'ప్రజాన్యాయస్థానంలో విజేత జగనే' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ప్రజాన్యాయస్థానంలో విజేత జగనే'

'ప్రజాన్యాయస్థానంలో విజేత జగనే'

Written By news on Wednesday, July 3, 2013 | 7/03/2013

 జనాదరణను చూసి ఓర్వలేకే అక్రమ నిర్బంధం
- కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలే బుద్ధి చెబుతారు
- సాక్షి చైతన్యపథంలో ఎలుగెత్తిన కందుకూరు ప్రజలు

సాక్షిప్రతినిధి,ఒంగోలు: ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధిం చి కుమ్మక్కు రాజకీయాలు చేయడం కాదు.. ఆయన్ని 2014 వరకు ప్రజల్లో తిరగనివ్వండి. ఎవరేమిటో ఎన్నికల్లో ప్రజలనే తీర్పు చెప్పనివ్వండి..’ అని కందుకూరు పట్టణ ప్రముఖులు, వక్తలు, ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు సవాల్ విసిరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానంలో నిర్దోషిగా, ప్రజాన్యాయస్థానంలో సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి నిలవడం ఖాయమన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో మంగళవారం సాక్షి చైతన్యపథం నిర్వహించారు. న్యాయవాది బలుసు నర్సింహారావు మాట్లాడుతూ సీబీఐ ని అడ్డంపెట్టుకుని రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారిందన్నారు. 

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు వి. వసంతలక్ష్మి మాట్లాడుతూ 26 జీవోలు సక్రమమేనని, మంత్రులు తప్పుచేయలేదని సీఎం కిరణ్ చెబుతున్నప్పుడు జగన్ ఏవిధంగా దోషి అవుతారని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎస్.కె.రఫీ మాట్లాడుతూ, విచారణ పేరిట కాలయాపన చేస్తూ వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు సీబీఐకి లేదన్నారు. తనకు అనుకూలంగా అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు సంతకాలు చేసినప్పటికీ రోశయ్యను సీఎంగా అంగీకరించిన గొప్ప మనసున్న నేత వైఎస్.జగన్ అని ట్రేడ్ యూనియన్ నేత ఎం.కోటేశ్వరరావు కొనియాడారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ విజయుడిగా నిలుస్తారని విశ్రాంత తహసీల్దార్ కేఎస్ వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: