టిడిపికి రెండు చోట్లా నష్టమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టిడిపికి రెండు చోట్లా నష్టమే

టిడిపికి రెండు చోట్లా నష్టమే

Written By news on Wednesday, July 31, 2013 | 7/31/2013

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదు అంటూ అంచనాలు వేస్తూ వచ్చిన టిడిపి నాయకత్వం ఒక్కసారిగా డీలాపడిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించామనే సంతోషం నిలువ కుండా రాష్ట్ర విభజన అంశం మా సంతోషాలపై నీళ్లు చల్లినట్టు అయిందని టిడిపి నాయకులు వాపోతున్నారు. రాష్ట్ర విభజనకు యుపిఏ నిర్ణయం తీసుకోవడంతో టిడిపి శ్రేణుల్లో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది. మా భవిష్యత్తు ఏమిటి అనే ఆందోళన పార్టీ నాయకులను వెన్నాడుతోంది. సొంత సమాజిక వర్గానికి చెందిన వారు సైతం ఇప్పుడు చంద్రబాబును తప్పు పడుతున్నారు. మా భవిష్యత్తును పణంగా పెట్టి చంద్రబాబు విభజన రాజకీయాల్లో ఇరికిపోయారని టిడిపికి గట్టి మద్దతుదారులుగా నిలిచే సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించి రోడ్ మ్యాప్ గురించి ప్రకటించగానే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం రాబోతుందని స్పష్టం అయిందని, కానీ చంద్రబాబే సకాలంలో మేల్కోలేదని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నంత మాత్రామే టిడిపి పరిస్థితి తెలంగాణలో బాగుంటుందని కూడా అనుకోలేమని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ఉంటే తెలంగాణలో కూడా బాగానే ఉంటుంది, కానీ ఎర్రబెల్లి దయాకర్‌రావునో మోత్కుపల్లి నర్సింహులునో ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులు ఎందుకు తంటాలు పడతారని సీమాంధ్ర నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ఆర్ పార్టీ ముందుగానే మేల్కొని 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం వల్ల సీమాంధ్రలో ఆ పార్టీ ఆదరణ పెరిగిందని, ఆ ప్రాంత టిడిపి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు రాజకీయం వల్ల మేం రెండు ప్రాంతాల్లోనూ దెబ్బతిన్నామనేది టిడిపి నాయకుల ఆవేదన. యుపిఏ నిర్ణయం అయిపోయిన తరువాత ఇంకా తెలంగాణ ఏర్పడదు అనుకుంటే అది అమాయకత్వమే అవుతుందని అంటున్నారు. సీమాంధ్ర ప్రయోజనాల గురించి చంద్రబాబు నోరు మెదపకపోవడం పార్టీకి తీరని నష్టమేనని టిడిపి నాయకులు చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు ఆదరించవచ్చు కానీ టిడిపికి ఎక్కడ అవకాశం ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.
సీమాంధ్రలో జగన్ ప్రభావం మరింతగా పెరిగింది, ఇక తెలంగాణలో ఒక్క ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు తిరుగులేదని గుంటూరు జిల్లా టిడిపి నాయకులు చెబుతున్నారు. తెలంగాణ టిడిపి నాయకులు సంబరాల్లో పాలు పంచుకోవడం ద్వారా తెలంగాణ రావడంతో తమదే కీలక పాత్ర అని ప్రచారం చేసుకోవచ్చునని చెబుతున్నారు. అయితే దీని వల్ల సీమాంధ్రలో పార్టీ నష్టపోతుందని చెప్పి చంద్రబాబు ఎవరినీ మాట్లాడవద్దని చెబుతున్నారు. కాంగ్రెస్ ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామని టిడిపి నాయకులు చెబుతున్నారు.

http://www.andhrabhoomi.net/content/tdp-50
Share this article :

0 comments: