుత్వమిది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దోపిడీ దొంగల ప్రభుత్వమిది

దోపిడీ దొంగల ప్రభుత్వమిది

Written By news on Wednesday, July 17, 2013 | 7/17/2013

వృద్ధులకు కేంద్రం వయసును బట్టి 
రూ.300, రూ.500 పింఛనుగా ఇస్తోంది
కానీ రాష్ట్రం రూ.200 ఇచ్చి.. మిగతా సొమ్మును ఖజానాల్లో నింపుకొంటోంది
మరి ఈ పాలకులను దోపిడీదారులు అనరా?
వైఎస్ మరణించాక ఈ నాలుగేళ్లలో ఎనిమిదిన్నర లక్షలకు పైగా పింఛనుదారులు మరణించారు
వారి స్థానంలోనైనా కొత్త వారికి పింఛను ఇవ్వాలని కిరణ్‌కు అనిపించడం లేదు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 211, కిలోమీటర్లు: 2,819.4

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్ల నుంచి 80 సంవత్సరాల వయసున్న వృద్ధులకు రూ.300 చొప్పున పింఛను మంజూరు చేస్తుంది.. 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 ఇస్తుంది. కానీ మన రాష్ట్ర సర్కారు ఆ నిధులన్నీ తీసుకొని అవ్వలకు, తాతలకు ఇవ్వకుండా వారికి రూ. 200 మాత్రమే ఇచ్చి మిగిలినదాన్ని వాళ్ల ఖజానాలో నింపుకొంటోంది. వృద్ధుల సొమ్మును వాళ్ల ఖజానాలో నింపుకొంటున్న ఈ పాలకులను దోపిడీదారులు అనరా? ఈ ప్రభుత్వాన్ని దొంగ అనరా? ఇది దోచుకోవడం కాదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో సాగింది. ఇదే నియోజకవర్గంలోని కోమటిపల్లి గ్రామంలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

వైఎస్ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను..

‘‘ఈ కిరణ్ సర్కారులో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. నిన్నయితే ఒక అవ్వకు దాదాపు 70 ఏళ్లు ఉంటాయి. ఆ అవ్వ వచ్చి ‘అమ్మా నాకు ఎలాగైనా పింఛను ఇప్పించు తల్లీ, నా భర్త పోయి రెండే ళ్లు అయింది, ఇంతకు ముందు కనీసం ఒక్కరికైనా వచ్చేది, ఆయన పోయాడు ఎవరికీ రావడం లేదు తల్లీ, అందుకే కూలి చేస్తున్నానమ్మా అని చెప్పింది. ఇంకొక తాతైతే అమ్మా రూ. 200 పింఛను వస్తుంది కానీ అది ఎక్కడ సరిపోతుంది తల్లీ, అందుకనే నేనూ కూలికి పోతున్నా తలీ’్ల అని చెప్పారు. పాపం నిజంగా వృద్ధులను, వితంతువులను, వికలాంగులను చూస్తే చాలా బాధేస్తుంది. అన్ని ధరలూ పెరిగిపోయాయి కానీ వాళ్లకు వచ్చే పింఛను ఏమాత్రం పెరగలేదు. చంద్రబాబు నాయుడు వృద్ధులకు, వితంతువులకు రూ.75 పింఛను ఇస్తే వైఎస్సార్ దాన్ని రూ.200 చేశారు. చంద్రబాబు వికలాంగులకు రూ.200 ఇస్తే వైఎస్సార్ దాన్ని రూ. 500 చేశారు. చంద్రబాబు హయాంలో ఎవరికైనా పింఛను రావాలంటే, ఊరిలో పింఛను తీసుకుంటున్న వ్యక్తి ఎవరైనా చనిపోతే ఆయన స్థానంలో మీ పేరు చేరుస్తాం అని చెప్పేవారు. కానీ వైఎస్సార్ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇచ్చారు. చంద్రబాబు 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే వైఎస్సార్ 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు.

మరణించిన వారి స్థానంలోనైనా పింఛను ఇవ్వరా?

వైఎస్సార్ మరణించిన తరువాత ఈ మూడు, నాలుగేళ్లలో ఎనిమిదిన్నర లక్షల నుంచి 10 లక్షల మంది వరకు పింఛన్లు అందుకుంటున్న వాళ్లు చనిపోయారు. ఆ స్థానంలో కూడా కొత్త వాళ్లకు పింఛన్లు ఇవ్వొచ్చని ఈ కిరణ్ సర్కారుకు అనిపించలేదు. ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమకు పింఛను కావాలని వేడుకుంటున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. వీళ్ల తీరును చూసి అధికారులు పింఛనుకు వచ్చే దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఇలా ఉంది మన రాష్ర్టంలో పరిస్థితి. ఇప్పుడు అధికారంలో ఒక రాక్షస రాజ్యం ఉంది. ఒక రాబందుల రాజ్యం నడుస్తోంది. ఏ వర్గం వారూ సంతోషంగా లేరు. రైతులకు పెట్టుబడులు ఎక్కువైపోయి మద్దతు ధర లేక వేసిన ప్రతి పంటలో నష్టమొచ్చి అప్పుల పాలైపోతున్నారు. అన్ని ధరలూ, అన్ని చార్జీలూ పెరిగిపోయి మహిళలు, పేదలు సతమతమవుతున్నారు. వీళ్లకు మనసూ మానవత్వం ఏదీ లేకుండా పోయింది. ప్రతి పథకానికీ గ్రహణం పట్టింది. ఆఖరికి వృద్ధులకు ఇచ్చే పింఛన్లకు కూడా గ్రహణం పట్టింది అంటే వీళ్లు మనుషులా? లేకుంటే రాక్షసులా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం, ‘పేదల కోసం అది చేస్తాం, రైతుల కోసం ఇది చేస్తాం’ అని కోతలు కోస్తున్న ప్రభుత్వం. కానీ తీరా చేతల్లోకి వచ్చే వరకు అన్ని పథకాలకు కోతలు పెడుతున్న ప్రభుత్వం.

చంద్రబాబు వల్లే చార్జీల మోత

అసెంబ్లీతో ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబేమో విప్ జారీ చేసి మరీ ఈ ప్రభుత్వాన్ని కాపాడారు. చంద్రబాబు ఆ రోజు అవిశ్వాసానికి మద్దతు పలికి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పడో కూలిపోయేది. ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ చార్జీల మోత, కరెంటు బాదుడు ప్రజల నెత్తిన పడేదే కాదు. పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను చంద్రబాబు నాయుడు కళ్లారా చూసికూడా ప్రజల పక్షాన నిలబడకుండా ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణల కేసులపై విచారణలు జరగకుండా ఉండటానికి కాంగ్రె స్ పార్టీకి అమ్ముడుపోయారు. ఇలాంటి నాయకుడిని నాయకుడు అనాలా? లేకుంటే దుర్మార్గుడు అనాలా?’’

15.2 కిలోమీటర్ల మేర యాత్ర..

‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 211వ రోజు మంగళవారం చీపురుపల్లి నియోజకవర్గంలోని బైరీపురం గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి పోరలి, బుపాలరాజపురం, వంగర, దత్తురాజేరు, మానాపురం, కోమటిపల్లి మీదుగా యాత్ర చేశారు. మరుడాం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.45 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 15.2 కిలోమీటర్లు నడిచారు. షర్మిలను కలిసిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, వెంట నడిచినవారిలో తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, గజపతినగరం నియోజకవర్గం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, సమన్వయకర్తలు కోట్ల సూర్యనారాయణ, స్థానిక నాయకులు గుంట్రెడ్డి శ్రీరమాదేవి, ఆదాడ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: