ఒక్కొక్కరికీ ఒక్కో ఫీజు ఎందుకు ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక్కొక్కరికీ ఒక్కో ఫీజు ఎందుకు ?

ఒక్కొక్కరికీ ఒక్కో ఫీజు ఎందుకు ?

Written By news on Friday, July 19, 2013 | 7/19/2013

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేపట్టిన రెండురోజుల ఫీజు పోరు శుక్రవారం సాయంత్రం ముగిసింది. విద్యార్థినులు ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకు ముందు ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. పథకాల అమలులో అది చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. కోతలు, మూసివేతలు విధానంతో ప్రభుత్వం నడుస్తోందని ఆమె విశ్లేషించారు.
శ్రీమతి విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే.. ఫీజు రీయింబర్సుమెంటు రాని వారు feesreimbursment@ysrcongress.com కి పంపితే ప్రభుత్వానికి పంపుదాం. జగన్ బాబు త్వరలో బయటకి వస్తారు. ఆయన మీ అందరి గురించి ఆలోచిస్తున్నారు.

మహానేత కార్యక్రమాలు ఎక్కడ ఆగాయో ప్రతి గడపా చెబుతుంది
రాజశేఖరరెడ్డిగారిని ప్రేమించిన ప్రతి హృదయానికీ, జగన్ బాబును, షర్మిలను ఆదరించిన ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాజశేఖరరెడ్డిగారు అమలు చేసిన పథకాలు ఎక్కడ ఆగిపోయాయని ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎక్కడ ఆగిపోయాయో చెప్పమని ఏకంగా సవాళ్ళే విసురుతున్నారు. ఆ కార్యక్రమాల అమలు ఎక్కడనుంచి వచ్చయి, ఎక్కడ ఆగిపోయాయి అనే అంశాలకు సమాధానం గడప గడప నుంచి వినిపిస్తుంది. మహానేత సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్రంలోని అందరి కష్టాలూ దగ్గర్నుంచి చూశారు. ఏ జిల్లాకు ఏంచేయాలి, ఏ మనిషికి ఏ సాయం చేయాలి అనే అంశంపై ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఎక్కడ ఏ ప్రాజెక్టు అవసరం, ఏ మనిషికి ఎక్కడ ఏది అవసరం, విద్యార్థికి ఏది అవసరం, వృద్ధులకు ఏది అవసరం అనేది ఆయన నిర్ణయించారు. వైయస్ అన్న పదమే రాష్ట్ర గతిని మార్చేసింది. రాజకీయాన్ని మలుపు తిప్పింది. రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. ప్రజానాయకుడు ఎలా ఉండాలో మార్గదర్శకంగా నిలిచింది. పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఆయన హస్తం ఆపన్న హస్తమైంది. విద్యార్థులకు వరమైంది. వికలాంగులు, వితంతువులు, వృద్ధులను ఆయన హస్తం ఆదుకుంది. పేదలకు ఆరోగ్యశ్రీ సంజీవని అయ్యింది. ప్రసవ వేదన పడే వారికి, ఆపత్సమయంలో ఉన్నవారి ప్రాణాలను 108 కాపాడింది. 104 ఇంటింటా వైద్యం అందించింది. అక్కచెల్లెళ్ళను లక్షాధికారులనుచేయాలనే తలంపునుంచే పావలా వడ్డీ పథకం రూపొందింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు కింద ఆదుకోవడానికి ఆయన ఓ తండ్రిలా ఆలోచించారు. ఇలా చెప్పుకుంటే పోతే డజన్ల కొద్దీ పథకాలున్నాయి. ఎనిమిదిన్నర కోట్ల మందికి  సంక్షేమాన్ని, అభివృద్ధిని చేరువ చేశారు. తెలుగువాడు గర్వంగా తలెత్తుకునేలా వైయస్ అన్న పదం చేసింది.

ప్రతి గుండెలో రాజన్న కొలువయ్యారు 
రాజశేఖరరెడ్డిగారు ప్రతి గుండెలో ఉన్నారు. ప్రతి మనిషికీ ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి తెలుగువాడి గుండెలో ఆయన పదిలంగా ఉన్నారు. గ్రామాలకెడితే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్నవారు తమ గుండెలు చూపించి వైయస్ ఇక్కడున్నారని చూపిస్తున్నారు. ఫీజు రీయింబర్సుమెంటు పథకంతో చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. 

కేటాయింపులు ఘనం.. విడుదల స్వల్పం
రాజశేఖరరెడ్డిగారి మొదటి సంవత్సరం బడ్జెట్ 40వేల కోట్లు, రెండో సంవత్సరం లక్షా నాలుగువేల కోట్లు. కిరణ్ కుమార్ రెడ్డిగారు లక్షా అరవైవేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇంత బడ్జెట్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు అమలుచేయలేరా అని అడుగుతున్నా. ఎందుకీ గందరగోళం. ప్రతి పేదవాడి పిల్లలు చదువుకుంటే వారిళ్ళో వెలుగులు నిండుతాయని రాజశేఖరరెడ్డిగారు ఆలోచించారు. ఎంత పెద్ద చదువైనా చదువుకోండని చెప్పారన్నారు. 28 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఆరోజు ఏ కొరతా లేదు. పేదల చదువును ప్రభుతవ బాధ్యతగా మహానేత భావించారు. ఇప్పుడు ఒక్కొక్కరికీ ఒక్కో ఫీజు ఎందుకు పెడుతున్నారు? వీళ్ళ చర్యలు అపహాస్యంగా ఉన్నాయి. పదివేల లోపు ర్యాంకు వచ్చిన వారికే ఫీజు రీయింబర్సుమెంటు అందుతుందని ఇప్పుడు ప్రభుత్వం చెబుతోంది. ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం 70 శాతం ఇస్తుందనీ, మిగిలినది రాష్ట్రం ఇస్తుందనీ చెబుతున్నారు. ప్రస్తుతం సెల్పు ఫైనాన్సు కోర్సులకు ఇలా గే ఇస్తారట. ఒక డిగ్రీకీ, మరో డిగ్రీకి మధ్య చదువుకోడానికి ఎక్కువ వ్యవధి ఉండకూడదట. డిగ్రీ తరవాత ఒక్క పీజీకే అనుమతిస్తారట. ఆధార్ సంఖ్యతో ముడిపెడుతున్నారు. ఎమ్మార్వో పేదరికం ధ్రువపత్రం ఇవ్వాలట. ఎన్నో ఆంక్షలు, మెలికలు పెట్టి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ పథకం ఉందా.. లేదా అనే అంశంపై తల్లిదండ్రులు,పిల్లలలో గందరగోళం నెలకొంది. ఏ కాలేజీలో ఎంత ఫీజు కట్టాల్సొస్తుందోఅని భయపడుతున్నారు. ఇలా కాకుండా ఏకమొత్తం కేటాయిస్తే గందరగోళం ఉండదు.  259 కళాశాలల్లో 35 వేలు ఫీజు పెట్టారు. దీనికి శాస్త్రీయత ఏమిటి? దీనికి ఏది ప్రాతిపదిక?  175 కళాశాలల్లో 35 వేల నుంచి లక్షా పదమూడు వేల రూపాయల ఫీజు పెట్టారు. 197 కాలేజీలకు 30 వేలు పెట్టారు. కారణం ఏమిటంటే  ఆ కాలేజీలు లెక్కలు చూపలేదనీ, సెప్టెంబరు 30లోగా ఆన్ లైన్ లో లెక్కలు చూపాలని వారిని ప్రభుత్వం కోరింది. వాళ్ళలో కొందరు కోర్టుకు వెళ్ళారు. ఏఎఫ్ఆర్‌సీ చెప్పినట్లు ఫీజులు కట్టించుకోమని కోర్టు చెప్పింది. యాజమాన్య కోటాలో రెట్టింపు ఫీజులు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. వీళ్ళెవరికి కొమ్ము కాస్తున్నారని అడుగుతున్నా. వాసవి కళాశాలలో లక్షా తొమ్మిది వేల రూపాయల ఫీజట. ఇంతే కాకుండా ఏటా ఫీజు మారుతోంది. రకరకాల కాలేజీలతో రకరకాల ఫీజులతో నడుస్తోంది. ఇన్ని సమస్యలు లేకుండా.. సక్రమంగా కాలేజీలకు ప్రభుత్వం ఫీజు చెల్లిస్తే యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళే అవసరమే లేదు. దీనివల్లే ఫీజులు రకరకాలుగా మారాయి. తనిఖీలు చేస్తామని చెప్పి, యాజమాన్యాలు ఇచ్చిన లెక్కల తంతుతో వాటిని ముగించారు. ఏ కాలేజీలో ఫీజులు ఏమేరకు తగ్గాయో తెలియడం లేదు. 639వ జీవో ప్రకారం కొత్త నిబంధనలను ప్రభుత్వం విధించింది. 2013-14లో వచ్చిన 14 లక్షల మందికి ఫీజు కట్టడానికి నూరు కోట్ల రూపాయలవుతుంది. దాన్ని కూడా చేయలేదు. కొందరికి మాత్రమే చెల్లించారు. ఉపకార వేతనాలు, మెస్ చార్జీలు సక్రమంగా చెల్లించడం లేదు. కేటాయింపులు భారీగా చూపుతూ, నిధుల విడుదలలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 2012-13లో నాలుగు వేల కోట్ల రూపాయలైతే.. 2085కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలినది 500 కోట్లనుకుంటే వెయ్యి కోట్లు మాత్రమే మిగిలింది. 

కొత్త వారికి ఈ ఏడాది ఇంతవరకూ కౌన్సిలింగు కూడా ఎందుకు మొదలుకాలేదు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే కళాశాలలు మొదలయ్యాయి. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఇలా జరుగుతోంది. రాజశేఖరరెడ్డిగారు చేసి చూపించారు. ఆయన ఇచ్చిన విద్యార్థుల సంఖ్యను రానురాను కోతలు పెడుతూ తగ్గిస్తున్నారు. చివరికి ఇది నామమాత్రంగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. 

ఎన్ఐటీ, ఐఐటి, సీబీఐటీల్లో 2012 వరకు జేఈఈ నిబంధనల ప్రకారం పరీక్ష రాస్తే సరిపోయేది. అప్పటినుంచి ఇంటర్ మార్కుల వెయిటేజీ పరిగణలోకి తీసుకుంటామని కొత్త నిబంధన అమలులోకి తెచ్చారు. ఎపెక్సు బోర్డులో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేదు. సభ్యత్వం ఉన్న మహారాష్ట్రకు ఇంటర్లో 68శాతం వెయిటేజీ తీసుకుంటామని చెప్పారు. నాగాలాండ్లో 41 శాతం తీసుకుంటారట. మన రాష్ట్రంలో మాత్రం 81.8% మార్కులు రావాలట. మనకెందుకు ఇంత పెర్సటేంజి? ఈ రాష్ట్రంలో 31మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మనకి అన్యాయం జరుగుతుంటే వారంతా ఏం చేస్తున్నారు? ఎపెక్సు బోర్డులోమనకెందుకు సభ్యత్వం లేదు. ప్రతి చోట మనకు నష్టమే జరుగుతోంది. కేటాయింపులుంటాయి కానీ విడుదల ఉండదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు 6838కోట్లు కేటాయించామని చెప్పి, ఖర్చు పెట్టినది మాత్రం 3128 కోట్లే. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్లో 8600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంతవరకూ టెండర్లను పిలవలేదు. ఏ అంశంపైనా సరైన పర్యవేక్షణ లేదు.. చిత్తశుద్ధి లేదు. అధికార యంత్రాంగం కూడా అలాగే వ్యవహరిస్తోంది. 

పింఛన్లు పెరిగింది లేదు

పింఛన్ల విషయానకి వస్తే చంద్రబాబు గారి హయాంలో 16 లక్షల మందికి ఇస్తే రాజశేఖరరెడ్డిగారి హయాంలో 78 లక్షల మందికి ఇచ్చారు. అందులో ఎనిమిదిన్నర లక్షల మంది మరణించారు. అయినా కూడా కొత్తవారికి పింఛన్లు ఇవ్వలేదు. రాజశేఖరరెడ్డి గారి హయాంలో వెంటనే కొత్తవారికి ఇచ్చేవారు. చంద్రబాబు హయాంలో మాదిరిగానే ఇప్పుడు పరిస్థితి ఉంది. ఏ వర్గానికి న్యాయం చేసే పరిస్థితి లేదు. బంగారు తల్లి పథకం పెట్టి దానిని ఆధార్ కార్డుకు అనుసంధానం చేశారు. కానీ సగం మందికి ఆధార్ లేదు. ప్రతి అంశంలోనూ ఇలా ఉంది. కేంద్రం చేసిన ప్రాథమిక విద్యా హక్కు చట్టం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తరువాత రాష్ట్రంలో 1850 పాఠశాలలను మూసేశారు. పదిమంది కంటే తక్కువ విద్యార్థులున్నారని సాకు చెబుతోందీ ప్రభుత్వం. పిల్లల్ని తల్లిదండ్రులు ఎందుకు పంపడం లేదో తెలుసుకుని పరిష్కారం కనుగొనాలి తప్ప మూసివేయడం తగదు. 

చట్టాలకు విలువేది

చేసిన చట్టాలకు విలువలేకుండా పోతోంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇరవై వేలు, ఒక్క టీచరూ లేనివి  అయిదారువేలున్నాయి. టాయిలెట్లు, భవనాలు లేని స్కూల్సున్నాయి. వీటన్నింటినీ ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్మో చేపట్టవచ్చు కదా. ఎక్కడికక్కడ మూసేయడమో లేదా కోత పెట్టడమో ప్రభుత్వం చేస్తోంది. ఆహార భద్రత పథకం ఇంతవరకూ లేదు. రెండు రూపాయల కిలో బియ్యం పథకంతో రాజశేఖరరెడ్డిగారు ఎంతోమందికి అన్నంపెట్టారు. అన్నీ చట్టాలు చేస్తున్నారు తప్ప అమలులోకి రావడం లేదు. ప్రస్తుతం ఎవరికీ న్యాయం చేయడంలేదు. ఫీజు రీయింబర్సుమెంటు మీద ఐదో సారి దీక్ష చేశామన్నారు. మొదటిసారి జగన్మోహన్ రెడ్డిగారు వారంరోజులు దీక్ష చేశారు. ఎందుకలా అని అడిగితే నేను వారం రోజులు అన్నం తినకపోతే నష్టంలేదనీ, విద్యార్థులకు ఎంతోకొంత మేలు జరిగితే చాలనీ చెప్పారన్నారు. 

http://www.ysrcongress.com/news/top_stories/ys-a-faith-and-assurance.html
Share this article :

0 comments: