‘నా దృష్టిలో వైఎస్సార్’ అంశంపై పోటీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘నా దృష్టిలో వైఎస్సార్’ అంశంపై పోటీలు

‘నా దృష్టిలో వైఎస్సార్’ అంశంపై పోటీలు

Written By news on Wednesday, July 3, 2013 | 7/03/2013

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ‘నాదృష్టిలో వైఎస్సార్’ అనే అంశంపై సాక్షి టీవీ ఆధ్వర్యంలో చిన్నారులకు రాష్ట్ర స్థాయి వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీకి ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 5, 6, 7 తరగతుల విద్యార్థులు ఒక కేటగిరీ, 8, 9, 10 తరగతుల విద్యార్థులు మరో కేటగిరీగా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొన దలచిన వారు టోల్‌ఫ్రీ నంబరు 18004259899కు ఫోన్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు.

పాటల పోటీ కూడా: మహానేత వైఎస్సార్ పాలనను కొనియాడుతూ తమ అభిమానాన్ని చాటుకునే వారి కోసం ‘రాజన్న పాట’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌కు తమ పాటలను నివాళిగా సమర్పించాలనుకునే వారు ఒక నిమిషం నిడివి దాటకుండా ఎంపీ-3 విధానంలో పాటను సిద్ధం చేసి rajannapata@sakshi.comకు ఈ మెయిల్‌కు తమ ఎంట్రీలను జూలై 6 నాటికి పంపాలి. అన్ని పోటీల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులతో పాటు సాక్షి స్టూడియోలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
Share this article :

0 comments: