ప్రజల కోసం...పదవులనే వదులుకున్నాడు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల కోసం...పదవులనే వదులుకున్నాడు!

ప్రజల కోసం...పదవులనే వదులుకున్నాడు!

Written By news on Wednesday, July 17, 2013 | 7/17/2013

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుదినం ఆయనను కీర్తించిన కాంగ్రెస్ నేతలు... ఆయన దివంగతులయ్యాక విమర్శించడం మొదలుపెట్టారు. నిందలు వేయడంలో తెలుగుదేశంపార్టీ నాయకులతో పోటీ పడుతున్నారు. వీరిలో చాలామంది మహానేత రెక్కల కష్టంతో ఓట్లు వేయించుకుని గెలిచినవారే. ఈ విషయాన్ని వారు మరచిపోయారేమో కానీ ప్రజలు మరువలేదు సరికదా, వీరి దిగజారుడుతనాన్ని చీదరించుకుంటున్నారు.

‘రాజకీయనాయకుల మాటలు నీటిమీద రాతలు’ అనే నానుడిని తిరగరాసిన మహానుభావుడు వైఎస్. ‘ఆయన వాగ్దానం శిలాశాసనం’ అనే విశ్వాసం బలపడింది. ఈ లక్షణాలన్నింటినీ ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి అందిపుచ్చుకున్నారు. నల్లకాలువలో ఇచ్చినమాట కోసం, పదవులను దూరం చేసుకోవడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అయినా కక్ష సాధింపు వీడని కాంగ్రెస్... జగన్‌ను జైలుపాలు చేసింది. బెయిల్ రానివ్వకుండా కుయుక్తులు పన్నుతోంది.

కాకలు తీరిన నాయకులు, ఢిల్లీలో చక్రం తిప్పిన నాయకులు... కాంగ్రెస్‌ను ఎదిరించే ధైర్యం లేక, చీకటి ఒప్పందాలు చేసుకుని, కేసులు లేకుండా బయట తిరుగుతున్నారు. ఇలాంటి నాయకులకు పూర్తిగా భిన్నమైన డైనమిక్ లీడర్ వైఎస్ జగన్. కాంగ్రెస్‌కు ఎదురుతిరిగిన ధీరుడు. చట్టవిరుద్ధమైన పనులేవీ చేయలేదు కాబట్టే ఆ యువకుడికి అంతటి ధైర్యం వచ్చింది. ఒకవేళ పొరపాట్లు చేసి ఉంటే... జగన్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టే వారే కాదు. 

ఒకవేళ వీడినా చీకటి ఒప్పందాలు చేసుకుని జైలు నుంచి బయటపడేవారు. మనం నియంతృత్వంలో జీవించడం లేదు, ప్రజాస్వామ్యదేశంలో ఉన్నాం. అన్ని వ్యవస్థల్లా కాకుండా న్యాయవ్యవస్థ ఉన్నతంగా ఉంది. ఇవాళ కాకపోయినా, రేపయినా జగన్ బయటకు వస్తారు. రాబోయే ఎన్నికలలో అఖండ మెజారిటీతో రికార్డు సృష్టించి ముఖ్యమంత్రి అవుతారు. 
- డి.రంగారావు, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ, 
సున్నిపెంట, కర్నూలు జిల్లా

సాక్ష్యాధారాలు చూపలేకపోయినా...నిందలు మోపడం ఆపలేదు!
జగనన్నని పదమూడు నెలలుగా జైల్లో ఉంచిన సీబీఐ ఇంతవరకు ఆయనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాధారాన్నీ చూపలేకపోయింది. న్యాయస్థానాలను సైతం సీబీఐ తప్పుదారి పట్టిస్తోంది. ఇంత జరుగుతున్నా మేధావులు, ఆలోచనాపరులైన న్యాయమూర్తులు సీబీఐని ఈ పదమూడు నెలల్లో ఒక్కసారైనా మందలించిన దాఖలాలు లేవు! ఒక్కోసారి అనిపిస్తుంటుంది, మనది ప్రజాస్వామ్యదేశమేనా... అని! వై.ఎస్. కుటుంబం రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవాలని సోనియాగాంధీ నుండి బాబుగారికి ఆదేశాలు అందినట్లు కనిపిస్తోంది.

లేకుంటే ఆయన తన ప్రతిపక్ష నాయక పాత్రను వదిలేసి జగన్ చుట్టూ కుటిల వ్యూహాలు పన్నుతూ కూర్చోవడం ఏమిటి? జగనన్నని వేధిస్తున్నారని రాష్ట్రపతిగారికి కోటీ ఎనభైలక్షల మంది సంతకాలు చేసి పంపిస్తే వాటిపై ఈనాటికీ నిర్ణయం తీసుకోలేదు! సోనియా కనుసన్నలలో నడుస్తున్న వారిలో రాష్ట్రపతి కూడా ఉంటార ని మేమైతే అనుకోవడంలేదు. 

మరి జగనన్న అక్రమ నిర్బంధం గురించి ఆయన ఒక్కమాటైనా ఎందుకు అనలేకపోయారు? ఇప్పటికైనా పెద్దలైన రాష్ట్రపతి, న్యాయమూర్తులు జగన్ కేసును ప్రజాసంక్షేమానికి సంబంధించిన కేసుగా పరిగణించి, ప్రజలకు మేలు చేసేందుకు ఆయన్ని విడుదల చేయించాలి. జగన్ తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలను పట్టించుకునే నాయకుడెవరూ లేరు. ఇది వాస్తవం.
- కంజుల రోశిరెడ్డి, గొరిజవోలు, గుంటూరు జిల్లా
Share this article :

0 comments: