మేమంతా నీ వెంటే ఉన్నామన్నా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేమంతా నీ వెంటే ఉన్నామన్నా...

మేమంతా నీ వెంటే ఉన్నామన్నా...

Written By news on Monday, July 22, 2013 | 7/22/2013

హిరణ్యకశిపుడు తన అధికారాన్ని నిరూపించుకోవడానికి ప్రహ్లాదుడు ‘హరి’ అని అన్నందుకు అనేక చిత్రహింసలకు గురిచేశాడు. కానీ, ప్రహ్లాదుడు అన్నిటిని అధిగమించి పులుకడిగిన ముత్యంలా రాణించాడు. ప్రస్తుతం మన రాష్ట్రంలో పాలక ప్రతిపక్ష నాయకులు కుమ్మక్కై జగనన్నను ‘ఓదార్పు’ అన్నమాటకు అవినీతిపరుడిగా చిత్రీకరించి, బ్రిటిష్ పాలకులను తలపిస్తున్నారు. కానీ, జగనన్న అనే వజ్రాన్ని సానబెట్టి మణిహారంగా తయారుచేసుకుంటారు ప్రజలు.

ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. 1995 నుంచి 2003 వరకు ప్రజలను ఎంతో బాధపెట్టి, ఇంకుడు గుంతలు, జన్మభూమి అనే ఉపయోగంలేని పనులు చేసి, బడ్జెట్లు అన్నీ అవినీతిమయం చేసి, ‘ఏమిటీ బాధ?’ అని ప్రజలు అనుకునే తరుణంలో దేవుడు రాజశేఖరరెడ్డిగారిని పంపి, ప్రజలకు ప్రభుత్వ పాలన అంటే ఏమిటో దేవుడు చూపించాడు. ధాన్యానికి మద్దతు ధర, పసుపుకు 16000 రికార్డు ధర, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ లాంటివన్నీ అమలుచేశారు. అలాంటి పెద్దాయనను నిందలు వేసి, ఏ సంబంధం లేని జగనన్నను జైలుపాలు చేసి, బెయిలు రాకుండా కాంగ్రెస్, టీడీపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. చీకటి రాజకీయాలు నడుపుతున్నారు.

రాజశేఖరరెడ్డిగారు స్వర్గస్తులైనప్పుడు ముఖ్యమంత్రి అంటే వైయస్సార్ అని సంతాపసందేశం రాసి సంతకం పెట్టారు రాహుల్‌గాంధి. కానీ, ఇవాళ ఏ తప్పు చేశారని పెద్దాయనను ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి, జగనన్నను జైలులో నిర్బంధించారు. అసలు 26 జీవోలు న్యాయం అయినప్పుడు, జగనన్న కంపెనీలు, పరిశ్రమలలో పెట్టిన పెట్టుబడులు ఎలా అన్యాయం అవుతాయి? ఒక స్థానికుడు కాని, పెట్టుబడిదారుడు కాని తమకు అన్యాయం జరిగిందని చెప్పారా? ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ నీచమైన ప్రభుత్వం. ఇవాళ జగనన్న సాక్షులను తారుమారు చేస్తారు అని అంటున్నారు. 

ఇదంతా ప్రభుత్వం, చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి ఆడుతున్న స్వార్థపూరితమైన నాటక రాజకీయం. ఈ ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టంలేదు. అందుకే వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ సరైనవి కావు అంటూనే, అధికారం మళ్లీ ఇస్తే వాటిని అమలు చేస్తామని అంటున్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ, ప్రజల జీవితాలను కోలుకోకుండా చేస్తూ, సర్వనాశనం చేస్తున్నారు. 
నీచమైన రాజకీయాలతో జగనన్నను, ప్రజలను బాధపెడుతూ రాజశేఖరరెడ్డిగారి పథకాలకు తూట్లుపొడుస్తూ ప్రభుత్వం, ప్రతిపక్షాలు పబ్బం గడుపుతున్నాయి. ఆకాశమంత జగనన్నను బాధపెట్టినా, గోమాత వంటి షర్మిలమ్మను బాధపెట్టినా, ఇంటి ఆడపడుచులైనటువంటి విజయమ్మ, భారతిగార్లను బాధపెట్టినా, వారికి సైన్యంలా ఉన్న ప్రజలను బాధపెట్టినా భగవంతుడు క్షమించడు.

జగనన్నా, మనకు భగవంతుడు వున్నాడు. మొన్న నీవు కోర్టు నుంచి బయటకు వచ్చినప్పుడు భరించలేనంత దుఃఖం వచ్చింది. కానీ, ఓదార్పుయాత్రలో నీవు ‘ఏడవకమ్మా, మేము వున్నాం నీ వెంట’ అని నాతో అన్న మాటలు గుర్తువచ్చి, భగవంతుడిని తలచి ప్రార్థించా. నీవు క్షేమంగా, ఈ కుట్రపూరితమైన చెరసాల నుంచి మాకు వెలుగు పంచే సూర్యునిలా త్వరలోనే బయటకు వస్తావు. ఆ క్షణంకోసం మేము ఎదురుచూస్తున్నాం.

- దేవరపల్లి విజయలక్ష్మి,
కొనకంచి గ్రామం, పెనుగంచిప్రోలు మండలం, కృష్ణా జిల్లా
Share this article :

0 comments: