పాదయాత్రలో షర్మిల వద్ద ప్రజల ఆవేదన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్రలో షర్మిల వద్ద ప్రజల ఆవేదన

పాదయాత్రలో షర్మిల వద్ద ప్రజల ఆవేదన

Written By news on Wednesday, July 10, 2013 | 7/10/2013

పాదయాత్రలో షర్మిల వద్ద ప్రజల ఆవేదన
- గిట్టుబాటు లేదని రైతులు, కష్టానికి ప్రతిఫలం లేదని చేతివృత్తుల వాళ్ల ఆక్రందన
- ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదని ఫిర్యాదు
- నాలుగేళ్లలో ప్రభుత్వం అప్పు తెచ్చిన రూ.50 వేల కోట్లు ఏం చేసిందని షర్మిల ప్రశ్న

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఎవరిని పలకరించినా కన్నీళ్లే రాలుతున్నాయి. ఈ పాలనలో పంటకు గిట్టుబాటు లేదని రైతులు కన్నీళ్లు పెడుతుంటే, చేసిన రెక్కల కష్టానికి ప్రతిఫలం అందటం లేదని చేతివృత్తుల వాళ్లు బాధపడుతున్నారు. నేతన్న, గీతన్న, కంసాలి, వడ్రంగి, మేదరి ఎవరిని కదిలించినా ‘ఈ సర్కారుతో లాభం లేదమ్మా’ అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం నుంచి సాయం లేదమ్మా అని ఫిర్యాదు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రలో ఆమెకు మొర పెట్టుకుంటున్నారు.

ప్రజా ఫిర్యాదులపై షర్మిల స్పందిస్తూ ‘‘నాలుగేళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల అప్పు తెచ్చింది. అప్పు తెచ్చిన ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది. ఈ డబ్బును ఎవరి సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో సాగింది. ఎస్. కోట నియోజకవర్గ ప్రజలు నీరాజనం పలికారు. పూలతో స్వాగతం పలికారు. 

కష్టాలు చెప్పుకున్నారు. ఆ వివరాలివీ..
అట్ట పెట్టెలొచ్చాక.. బుట్ట కొనేవాడులేడు
కొత్తవలస శివారు చింతలదిమ్మ ప్రాంతంలో షర్మిల అక్కడి మేదర్ల కష్టాలు విన్నారు. మూడు నెలల పాటు సీజన్‌వారీ తాము మామిడికాయల ఎగుమతి కోసం బుట్టలు అల్లుతుంటామని, ఇప్పుడా స్థానంలో అట్టపెట్టెలు రావడంతో తమకు కూలీ లేకుండా పోతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ 50 కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడుతున్నాయని, ఇంటిల్లిపాది కష్టపడ్డా నెలకు రూ.5 వేలు కూడా రావడం లేదని బాధపడ్డారు. ‘‘ప్రభుత్వమే కల్పించుకొని మా వృత్తిని ప్రోత్సహించాలమ్మా’’ అని దాసరి అప్పన్న, దాసరి తాత, సింహాచలం షర్మిలకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన షర్మిల జగనన్న వస్తాడని, ఆశీర్వదించండని, మంచి రోజులొస్తాయని వారికి ధైర్యం చెప్పి ముందుకు కదిలారు.

మామిడి తాండ్రకు రేటు లేదు..
భీమాలి గ్రామంలో మామిడి తాండ్ర కార్మికులు షర్మిలను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. ‘‘మామిడికాయలు కొని ఎండ ఉన్న సమయంలో 25 రోజుల పాటు కష్టపడి చాప తాండ్ర(సుమారు 60 కేజీలు) తయారు చేస్తే రూ.4 వేలు ఖర్చవుతుందమ్మా. కానీ గిట్టుబాటు ధర లేదమ్మా. కేజీ రూ.50, 60కి మించి ధర పలకడం లేదమ్మా. దళారులు, మధ్యవర్తులు, ఇతర ప్రాంత వ్యాపారులు మా దగ్గర తక్కువ ధరకే తాండ్ర కొనుగోలు చేసి విజయనగరం, విశాఖ ప్రాంతాలకు పట్టుకుపోయి ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం దీనిని కుటీర పరిశ్రమగా గుర్తించి మామిడి కాయలు సరఫరా చేసి తయారైన తాండ్రను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తే మేం బాగుపడతామమ్మా’’ అని మిడతాన దేముడమ్మ, చిటికరెడ్డి కనకమ్మ, సూర్యాదేవి అనే కార్మికులు చెప్పారు. ‘‘ధర రావాలంటే ఏం చేస్తే బావుంటుంది?’’ అని షర్మిల అడగగా.. బ్యాంకులు రుణాలిస్తే తమ బతుకులు బాగుపడతాయని కార్మికులు చెప్పారు. ‘‘మన రాష్ట్రంలోనే మాంచి పేరున్న భీమాలి మామిడి తాండ్ర రుచి జగనన్నకు చూపించండమ్మా’’ అంటూ తాండ్రను షర్మిలకు ఇచ్చారు.

వైఎస్సారే మా ఇంటి దేవుడు..
అలమండలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్న కొంతమంది షర్మిలను కలిసేందుకు వచ్చారు. ‘నా భర్త షేక్ అబ్దుల్ రజాక్.. వయసు 70 దాకా ఉంటాయమ్మా. నరాలు చిట్లిపోయిన జబ్బుతో ఇబ్బంది పడుతుంటే.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్నారు. ఖర్చంతా ప్రభుత్వమే భరించిందమ్మా. నా భర్తను బతికించిన రాజన్నకు మేం రుణపడి ఉంటామమ్మా’ అంటూ ముంతాజ్ షర్మిలతో అన్నారు. అదే గ్రామానికి చెందిన కోట వాణి అనే 11 ఏళ్ల బాలిక నెలరోజుల వయసు నుంచే గుండె జబ్బుతో బాధపడుతుంటే తల్లిదండ్రులు ఏళ్ల తరబడి చికిత్స కోసం బెంగళూరు, పుట్టపర్తి లాంటి ఎన్నో ఊర్లు తిరిగారు. ఐదో తరగతి చదువుతున్న వాణికి ఆపరేషన్ చేయించేందుకు తమ వద్ద డబ్బు లేకపోతే ఆరోగ్యశ్రీయే బతికించిందని, హైదరాబాద్ అపోలోలో చికిత్స అనంతరం ఇప్పుడు తమ పాప చక్కగా చదువుకుంటోందని తల్లిదండ్రులు అప్పారావు, పార్వతి చెప్పారు. రూ. 2 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను 2007లో రాజన్న దయ వల్లే ఉచితంగా చేయించుకున్నామని చెప్పారు.

15 కిలోమీటర్ల మేర పాదయాత్ర..
పాదయాత్ర 204వ రోజు మంగళవారం విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలోని కొత్త వలస నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి అద్దానపురం, ఎర్రవానిపాలెం, సుంకరపాలెం, కంటకాపల్లి, భీమాలి గ్రామాల మీదుగా షర్మిల యాత్ర చేశారు. అలమండ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.15 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,717.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణా రంగారావు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎస్.కోట నియోజకవ ర్గ సమన్వయకర్తలు వేచలపు రాంనాయుడు, బోకం శ్రీనివాసరావు, డాక్టర్ గేదెల తిరుపతిరావు తదితరులున్నా
Share this article :

0 comments: