భయంతోనే అనుచిత వ్యాఖ్యలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భయంతోనే అనుచిత వ్యాఖ్యలు

భయంతోనే అనుచిత వ్యాఖ్యలు

Written By news on Sunday, July 21, 2013 | 7/21/2013

- బొత్స, చంద్రబాబులపై ‘దాడి’ ధ్వజం 

చోడవరం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి దాడి వీరభ ద్రరావు అన్నారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. జగ న్‌మోహనరెడ్డి సీఎం అయితే తమకు పుట్టగతులుండవనే భయంతోనే బొత్స, చంద్రబాబులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసలు కాంగ్రెస్ నేతలు వైఎస్ బొమ్మ పెట్టుకొని ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్, టీడీపీలు మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు.

ఎన్టీఆర్ తర్వాత పేద, మధ్య తరగతి, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్‌దేనని చెప్పారు. వాటికి రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు తూట్లు పొడిచారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని వీరభద్రరావు చెప్పా రు. ఎన్నికల్లో ధనబలంపై కాంగ్రెస్, టీడీపీలు ఆధారపడ్డాయని, ఏదోలా ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవాలని తాపత్రయపడుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏకగ్రీవమైన పంచాయతీల్లో ఎక్కువ సీట్లను తమ పార్టీ కైవసం చేసుకుందన్నారు. ఆంధ్రా, రాయలసీమల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అధిక సీట్లు వస్తాయన్న భయంతోనే టీఆర్‌ఎస్‌తోనైనా కలసి తెలంగాణ లో ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని సోనియా రాష్ర్ట విభజనకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. కానీ తెలంగాణాలోనూ తమ పార్టీకి 40 స్థానాలు ఖాయమని దాడి ధీమా వ్యక్తంచేశారు.
Share this article :

0 comments: