‘మిత్రద్వయం’ కలలు కల్లలే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మిత్రద్వయం’ కలలు కల్లలే!

‘మిత్రద్వయం’ కలలు కల్లలే!

Written By news on Saturday, July 6, 2013 | 7/06/2013

ప్పటిదాకా టీడీపీ రాష్ట్రంలో బహిరంగంగా పొత్తు పెట్టుకోనిది ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే! ఈసారి చంద్రబాబు ఏం చేసినా చేయవచ్చు. పొత్తులు పెట్టుకుని కూడా ఓడిపోయిన టీడీపీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి రంగంలో నిలువగలదా? అయినా టీడీపీతో పొత్తు పెట్టుకుని రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు, ఉండదు!

మన రాష్ట్రంలో అటు కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కొంత కాలంగా తమ రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెందు తున్నాయి. 2014 ఎన్నికలలో కూడా తమదే గెలుపని కాంగ్రెస్ పైకి చెబుతున్నప్పటికీ అందుకు ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇక కేంద్రంలో 2014లో చక్రం తిప్పేది తామేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతు న్నప్పటికీ, వాస్తవానికి ఆ చక్రంలో ఆకులు ఎన్నడో రాలి పోయాయి. 2014 ఎన్నికలు ముందే వస్తాయేమోననే భయంతో ఆ పార్టీలకు కంటి మీద కునుకు ఉండటం లేదు.

వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ వెల్లువెత్తడమే ఇందుకు గల ప్రధాన కారణం. ఎన్నికలు ఎంత ఆలస్యమైతే అంత మం చిదని, అప్పుడు వైఎస్‌పై ప్రజలకు ఉన్న ఆరాధనా భావం పూర్తిగా ఆవిరికాకున్నా కొంతైనా తగ్గుతుందని ఆ రెండు పార్టీల దింపుడు కల్లం ఆశ! తెలంగాణలో తమ ప్రాబల్యం క్రమంగా దిగజారిపోయిన ఫలితంగా టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలదే అక్కడ పైచేయి అవుతుందని ఆ రెండు పార్టీలు భయపడుతున్నాయి.

సామాన్య ప్రజానీకం ‘మేధోమథనాలు’ చేయలేరు. వారు హృదయంతో స్పందిస్తారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు మేలు చేశాయన్నది వారి భావనే కాదు స్వీయానుభవం కూడా! అంతకుముందు అధికారంలో ఉన్న టీడీపీ గ్రామీణ ప్రజలను మరచిపో యింది. ఆ పార్టీ ఘనంగా ప్రచారం చేసుకున్న ‘హైటెక్’ హంగులు ప్రజల చెంతకు చేరుకోలేదు. 

టీడీపీ అంటే కలవారి, పారిశ్రామికవేత్తల పార్టీ అని, తమ పార్టీ కాదని, అర్థమై ప్రజలు ఆ పార్టీకి దూరమయ్యారు. చంద్రబాబు ను ఎన్నికల బరిలో మట్టికరిపించి అధికారం చేపట్టిన వైఎస్ పాలన వారికి ఎంతో ఊరటనిచ్చింది. వైఎస్ హఠా న్మరణం చెందినప్పుడు వారు తమ ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయినట్లు కృంగిపోయారంటే అందుకు అదే కార ణం. వైఎస్ లేని లోటును పూడ్చడంలో అటు పిదప వచ్చిన ముఖ్యమంత్రులు విఫలమయ్యారు. దీనికి తోడు ‘హిరణ్యకశ్యప’ భక్తితో టీడీపీ నిరంతరం వైఎస్ వ్యతిరేక ప్రచారం చేయడం ప్రజలు వైఎస్‌ను సదా గుర్తుంచు కునే లా చేస్తున్నది. అటు కాంగ్రెస్ నేతలు, వైఎస్ మా వాడేనం టూ కొందరు, వైఎస్ దోషి అంటూ మరికొందరు, ఏదో విధంగా వైఎస్ నామం అనునిత్యం జపిస్తూనే ఉన్నారు. మరోవంక జగన్‌మోహన్‌రెడ్డిని జైలుపాలు చేశామని ‘మిత్రద్వయం’ సంతోషిద్దామనుకుంటే, జగన్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలి హోదాలో వైఎస్ సతీమణి శ్రీమతి విజయలక్ష్మి భర్తీ చేశారు. 

ఆమెతో పాటు ఇతర సీనియర్ నేతలు, యువనాయకులు పార్టీ కార్యకలాపా లను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల కిరణ్ సర్కార్ ప్రవేశపెట్టిన ‘అమ్మ హస్తం’ వంటి బూటకపు పథకాలను ఎండగడుతూ అనితరసాధ్యంగా పాదయాత్ర చేస్తున్నారు. పాదయా త్రకు వస్తున్న అపూర్వ స్పందన ప్రజల హృదయాలలో వైఎస్‌కు ఉన్న సుస్థిర స్థానానికి అద్దం పడుతున్నది. జగన్‌మోహన్‌రెడ్డి జీవనసహచరి శ్రీమతి భారతి ‘సాక్షి’ మీడియా వ్యవహారాలు పర్యవేక్షిస్తూ కీలక భూమిక పోషిస్తున్నారు.

‘జగన్’ను అక్రమంగా నిర్బంధించడమేగాక వీలైనం త ఎక్కువ కాలం ఆయనను జైలులోనే ఉంచాలనే ప్రయ త్నాన్ని రాజకీయకక్షతో ‘మిత్రపక్షాలు’ చేస్తున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. వైఎస్ సంక్షేమ పథకాలతో పేదరికం మాసిపోదుకదా! కుడుము ఇవ్వగానే పండగ కాదు కదా! అని మేధావులు వ్యాఖ్యానించవచ్చు. కానీ కడు పేదరికంలో మగ్గుతున్న వారికి ఆ కుడుము కూడా పండగే అవుతుంది! అందుకే వైఎస్‌పై ప్రజలలో నెలకొని ఉన్న కృతజ్ఞతాభావనను చెరిపివేయడం కాంగ్రెస్, టీడీపీలకు అంత సులువు కాదు.

కాంగ్రెస్, టీడీపీలు బహిరంగంగా పరస్పరం ఎంత ఘాటుగా విమర్శించుకున్నప్పటికీ, అది లాలూచీ కుస్తీ అని తెలుసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు! కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై వెస్సార్‌సీసీ, టీఆర్‌ఎస్ పార్టీలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్పుడు, ప్రభుత్వాన్ని కాపాడేందుకు టీడీపీ ఓటింగ్‌లో పాల్గొనకపోవడాన్ని ప్రజలు గమనించారు. టీడీపీ ఓటిం గ్‌లో పాల్గొనకపోవడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం బతికి బట్ట కట్టిందని ప్రజలే కాదు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు సైతం అభిప్రాయపడ్డారు. 

అలాగే చంద్ర బాబుపై ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉదాసీనంగా వ్యవహరించడమూ జనం గమనిస్తూనే ఉన్నారు. అందుకే వారిని ‘తోడుదొంగలు’గా భావించి రాబోయే ఎన్నికలలో ఆ రెండు పార్టీలను ప్రతిపక్షస్థానానికి పరిమితం చేయబోతున్నారు. ఒకవేళ రాష్ట్రం విడివడి సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రా లు ఏర్పడితే అప్పుడు కూడా రెండు రాష్ట్రాలలోనూ నేటి ప్రధానప్రతిపక్షం బలహీనంగానే ఉంటుంది. తెలంగాణ లో టీఆర్‌ఎస్ బలహీనపడినా టీడీపీ బలపడేందుకు అది దోహదపడదు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇచ్చింది వైఎస్సార్‌సీపీయే తప్ప టీడీపీ కాదన్నది తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి, కాంగ్రెస్‌పార్టీ, టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుంటేనో, లేదా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనో బలం పుంజుకునే అవకాశం ఉం టుంది. 

అలా కాకుండా రాష్ట్రం విడిపోకుండా ఉంటే సీమాంధ్రలో అదనంగా ఆ రెండు పార్టీలకు ఒరిగేదేమీ ఉండదు. ఇక సీమాంధ్రలో కాంగ్రెస్, టీడీపీల కంటే వైఎస్సార్‌సీపీ ముందుంటుందని సర్వేలు తెలుపుతు న్నాయి. వైఎస్సార్‌సీపీని ఓడించాలంటే గత ఉపఎన్నిక లలో మాదిరి, లేదా సహకార సంఘ ఎన్నికలలో మాదిరి బాహాటంగానో, లోపాయికారీగానో, మిత్రద్వయ పార్టీలు కుమ్మక్కు కావాలి! కానీ సాధారణ ఎన్నికలలో గుట్టుగా చేతులు కలపడం సాధ్యపడదు. బాహాటంగా కుమ్మ క్కయితే మొదటికే మోసం వస్తుంది!

అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని తక్కువ అంచనా వేయజాలం. రాబోయే ఎన్నికలలో నూతన రాజ కీయ సమీకరణలకు ఆస్కారం ఉంది. చంద్రబాబు అవకాశ వాద రాజకీయ ఎత్తుగడలతో ఎన్ని పార్టీలతో కలిశారో, విడిపోయారో అందరికీ తెలిసిందే! బీజేపీ, వామపక్షాలు, టీఆర్‌ఎస్‌లతో అవసరాన్ని బట్టి టీడీపీ పొత్తులు పెట్టు కుంది. అందువల్ల ఆ పార్టీలకు టీడీపీపై విశ్వాసం నశించింది. 

వచ్చే ఎన్నికలలో టీడీపీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తు న్నారు. ఇప్పటిదాకా టీడీపీ రాష్ట్రంలో బహిరంగంగా పొత్తు పెట్టుకోనిది ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే! ఈసారి చంద్రబాబు ఏం చేసినా చేయవచ్చు. పొత్తులు పెట్టుకుని కూడా ఓడిపోయిన టీడీపీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి రంగంలో నిలువగలదా? అయినా టీడీపీతో పొత్తు పెట్టుకుని రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు, ఉండదు!

పైగా ఇటీవల ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల ముందే ప్రైవేట్ బస్ ఆపరేటర్ల లాగా మా విమానం ఎక్కమంటే మా విమానం ఎక్కమంటూ చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ తమ్ముళ్లు, కాంగ్రెస్ నేతలు కాట్లాడుకోవడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బజారునపడేశాయి! చంద్రబాబు ఆ ఘటన జరిగి ఉండా ల్సింది కాదనీ, దానికి తాను బేషరతుగా ప్రజలకు క్షమా పణ చెబుతున్నాననీ బహిరంగ ప్రకటన చేశారు కూడా! దురదృష్టం ఏమిటంటే ఆ ప్రకటన ప్రజలలో చంద్రబాబు ప్రతిష్టను పెంచకపోగా మరింతగా దిగజార్చింది. నరేంద్ర మోడీ గుజరాత్ యాత్రికుల కోసం చేసిన కృషిని చంద్ర బాబు ప్రశంసించారు. నిజానికి మోడీ చేసింది తక్కువ, ప్రచారం ఎక్కువ అని తేలింది. అయినా ఆపదలో ఉన్న ప్రజలంతా భారతీయులే అనే స్పృహ లేకుండా ఆంధ్రా, గుజరాతీ అంటూ మోడీ సంకుచితంగా వ్యవహరించడం హర్షణీయమేనా? ఏమైనా ‘మిత్రద్వయం’ నిజరూపాన్ని డెహ్రాడూన్ ఘటన, వ్యాఖ్యానాలు అక్కరలేకుండా నిరూపించింది.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=65160&Categoryid=1&subcatid=18
Share this article :

0 comments: