మేజర్.. వైఎస్సార్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేజర్.. వైఎస్సార్

మేజర్.. వైఎస్సార్

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

10వేల ఓట్లు దాటిన 68 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీకి అగ్రస్థానం
వైఎస్సార్‌సీపీ - 21 టీడీపీ - 20 కాంగ్రెస్ -11 టీఆర్‌ఎస్-7 ఇతరులు - 9

సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ పార్టీ వైపే ప్రజలున్నారని మరోసారి రుజువైంది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని ‘మేజర్’గా ఎన్నుకున్న ఓటర్లు మలిదశలోనూ అభిమానం ప్రదర్శిం చారు. శనివారం జరిగిన స్థానిక సమరంలో 10వేల ఓట్లకు పైగా ఉన్న మేజర్ పంచాయతీ ఫలితాల్లో వైస్సార్ సీపీ హవా స్పష్టంగా కనిపించింది. సార్వత్రిక ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే ఈ స్థానాల ఓటర్లు వైఎస్సార్ సీపీపై విశ్వాస ముంచి మనోభీష్టాన్ని వెల్లడించారు.

21 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయబావుటా
రెండో విడత జరిగిన స్థానిక సమరంలో 21 జిల్లాల పరిధిలో పదివేల ఓట్లకు పైబడిన మేజర్ పంచాయతీలు 68 ఉండగా.. 21 స్థానాల్లో గెలిచి వైఎస్సార్ సీపీ మొదటిస్థానంలో నిలిచింది. 20 పంచాయతీలతో టీడీపీ, 11 చోట్ల కాంగ్రెస్ గెలిచి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టీఆర్‌ఎస్ 7, ఇతరులు 9 చోట్ల గెలిచారు.

సాధా‘రణం’పై ‘మేజర్’ ప్రభావం
స్థానిక సం‘గ్రామం’లో ఆయా పంచాయతీల స్థితిగతులు, బరిలో నిలిచినవారి వ్యక్తిగత ప్రతిష్ట ప్రధాన పాత్ర పోషించడం సహజం. అయితే సార్వత్రిక ఎన్నికలకు సమయం తరుముకొస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మా రాయి. సాధ్యమైనన్ని ఎక్కువ పంచాయతీల్లో బలం పెంచుకుంటే ఆ నియోజకవర్గంపై పట్టు సాధించవచ్చని, ఈ ప్రభావం సాధారణ ఎన్నికలపై ప్రతిఫలి స్తుందని ఆయా పార్టీల నాయకులు నిర్ణయించుకున్నారు. పది వేల కన్నా ఎక్కువ ఓటర్లున్న పంచాయతీలపై స్థానిక అంశాలతో పాటు జిల్లా, రాష్ట్ర వ్యాప్త పరిణామాలు ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి శత్రువు వైఎస్సార్ సీపీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్, టీడీపీ మరోసారి కుమ్మక్కయ్యాయి. దీంతో రాష్ట్రస్థాయి నుంచి నియోజవర్గ స్థాయి వరకూ నాయకులందరూ వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. 

టీడీపీ కోటలో ‘వీర’విజయం : టీడీపీ విప్ ధూళిపాళ్ళ నరేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకానిలో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి పెద్ది రాధపై వెఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) తల్లి వీర రాఘవమ్మ 4,340 మెజారిటీతో గెలుపొందారు.
Share this article :

0 comments: