న్యాయమే గెలుస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయమే గెలుస్తుంది

న్యాయమే గెలుస్తుంది

Written By news on Wednesday, July 31, 2013 | 7/31/2013

వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయటకొస్తారు
 ‘సాక్షి’ చైతన్యపథం సదస్సులో తాడేపల్లిగూడెం వాసుల మనోగతం
 తాడేపల్లిగూడెం, న్యూస్‌లై న్: ‘సహజ న్యాయసూత్రాలకు నీళ్లొదిలి.. అధికారం ఉందన్న అహంతో సీబీఐని అస్త్రంగా వాడి.. జననేత వైఎస్ జగన్‌మోహనరెడ్డిపై గద్దల్లాంటి కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్రలు ఎంతో కాలం సాగవు. ఆయన కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారు. కష్టాల్లో ఉన్న ప్రజల బాధ్యతను తన భుజాన వేసుకుంటారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేస్తార’ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు గొంతెత్తి చాటారు. గూడెంలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో నాగరాజు వ్యాఖ్యాతగా నిర్వహించిన ‘సాక్షి’ చైతన్యపథం చర్చావేదికకు మేధావులు, మహిళలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యూరు. సీనియర్ న్యాయవాది దొడ్ల పార్థసారథి ప్రసంగిస్తూ, పదులు, వందల చార్జిషీట్లు వేస్తామనడం న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. వైఎస్ జగన్ కేసు విషయంలో న్యాయస్థానాలను సీబీఐ తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు.
 
  స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జె.ఉషాకుమారి మాట్లాడుతూ... వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశపూరకంగానే జైలులో పెట్టారనే విషయం సామాన్యులకు సైతం అర్థమవుతోందన్నారు. ప్రముఖ ఆడిటర్ ఎన్‌వీ రమణరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినా, మద్దతు ఉపసంహరించుకున్నా.. అలాంటి వారిపై సీబీఐ దాడులు చేయిస్తారన్న విషయం ఇటీవల తమిళనాడులో చోటుచేసుకున్న ఘటనలు స్పష్టం చేశాయన్నారు. ప్రజా సంఘాల నాయకుడు ఏలూరి వెంకట్రావు మాట్లాడుతూ... సామాన్యులకు న్యాయాన్ని అందించేందుకు రూపొందించిన చట్టాలను అధికారంలో ఉన్న వ్యక్తులు తమకు అనుకూలంగా వినియోగించుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ముస్లిం, మైనార్టీ నాయకుడు ఎండీ మునీర్ మాట్లాడుతూ... వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందుతాయని అభిప్రాయపడ్డారు. విద్యావేత్త ఎం.విజయూరెడ్డి మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ జగన్‌ను జైలులో పెట్టించారని,  ప్రజాస్వామ్య విరుద్ధమైన ఇలాంటి దుష్ట పన్నాగాలను ప్రజలే తిప్పికొట్టాలన్నారు.
Share this article :

0 comments: