జగనన్న బైటికొస్తేనే... నా కొత్త సైకిల్ బయటికి తీస్తా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న బైటికొస్తేనే... నా కొత్త సైకిల్ బయటికి తీస్తా!

జగనన్న బైటికొస్తేనే... నా కొత్త సైకిల్ బయటికి తీస్తా!

Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013

వృత్తిరీత్యా పెయింటర్‌ను కాబట్టి... నిత్యం పట్టణంలోని వివిధ ప్రాంతాలకు సైకిల్‌పై వెళ్లి పెయింటింగ్ వేసి ఇంటికి వస్తాను. గతంలో   ఉన్న సైకిల్ పాతది అయింది. దాన్ని తొక్కడం కష్టమవుతోంది. పైసాపైసా కూడబెట్టి రూ.4500 చేసి కొత్తసైకిల్‌కు ఆర్డర్ ఇచ్చాను. షాపువాళ్లు సైకిల్‌ను ఫిటింగ్ చేసి 2012 మే 27వ తేదీ సాయంత్రం నాకు అప్పజెప్పారు. ఆ సైకిల్‌ను వేసుకుని ఇంటికి వచ్చాను. వరండాలో పెట్టి ఇంట్లోకి వెళ్లి టీవీ స్విచాన్ చేశాను. ‘కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్...’ అంటూ వార్తలొస్తున్నాయి. అది చూసి నా గుండె ఆగినంత పనయింది. కళ్లు బైర్లు కమ్మాయి. భోజనం తినమని ఇంట్లో వాళ్లు ఎంతో బతిమాలారు. కాని నాకు తినబుద్ధి కావట్లేదు. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. 

మరుసటిరోజు పనికి కూడా వెళ్లలేదు. అన్న అరెస్ట్ అయ్యాడన్న విషయం మతికి వస్తే చాలు భోజనం తినబుద్ధి అయ్యేది కాదు. ‘సైకిల్ తెచ్చినరోజే ఇలా అయ్యిందే...’ అనిపించింది. దాంతో అన్న బయటకు వచ్చేంత వరకు ఆ సైకిల్‌ను ముట్టొద్దనుకున్నాను. సైకిల్‌ని వరండాలోనే ఉన్న అరుగుమీద పెట్టి... తాడుతో కిటికీ ఊచలకు కట్టాను. పక్కనే జగనన్న ఫొటో పెట్టాను. నేను ఇవన్నీ చేస్తుంటే మా కుటుంబసభ్యులందరూ నా దగ్గరకు వచ్చారు. ఎందుకు ఇలా కడుతున్నావని ప్రశ్నించారు. నేను ఒకటే చెప్పాను...‘ఈ సైకిల్ తెచ్చిన రోజే జగనన్నను అరెస్ట్ చేశారు. ఆయన జైలులో ఉన్నంతకాలం ఇది నాకు అక్కర్లేదు...’ అన్నాను. జగనన్న బయటకు వచ్చినరోజు జరిపే సంబరాల్లో నా కొత్తసైకిల్‌తో పాల్గొంటాను. అప్పటివరకు పాత సైకిల్ మీదే తిరుగుతాను. ఓదార్పుయాత్రలో భాగంగా జగనన్న ఇల్లెందులోని సత్యనారాయణపురం వచ్చారు. 

ఆయనకు కరచాలనం చేసేందుకు పోటీపడ్డాను. ఎట్టకేలకు అన్నకు షేక్‌హ్యాండ్ ఇచ్చాను. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు జగనన్న చండ్రుగొండ వచ్చినప్పుడు కూడా వెళ్లాను. అప్పుడు కూడా అన్నతో కరచాలనం చేశాను. షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొన్నాను. విజయమ్మ మూడుసార్లు జిల్లాకు వచ్చినప్పుడూ వెళ్లాను. మాట కాదన్నందుకు జగనన్నను సోనియా జైలులో పెట్టించింది. ఎన్నిరోజులు జైళ్లో ఉంచగలుగుతుంది. కుట్రలను ఛేదించుకుని జగనన్న త్వరలోనే బయటకు వస్తారు. ఆ రోజు నా సైకిల్‌ను తీస్తాను... సంబరాల్లో పాల్గొంటాను. 

- దాసరి విజయకుమార్, రైటర్ బస్తీ, ఇల్లెందు, ఖమ్మం జిల్లా

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: