వైఎస్సార్ హయాంలోనే ముస్లింలకు న్యాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ హయాంలోనే ముస్లింలకు న్యాయం

వైఎస్సార్ హయాంలోనే ముస్లింలకు న్యాయం

Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
ముస్లింల గురించి వైఎస్ తపనపడేవారని వెల్లడి

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మైనారిటీలకు పెద్దపీట వేస్తారని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా ఆమె ముస్లిం సోదరుల కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం అందరికీ శుభాలు చేకూర్చాలని ఆకాక్షించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్త పి.విజయారెడ్డి శుక్రవారం ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలనుద్దేశించి మాట్లాడారు. ‘రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. మీ అందరితో కలిసి ఇస్తార్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ మాసంలో అల్లాను ప్రార్థించడం శుభకరం. పేదలకు సాయం చేయడం గొప్ప విషయం. నాకు ముస్లింలపై ప్రేమాభినాలున్నాయి. మీ అందరి ప్రార్థనలతో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. జగన్ అధికారంలోకి వస్తే మీ అందరిగురించి ఆలోచిస్తాడు. వైఎస్సార్ ముస్లింల గురించి ప్రత్యేకంగా ఆలోచించేవారు. ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నా, కోర్టు కారణాలతో 4 శాతమే ఇవ్వగలిగారు. జగన్ కూడా ఆయనలాగే మీకు అన్ని విషయాల్లో అండదండగా ఉంటాడ’ని చెప్పారు. జగన్ త్వరగా విడుదల కావాలని ప్రతి ముస్లిం ప్రార్థించాలని కోరారు. 

‘వైఎస్సార్ హయాంలోనే ముస్లింలకు న్యాయం’

వేలాది మంది ముస్లింలు హాజరైన ఈ విందులో పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ రెహ్మాన్ మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఖైరతాబాద్ అవసరమైన ప్రాంతాల్లో ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని విజయారెడ్డి చెప్పారు. మతగురువు మౌలానా సయీద్ ఖాద్రీ మాట్లాడుతూ స్వాతంత్య్రం తర్వాత ముస్లింల గురించి పట్టించుకున్న నేత ఒక్క వైఎస్సారేనన్నారు. ఆయన ముస్లిం అయి ఉంటే ఆయన సమాధికి ఏటా ఉర్సు చేసేవారమన్నారు. రాష్ట్రంలో ముస్లింలు ఆర్థికంగా అభివృద్ధి చెందారంటే అది వైఎస్సార్ చలవేనని హ్యస్ ఇండియా చైర్మన్ తారిఖ్ ఖాద్రీ చెప్పారు. ఉపకార వేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. విందులో పార్టీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు కోటంరెడ్డి వినయ్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, పార్టీ కర్నూలు జిల్లా నేత హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: