చంద్ర బాబు మౌనం వెనుక..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్ర బాబు మౌనం వెనుక..!

చంద్ర బాబు మౌనం వెనుక..!

Written By news on Tuesday, July 30, 2013 | 7/30/2013

ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించే దిశగా కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటానికి కారణం ఏమిటి? ప్రస్తుతం ఈ సందేహం ఆ పార్టీ నేతలను వేధిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు యూపీఏలోని కొందరు సన్నిహితులు చేసిన సూచనల వల్లే ఆయన మౌనంగా ఉంటున్నారని పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలమని టీడీపీ గతంలో ప్రకటించింది. పొలిట్‌బ్యూరో తీర్మానంలో కూడా అదే అంశాన్ని పేర్కొన్నారు. అయితే కేంద్రం, కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రతిపాదనపై చంద్రబాబుతో సహా పార్టీ నేతలు ఎవ్వరూ నోరు మెదపటం లేదు. తెలంగాణ మా వల్లే సాధ్యమని నిత్యం చెప్పే ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు కూడా నూతన ప్రతిపాదనపై పెదవి విప్పటం లేదు. ఇక సమైక్యాంధ్ర కోసం దేనికైనా సిద్ధమన్న పయ్యావుల కేశవ్ కూడా మౌన ముద్ర దాల్చారు. రాయలసీమను విభజించడమేమిటని పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడితే చంద్రబాబు వెంటనే ఫోన్ చేసి అలా ఎందుకు మాట్లాడావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలావుండగా, ప్రస్తుతం రాష్ర్ట విభజన అంశంపై కేంద్రంలో ఇంత హడావిడి జరుగుతున్నా, వివిధ డిమాండ్లతో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నా, ఉద్యమాలు జరుగుతున్నా.. చంద్రబాబు మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. నేతలు ఎవరైనా మన పార్టీ వైఖరి ఏమిటని ప్రశ్నించినా ఆ ఒక్కటి తప్ప ఏమైనా అడగండని అంటున్నారు. సోమవారం చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను పంచాయతీ ఎన్నికలపై మాట్లాడతానని, మరో విషయమేదీ తనను అడగవద్దని ముందుగానే విలేకరులకు చెప్పారు. తాజా పరిణామాలపై చంద్రబాబు మౌనంగా ఉండటానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దల నుంచి వచ్చిన సూచనే కారణమని పార్టీ నేతలు అంటున్నారు. 
Share this article :

0 comments: