రాజకీయ లబ్ది కోసమే విభజన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయ లబ్ది కోసమే విభజన

రాజకీయ లబ్ది కోసమే విభజన

Written By news on Wednesday, July 31, 2013 | 7/31/2013

రాజకీయ లబ్ది కోసమే విభజన: అంబటి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రాన్ని విభజించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్వేలలో  కాంగ్రెస్కు సీట్లు రావని తేలిందని చెప్పారు.   సీట్ల, కోసం ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్  టిఆర్ఎస్తో కాంగ్రెస్ బేరసారాలు కుదుర్చుకుందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.

ఈ రాష్ట్రం చేసిన పాపం ఏమిటి? అని ప్రశ్నించారు.  వైఎస్ సహకారం వల్లే యుపిఏ నిలబడిందని చెప్పారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ఆనాడే చెప్పినట్లు తెలిపారు. ఒక తండ్రి లాగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోమని కోరినట్లు చెప్పారు. కావాలంటే అప్పుడు కేంద్రానికి ఇచ్చిన లేఖ ప్రతిని అందజేస్తానని చెప్పారు.
Share this article :

0 comments: