పిరికిపంద ప్రభుత్వమిది: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పిరికిపంద ప్రభుత్వమిది: షర్మిల

పిరికిపంద ప్రభుత్వమిది: షర్మిల

Written By news on Thursday, July 18, 2013 | 7/18/2013

మరో ప్రజాప్రస్థానం 18-07-2013
విజయనగరం: వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి పన్ను పెంచలేదని బొబ్బిలి బహిరంగసభలో షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని చూపిన నాయకుడు వైఎస్ఆర్ అని తెలిపారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలు అయ్యాయని విమర్శించారు. 4 గంటలే పవర్‌ ఇస్తున్నందుకు, ఎరువుల ధరలు పెంచినందుకు కాంగ్రెస్‌కు ఓటు వేయాలా?, ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధులను తొలగించినందుకు కాంగ్రెస్‌కు ఓటువేయాలా?, 9 గంటల ఉచిత విద్యుత్, 30 కేజీల ఉచిత బియ్యం ఇవ్వనందుకు ఓటు వేయాలా? అంటూ షర్మిల ప్రశ్నించారు. 

మెజార్టీ లేకపోయినా కేవలం చంద్రబాబు అండతోనే కిరణ్ సర్కార్ నడుస్తోందని ఆమె ఆరోపించారు. బాబు అధికారంలో ఉన్నా పనిచేయలేదు.. ప్రతిపక్ష నేత గానూ ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. రైతుల కోసం సుజయకృష్ణ లాంటి 15 మంది ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి పదవులు కోల్పోయారని గుర్తుచేశారు. ఇక ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలిసి వారిపై వేటు వేశారన్నారు. ఉపఎన్నికలు కూడా ఎదుర్కోలేని పిరికిపంద ప్రభుత్వం ఇదని అన్నారు. 

కాంగ్రెస్, టీడీపీలు తప్ప మరో పార్టీ , మరో వ్యక్తి ఉండకూడదన్నట్టుగా అధికార, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అందుకే జగనన్నను కుట్ర చేసి జైలుకు పంపాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు జగనన్న నిర్దోషని నిరూపించినట్లవుతుందని షర్మిల అన్నారు.
Share this article :

0 comments: