నల్లారి, నారాలకు షాక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నల్లారి, నారాలకు షాక్

నల్లారి, నారాలకు షాక్

Written By news on Thursday, July 25, 2013 | 7/25/2013

తొలి దశలోనే మెజారిటీ స్థానాలు 
మూడో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి సొంత జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలకు గట్టి దెబ్బ తగిలింది. జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాలను దక్కించుకొని సైకిల్-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు బుద్ధి చెప్పారు. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు మూడో స్థానానికి పడిపోవడం ఆయనకే కాదు పాలకపక్షానికే షాక్ ఇచ్చింది. మంగళవారం 258 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ మద్దతుదారులకు కేవలం 41 స్థానాలు వచ్చాయి. జిల్లాకు చెందిన మంత్రి గల్లా అరుణకుమారి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరిలో కూడా పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. జిల్లాలో మంచి క్యాడర్ ఉందని చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ కూడా 79 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

వైఎస్సార్‌సీపీకి 120 స్థానాలు దక్కాయి. టీడీపీ చేతుల్లో ఉన్న సత్యవేడు నియోజకవర్గంలో ఆ పార్టీ మద్దతుదారులు ఎదురీదడం అక్కడి నేతలను కలవరపరచింది. సత్యవేడులో సగానికి పైగా స్థానాలను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుచుకొన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తిలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలోని అత్యంత కీలకమైన రేణిగుంటలో ైవె ఎస్సార్ సీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో 60కిపైగా సర్పంచ్ స్థానాలు వైఎస్సార్ సీపీ ఖాతాలో చేరాయి. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని దేశం నేతలు తమదే పైచేయి అనిపించుకొనేందుకు ఏకగ్రీవంగా ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి సారించారు. తిరుచానురులో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు పలు ఆఫర్‌లతో బడా నేతలు రంగంలోకి దిగడం వివాదాస్పదంగా మరింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులతో కలుపుకుంటే జిల్లాలో ఇప్పటి వరకూ 551 స్థానాలకు గాను ైవె ఎస్సార్ సీపీ మద్దతుదారులు 281 స్థానాలను దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి 146, కాంగ్రెస్‌కు 76 దక్కాయి. మొదటి విడత ఫలితాలతో కంగుతిన్న ఈ రెండు పార్టీలు మరోమారు కుమ్మక్కు రాజకీయాలను తెరమీదకు తీసుకువచ్చాయి. 

రెండు, మూడో విడత పోలింగ్‌లో లోపాయికారీ ఒప్పందాలతో వైఎస్సార్ కాంగ్రెస్‌ను కట్టడి చేసే వ్యూహాల్లో ఇరుపార్టీల నేతలు బీజీ గా ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరులో ఆ పార్టీ అభ్యర్థి పరిస్థితి దారుణంగా వుండడంతో తెలుగుదేశం సహకారాన్ని తీసుకొనేందుకు పావులు కదుపుతున్నారు. పీలేరు నియోజకవర్గం పరిధిలో 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న పలువురు నేతలు ఈ సారి కాంగ్రెస్ మద్దతుదారులుగా ఎన్నికల బరిలోకి దిగడమే కుమ్మక్కుకు ఉదాహరణ. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలోనూ పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. మొదటి విడత ఫలితాలే పునరావృతమైతే జిల్లాలో తమ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ముఖ్యనేతలు భయపడుతున్నారు.
Share this article :

0 comments: