జగన్ ఇచ్చినంత భరోసాను...ఏ నాయకుడైనా ఇచ్చాడా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఇచ్చినంత భరోసాను...ఏ నాయకుడైనా ఇచ్చాడా?

జగన్ ఇచ్చినంత భరోసాను...ఏ నాయకుడైనా ఇచ్చాడా?

Written By news on Tuesday, July 30, 2013 | 7/30/2013

అన్న అంటే జగనన్న. అమ్మ అంటే విజయమ్మ. చెల్లి అంటే షర్మిలమ్మ. ఇంత మంచి కుటుంబ సభ్యులను ఒకరితో ఒకరిని కలవనివ్వకుండా చేసిన ఈ పెద్దమనుషులమని చెప్పుకునే నాయకులను ప్రజలంతా కలిసి త్వరలోనే రాజకీయాల నుంచి తరిమి తరిమి కొడతారు. ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జగన్ నీతినిజాయితీలు, ప్రజలకు ఆయన ఇచ్చిన భరోసా, ప్రజలతో ఆయన మమేకం అయిన తీరు ఇవన్నీ జగన్‌కి అండగా నిలుస్తాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని గెలిపిస్తాయి. ప్రజల కోసం గట్టిగా నిలబడినందువల్లనే ఇవాళ ఆయనకిన్ని తిప్పలు వచ్చి పడ్డాయని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎన్ని దుష్టశక్తులు ఏకమైనా జగన్‌కున్న ప్రజాదరణను తగ్గించలేవు. తప్పకుండా ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదలై వస్తారు. ప్రలోభాలతో కాకుండా, ప్రజాబలంతో గెలిచి తీరతారు. 
- పి.మురళీమోహన్, పాలమూరు

బెయిలు పొందే కనీస హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తోంది!

జగన్ చేసిన తప్పేమీ లేకుండా, ఆయనపై లేనిపోని ఆరోపణలన్నీ చేసి జైల్లో నిర్బంధించారు. బెయిలు పొందే కనీసహక్కును కూడా కాలరాసే విధంగా సీబీఐని ఉసిగొల్పి ఆయనకు మరిన్ని ఉచ్చులు బిగించే కుట్రలు చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్, టీడీపీ నాయకుల పనేనని రాష్ర్టంలోని ప్రజలందరికీ తెలుసు. 

ప్రజలతో కలసి, ప్రజలమనిషిగా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న జగన్ తమను ఎక్కడ వె నక్కి తోసేస్తాడో, ప్రజలెక్కడ తమను మరచిపోతారోన న్న భయంతో ఆయన్ని జైలు పాలు చేయడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులను కూడా వేధించి, విమర్శించడం మొదలుపెట్టారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, ఇలా వ్యక్తిగతంగా ఒక్క మనిషిపై అంతా కలిసి అనైతికంగా దాడికి పాల్పడడం యుద్ధనీతి కాదు. ఒకటి మాత్రం నిజం. ఈ పోరాటంలో అంతిమ విజయం జగన్‌దే. 

- టి.బాల్‌ముకుంద్‌సింగ్
అమరచింత, మహబూబ్‌నగర్ జిల్లా


ఇలా ఎంతకాలం రిమాండ్‌లను పొడిగించుకుంటూపోతారు?!

మహానేత, దివంగత ప్రజాబంధు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు యావద్దేశంలోనే ప్రజలందరి మన్ననలు అందుకున్న నాయకుడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు సైతం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తూ ప్రజాదరణ పొందుతున్నాయి. అలాంటి నాయకుడిపైన, ఆయన తనయుడు జగన్‌పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి వారిపై నిందారోపణలు చేస్తోంది. వై.ఎస్.ఆర్. మాకు రాజకీయగురువు, గాడ్ ఫాదర్, దైవం అంటూ ఆనాడు పలికిన నాయకులు నేడు ప్రతిపక్షాలతో, ఎల్లో మీడియాతో కుమ్మక్కై అన్యాయంగా వై.ఎస్.కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. జగన్‌పై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. ఇంతవరకు ఏ కోర్టు కూడా జగన్‌ని దోషి అని నిర్ధారించలేదు. అయినప్పటికీ జగన్ రిమాండును పొడిగించడం తప్ప కోర్టులు కూడా ఏమీ చేయలేకపోవడం చూస్తుంటే న్యాయస్థానాలను సైతం కాంగ్రెస్‌పార్టీ ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. పాలక, ప్రతిపక్షాలు ఎంతసేపటికీ జగన్‌ని వేధించడమే పనిగా పెట్టుకున్నాయి తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. జగన్ జైలు నుండి విడుదలై వస్తేనేగానీ వీరి ఆగడాలు ఆగవు. ప్రజాసమస్యలను వినేవారూ ఉండరు.

- జి.కె.నాయుడు, ఎస్.మధు, పి.ఎస్. నాయుడు కొత్తకోట, రావికమతం, విశాఖజిల్లా

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: