రాజ్యాంగేతర శక్తిలా సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజ్యాంగేతర శక్తిలా సీబీఐ

రాజ్యాంగేతర శక్తిలా సీబీఐ

Written By news on Thursday, July 11, 2013 | 7/11/2013

 పాలకులకు కావాల్సింది ప్రజాసంక్షేమం కాదు.. జననేత జగన్‌ను వేధించడమే లక్ష్యం
- మంగళగిరి పట్టణంలో సాక్షి చైతన్య పథంలో వక్తలు

సాక్షి, గుంటూరు: ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని పలువురు మేధావులు, వక్తలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, టీడీపీల చేతిలో అస్త్రంగా మారిన సీబీఐ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందని నిందించారు. తొలకరి చినుకుల కోసం ఎదురు చూస్తున్నట్టు జగన్ కోసం ఎదురు చూస్తున్నామని మహిళలు, వృద్ధులు, వికలాంగులు తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని నన్నపనేని లక్ష్మీ వైదేహి కళ్యాణ మంటపంలో నాగరాజు వ్యాఖ్యాతగా సాక్షి చైతన్య పథం కార్యక్రమం జరిగింది. న్యాయవాదులు కె.వీరారెడ్డి, ఎన్.కాళేశ్వరరావు మాట్లాడుతూ జగన్ కేసులో దర్యాప్తు పూర్తి చేయకుండా సీబీఐని కేంద్రం కంట్రోల్ చేస్తోందని, ఫలితంగా రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన హక్కులు, బాధ్యతలకు భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

బలహీన వర్గాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ నేరం చేసినట్లు రుజువు కాకుండా కేవలం విచారణ పేరుతో నెలల తరబడి జైలులో ఉంచడం... కోర్టులపై గౌరవమున్న ప్రజాస్వామ్య వాదుల్లోనూ అపోహలకు ఆస్కారమిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రచార సమితి నాయకుడు కల్యాణరావు, గుర్రం జాషువా సాహితీ కళాపరిషత్ అధ్యక్షుడు పెద్దేటి యోహాను మాట్లాడుతూ మహానేత తనయుడిపై జరుగుతున్న కుట్రలు అమానుషమని, అన్యాయమని ప్రజలంతా నమ్ముతున్నారని చెప్పారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు వి.ఎం.వి.జానకీదేవి మాట్లాడుతూ ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కేవలం జగన్‌ను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్న పాలకులకు బుద్ధి చెప్పేందుకు జనమంతా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. సదస్సులో పాల్గొన్న మహిళలు, వృద్ధులు, వికలాంగులు మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీలు జత కట్టి జగన్‌పై సాగిస్తున్న కుట్రలపై ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: