తొలివిడత పంచాయతీ ఎన్నికలలో పార్టీ ప్రభంజనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొలివిడత పంచాయతీ ఎన్నికలలో పార్టీ ప్రభంజనం

తొలివిడత పంచాయతీ ఎన్నికలలో పార్టీ ప్రభంజనం

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగించింది. మంగళవారం రాత్రి 8.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికయిన పంచాయతీలతో పాటు మొదటి దశ ఫలితాలను కలుపుకుంటే 1784 పంచాయతీలను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కైవసం చేసుకుని అగ్రభాగాన నిలిచింది. పార్టీ బలపరిచిన అభ్యర్థులు తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో మిగతా పార్టీల కన్నా అత్యధిక స్థానాలు విజయాలు సాధించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో సైతం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ తన సత్తాను చాటుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 1501 స్థానాలతో రెండవ స్థానంలోనూ, టిడిపి 1278 స్థానాలతో మూడవ స్థానంలో ఉన్నాయి. ఇతరులు 934 చోట్ల గెలిచారు. టిఆర్ఆర్‌ఎస్‌ పార్టీ 301 చోట్ల గెలిచింది.

పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు విజయోత్సాహంతో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి. నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ 235 పంచాయతీల్లో పార్టీ విజయం సాధించింది.

అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టిడిపి కుమ్మక్కై పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచినా వాటి ఆటలను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ సాగనివ్వలేదు. ఆ పార్టీలు ఓటర్లను ఎంతగా ప్రలోభపెట్టినా, ఎన్ని అరాచకాలు చేసినా కాంగ్రెస్‌, టిడిపిలకు ఓటర్లు మాత్రం‌ ప్రజాపక్షమైన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కే మద్దతుగా నిలిచారు. ఆ పార్టీలకు గట్టిగానే బుద్ధి చెప్పారు.

చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలం పాండూరులో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు గెలుపొందారు. 502 ఓట్ల మెజారిటీతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీరాములు విజయం సాధించారు. తొట్టంబేడులోని రెండు స్థానాల్లో‌ ఒకటి వై‌యస్‌ఆర్ ‌కాంగ్రెస్ మద్దతుదారు గెలిచారు. శ్రీకాళహస్తిలో మూడు స్థానాల్లో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలిచారు. ఏర్పేడు మండలంలో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ 2 స్థానాల్లో విజయం సాధించింది. పులిచర్ల మండలం 106 ఇ.రామిరెడ్డిగారిపల్లెలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారు సరోజమ్మ 82 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

కడప జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెంలో పార్టీ మద్దతుదారు లక్ష్మమ్మ గెలుపొందారు. అనంతపురం జిల్లా సిఆర్‌పల్లె సర్పంచ్‌గా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన మల్లమ్మ విజయం సాధించారు. కడప జిల్లా రాయచోటి మండలం గరిగపాతిరెడ్డివారి పల్లెలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారు రాజారెడ్డి 130 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం దొరమామిడిలో సత్తిబాబు (వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్) గెలుపొందారు. ఇదే జిల్లా మర్రిగూడెంలో కారం సావిత్రి (వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్) విజయం సాధించారు.

మరో పక్కన తూర్పు గోదావరి జిల్లా కె.గంగవరం మండలం పామర్రులో రీకౌంటింగ్‌లో కూడా పార్టీ మద్దతుదారురాలు గెలుపొందారు. మంగా లక్ష్మి9 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కోళ్ల పంచాయతీ సర్పంచ్‌గా వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్ మద్దతుదారు చిత్తూరు వెంకట్రామయ్య 480 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆలమూరు మండలం‌ నర్సిపూడి, చందిపూడి, చెముడులంక పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా సత్రంపాడు పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ విజయం సాధించింది.

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం చినబోయినపల్లిలో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్ మద్దతుదారు సర్పం‌చ్ అభ్యర్థిగా నాగార్జున, ఉప సర్పం‌చ్‌గా రమ ఘన విజయం సాధించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్ మద్దతుదారు గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సొంత ఊరు వెంకటాయపాలెంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్‌గా గెలిచారు. పశ్చిమగోదావరి జిల్లా మాదేపల్లి పంచాయతీలోని 14 వార్డుల్లో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కె.పెంటపాడులో పార్టీ మద్దతుదారు చోడగిరి సత్యనారాయణ 1890 ఓట్ల భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించారు.

రంగారెడ్డి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పలువురు గెలుపొందారు. కందుకూరు మండలం మురళీనగర్‌లో అమృత విజయం సాధించారు. మహేశ్వరం మండలం దుబ్బచర్లలో కోటమ్మ విజయమ్మ గెలిచారు. కందుకూరు మండలం తిప్పాలపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారు విజయ బావుటా ఎగురవేశారు.

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం మసీద్‌పూర్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు ఎల్లా రమేష్ విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాగ‌న్‌పల్లి, కప్పాడు, మాల్, తురకగూడ, నానక్‌నగర్‌లో పార్టీ మద్దతుదారులు గెలిచారు. మాజీ మంత్రి సబి‌తా ఇంద్రారెడ్డి నియోజకవర్గం మహేశ్వరం పరిధిలో 8 స్థానాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారులు విజయకేతనం ఎగురవేశారు.

http://www.ysrcongress.com/news/top_stories/ysr-congress-victory-in-panchayat-polls.html
Share this article :

0 comments: