కుట్రలు ఇంకెంత కాలం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్రలు ఇంకెంత కాలం

కుట్రలు ఇంకెంత కాలం

Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013

జన ప్రభంజనంతోనే జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారు
సాక్షి’ చైతన్యపథం సదస్సులో తణుకు వాసుల మనోగతం

త ణుకు, న్యూస్‌లైన్: ‘ప్రజాదరణ పొందిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్రలు ఎంతోకాలం సాగవు. ప్రజలనుంచి జగన్‌మోహన్‌రెడ్డిని దూరం చేయూలనుకుంటున్నకొద్దీ ఆయన మరింత చేరువ అవుతున్నారు. సీబీఐ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారింది. సహజ న్యాయసూత్రాల ప్రకారం ఎంత పెద్ద కేసులో అరుునా నిందితులకు 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాల్సి ఉంది. వైఎస్ జగన్‌పై కేవలం నిందారోపణలు చేయబడ్డాయే తప్ప నేరం రుజువు కాలేదు. అలాంటి వ్యక్తిని 14 నెలలుగా జైలులో ఉంచడం ఎంతవరకు సమంజసం’ అంటూ పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ ప్రజలు తమ మనోగతాన్ని ఆవిష్కరించారు. ‘పులిని బోనులో బంధించారు. అది బయటకు వస్తే కాంగ్రెస్, టీడీపీ వాళ్లను చీల్చి చెండాడుతుందని భయపడుతున్నారు. అందుకే మరిన్ని కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉన్నారు. 

జన ప్రభంజనంతోనే వైఎస్ జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నిటినీ పూర్తిస్థాయిలో పేదలకు అందిస్తారం’టూ నినదించారు. తణుకులోని చిట్టూరి రాజమ్మ లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ‘సాక్షి’ చైతన్య పథం సదస్సుకు మేధావులు, మహిళలు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎస్.హరికృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సదస్సులో సీనియర్ న్యాయవాది నీలం మాధవరావు మాట్లాడుతూ ఎన్నో కీలకమైన కేసుల్లో నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేశాయని గుర్తు చేశారు. పట్టణ ప్రముఖులు ముప్పిడి సుబ్బయ్య మాట్లాడుతూ జగన్‌మోహనరెడ్డిపై కుట్రలు ఎంతోకాలం సాగవన్నారు. రిటైర్డు ఎంపీడీవో కోట దేవదాసు మాట్లాడుతూ సీబీఐ అడ్డదిడ్డంగా వాదిస్తూ జగన్‌మోహన్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెబుతోందని, సాక్షులను ప్రభావితం చేసే వ్యక్తే అయితే జైలుకు వెళ్లేవారే కాదని అన్నారు. సామాజిక న్యాయపోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మీద, ‘సాక్షి’ పత్రిక మీద కుట్రలు చేయడం హేయమన్నారు. ముస్లిం నేత, మహిళా నాయకురాలు మెహర్ ఉన్నీషా, ప్రజా సంఘ నాయకులు మద్దిరాల రాంసతీష్ మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షానికి తోడై రాక్షస క్రీడ సాగిస్తోందని ధ్వజమెత్తారు. 
Share this article :

0 comments: