ప్రజాసంక్షేమం కోసం...జగనన్న అడుగుజాడల్లో నడుస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాసంక్షేమం కోసం...జగనన్న అడుగుజాడల్లో నడుస్తాం

ప్రజాసంక్షేమం కోసం...జగనన్న అడుగుజాడల్లో నడుస్తాం

Written By news on Saturday, July 13, 2013 | 7/13/2013

వేధింపులను భరించి, నిర్బంధాలను సహించి జగనన్న చేస్తున్న ఈ పోరాటం ఎవరి కోసం? తన కోసం కాదు. జనం కోసం. కన్న కలల్ని నిజం చేసుకోలేని ఓ పేద విద్యార్థి కోసం. నీరు కరువై కన్నీరు మింగుతున్న రైతు కోసం. జీవితకాలం కుటుంబ భారం మోసి అలసిపోయిన ఒక దిగువ మధ్యతరగతి సగటు మానవుడి భృతి కోసం. నా అన్నవారు, ఆదుకునేవారు అసలే లేని ఎందరో అనాథల కోసం. నేటి సమాజంలో మనుగడ కోసం మృగాళ్లతో పోరాడుతున్న ఆడకూతుళ్ల రక్షణ కోసం. ఒక కార్మికుడి కోసం, ఒక నిరుద్యోగి కోసం. కానీ ఏమైంది? మన ఉద్యమ నాయకుడిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన మధ్య లేకుండా చేసింది. 

జైలు బయటికి రానీయకుండా సీబీఐ చేత కాపలా కాయిస్తోంది. రాజన్న మరణం చూసి గుండె చెరువైపోయిన కోట్లాదిమంది అభిమానులలో నేనూ ఒకడిని. జగనన్నను బందీగా చేసి సామాన్యుడి ఆశలను ఈ పాలక, ప్రతిపక్షాలు చిదిమేస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయినవారిలో నేనూ ఒకడిని. కానీ మాలాంటి యువకులెందరికో నేడు జగనన్న తన ధైర్యంతో, ఏమాత్రం సడలని గుండెనిబ్బరంతో ఆదర్శంగా నిలిచారు. జగనన్న రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ప్రజాసంక్షేమం కోసం ఆయన ఆడుగుజాడలలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. 

- భరత్ అజాద్, ఇ-మెయిల్

జగన్‌ని జైల్లో పెట్టినందువల్ల జనానికి నష్టం జరుగుతోంది

జగనన్నను నిర్బంధించిన తీరును, ఆయన బయటకు రాకుండా జరుగుతున్న కుట్రలను చూస్తూంటే చట్టం ఇంత పక్షపాతంగా, న్యాయం ఇంత అన్యాయంగా ఉంటుందా అని ఆవేదన కలుగుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉండే ఒక నాయకుడిని ఇలా కక్షకట్టి జైలుపాలు చేయడమంటే ప్రజలతో ఆయన గడపవలసిన అమూల్యమైన సమయాన్ని బూడిదపాలు చేయడమే. అసలు ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రతినిధిని ప్రజలను కలవనీయకుండా చేయడం ఎంత అప్రజాస్వామికం! జగనన్న బయట ఉండి ఉంటే కనుక ఈ ఏడాదికాలంలో ఎంతోమంది నిరుపేదలకు మేలు జరిగి వుండేది.

పాలకులు పట్టించుకోని ఎన్నో సమస్యలు ఆయన ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లేవి. ఇప్పుడా అవకాశం లేదు. ఎప్పటికి వస్తుందో కూడా తెలియడం లేదు. దీన్నిబట్టి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ని నిర్బంధించిన ఫలితంగా ప్రజలకు నష్టం కలుగుతోందని స్పష్టమవుతోంది. ప్రజాసంక్షేమం గురించి ఆలోచించే ఏ ప్రభుత్వమైనా ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందా? ప్రభుత్వం తను చెయ్యవలసిన పనులు చెయ్యట్లేదు కాబట్టే జగనన్న ఓదార్పుయాత్రలో భాగంగా తెనాలి వచ్చినప్పుడు ఆయన్ని కలిసి స్థానిక సమస్యలపై వినతిపత్రం సమర్పించాం. దానికి జగనన్న ‘‘త్వరలోనే మంచి రోజులు వస్తాయి. రాజన్న రాజ్యం వస్తుంది. మొత్తం రాష్ట్రానికే స్వర్ణయుగం వస్తుంది’’ అని చెప్పారు. ఆ మాటలు నిజం కావాలంటే జగనన్న తక్షణం విడుదల కావాలి. ఈ వాస్తవాన్ని న్యాయాధీశులు గమనించాలి. 

- చింతపల్లి సాయికిరణ్, తెనాలి, గుంటూరు జిల్లా
Share this article :

0 comments: