కుమ్మక్కు కుట్రలు పన్నినా పల్లెజనం మహానేత అభిమానులకే పట్టం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుమ్మక్కు కుట్రలు పన్నినా పల్లెజనం మహానేత అభిమానులకే పట్టం

కుమ్మక్కు కుట్రలు పన్నినా పల్లెజనం మహానేత అభిమానులకే పట్టం

Written By news on Wednesday, July 24, 2013 | 7/24/2013

మొన్నటి ఏకగ్రీవంలోనూ.. నేడు పోలింగ్‌లోనూ 2275స్థానాలతో ప్రధమస్థానం
కేసీఆర్ కోటలో వైఎస్సార్సీపీ జయకేతనం శ్రీధర్‌బాబుకు సొంతూళ్లో షాక్
టీడీపీ ఎంపీ నిమ్మలకు పరాభవం గన్నవరంలో టీడీపీకి గండి
నిజాంపట్నంలో వైఎస్సార్సీపీ మద్దతుదారు ‘మోపిదేవి’ ఘనవిజయం 

సాక్షి నెట్‌వర్క్: నిన్నటిఏకగ్రీవ ఫలితాల్లోనే కాదు.. నేటి తొలివిడత సమరంలోనూ వైఎస్సార్సీపీ బలపరచిన అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ హవాకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు కుట్రలు పన్నినా పల్లెజనం మహానేత అభిమానులకే పట్టం కట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో 161ఏకగ్రీవాలతో సత్తా చాటిన వైఎస్సార్సీపీ మంగళవారం నాటి తొలివిడత ఎన్నికల ఫలితాల్లో 120 స్థానాలను గెలుచుకుంది. ప్రధానప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 68 ఏకగ్రీవాలతోనూ, ఇప్పుడు 79 స్థానాలతోనూ సరిపెట్టుకుంది. 

ఇక అధికార కాంగ్రెస్ 34ఏకగ్రీవాలు, 41 స్థానాలతో చతికిలపడింది. మంగళవారం తొలివిడత 5790 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, అర్ధరాత్రి 1.15గంటల వరకు వెల్లడైన 5,682 స్థానాల ఫలితాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులే ముందంజలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాలు, తొలివిడత ఫలితాలను కలిపితే వైఎస్సార్సీపీ 2326 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 2152 పంచాయతీలను, టీడీపీ 1986 సర్పంచ్ పదవులను సొంతం చేసుకున్నాయి. తొలివిడత ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయనగరంలో 120 స్థానాలతో, విశాఖపట్నంలో 95, తూర్పుగోదావరిలో 97, కృష్ణాలో 98, గుంటూరులో 109, నెల్లూరు జిల్లాలో 107, వైఎస్సార్ జిల్లాలో 132, ప్రకాశం జిల్లాలో 95 పంచాయతీలను కైవసం చేసుకుని చాంపియన్‌గా నిలిచింది. మిగిలిన జిల్లాల్లో కూడా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు పోటీకి దీటుగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాలో 112 స్థానాల్లో వైఎస్సార్సీపీ అనూహ్యంగా విజయం సాధించింది. ఇదే జిల్లాలోని చాలా పంచాయతీల్లో అధికార, ప్రతిపక్ష టీడీపీకి గట్టి పోటీనిచ్చింది. టీఆర్‌ఎస్ కేవలం 11స్థానాలకే సరిపెట్టుకోవడం గమనార్హం. కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులే విజయబావుటా ఎగురవేశారు. 

ఇక అనంతపురం జిల్లాకు చెందిన హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డిలకు సొంతూళ్లలోనే ఘోర పరాభవం ఎదురైంది. నిమ్మల సొంతూరులో కాంగ్రెస్ మద్దతుదారు గొల్ల వసంతమ్మ, నిమ్మల ఇప్పుడు నివాసం ఉంటోన్న గోరంట్ల పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు వీఎస్ మంజులమ్మ ఘనవిజయం సాధించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి సొంతూరు కదిరి నియోజకవర్గం పరిధిలోని నల్లచెరువు మండలం ఓరువాయి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు యశోదమ్మ విజయం సాధించారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా మంథని మేజర్ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పుట్ట శైలజ 2360 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన మోపిదేవి విజయనిర్మల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ, సీపీఐ ఎంఎల్ బలపరచిన శివమణిపై ఆమె 3860 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈమె మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తమ్ముడి భార్య. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన కృష్ణాజిల్లా గన్నవరం పంచాయతీలో వైఎస్సార్సీపీ 457ఓట్లతో విజయకేతనం ఎగురవేసింది.
Share this article :

0 comments: