కుట్రతోనే జగన్‌కు బెయిల్ నిరాకరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్రతోనే జగన్‌కు బెయిల్ నిరాకరణ

కుట్రతోనే జగన్‌కు బెయిల్ నిరాకరణ

Written By news on Friday, July 19, 2013 | 7/19/2013

- టాడా కేసుల్లోని వ్యక్తులకూ బెయిల్ ఇచ్చారు
- ఫెరా కేసుల్లోనూ 180 రోజుల్లోనే బెయిల్ 
- గుడివాడలో ‘సాక్షి’ చైతన్యపథంలో వక్తలు 

సాక్షి, గుడివాడ: టాడా కేసుల్లోని వారికి బెయిలిచ్చారు.. ఫెరా చట్టం వర్తించే కేసుల్లో కూడా బెయిల్ వస్తుంది. ఈ కేసుల్లో నిందితుడు దరఖాస్తు చేయకుండానే 180 రోజుల్లో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తారు. దేశంలో పెద్దపెద్ద నేరాలు చేసిన వ్యక్తులకు కూడా నిర్ణీత కాలవ్యవధిలో బెయిల్ వస్తున్నది. రాష్ట్రంలో అనూహ్య ప్రజాభిమానం ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ ఎందుకు మంజూరు కావడం లేదు. దీంతో ఆయనపై ఏ స్థాయిలో కుట్ర జరిగిందో ప్రతి ఒక్కరికీ అర్థమవుతూనే ఉంది. కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాక్షసక్రీడను తమ ఓటుతో తిప్పికొట్టి జగనన్నను జనం మధ్యకు తీసుకువస్తామంటూ గుడివాడవాసులు శపథం చేశారు.

గురువారం కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఉన్న సహకారభవన్‌లో ‘సాక్షి చైతన్య పథం’ జరిగింది. నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సదస్సులో పట్టణానికి చెందిన మేధావులు, న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొని తమ భావావేశాల్ని వ్యక్తం చేశారు. గుడివాడ బార్ అసోసియేషన్ కార్యదర్శి కె.మురళి మాట్లాడుతూ, దేశ సర్వోన్నత న్యాయస్థానం మందలించినప్పటికీ సీబీఐ తీరులో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. అధికారపార్టీలు సీబీఐని రాజకీయ అస్త్రంగా మార్చుకుని ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నాయన్నారు. 

ఈ వేధింపులు జగన్ విషయంలో పరాకాష్టకు చేరాయన్నారు. పెట్టుబడుల కేసులో అన్నీ డాక్యుమెంటరీ అధారాలే ఉంటాయని, అలాంటప్పుడు సాక్ష్యాలు, సాక్షులను జగన్ ప్రభావితం చేస్తారని వాదిస్తూ బెయిల్‌ను అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాది నీలం బెంజిమెన్ మాట్లాడుతూ, కేవలం అభియోగాల ఆధారంగా జగన్‌ను 14 నెలలుగా జైలుతో బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైద్యులు మలిరెడ్డి రవి మాట్లాడుతూ, ప్రజాభిమానం ఉన్న జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే అన్యాయంగా జైలులో నిర్బంధించారని ధ్వజమెత్తారు. రిటైర్డ్ టీచర్ ఏలేటి విలియం జోషి మాట్లాడుతూ, జగన్‌కు జరిగిన అన్యాయం, సీబీఐ తీరుపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. మెనార్టీ సంక్షేమ నేత షేక్ గౌస్ మాట్లాడుతూ, వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందుల పాల్జేస్తున్న కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గృహిణి బి. ఇంద్రాణి మాట్లాడుతూ, కుళ్లిన రాజకీయ వ్యవస్థలో ప్రజల కష్టాలు చూసి వారి పక్షాన నిలిచినందుకే జగన్‌ను జైలు పాల్జేశారన్నారు.
Share this article :

0 comments: