మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Tuesday, July 30, 2013 | 7/30/2013

మరో ప్రజాప్రస్థానం 29-07-2013వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 225వ రోజు (జిల్లాలో 10వ రోజు) కార్యక్రమ వివరాల ను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు సోమవారం ప్రకటించారు. మంగళవారం ఉదయం పాతపట్నానికి సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర సూర్యనారాయణపురం, తిడ్డిమి, సుందరాడ గ్రామాల మీదుగా సిరియాకండి చేరుకుంటుంది. భోజన విరామం తర్వాత షర్మిల.. పెద్దపద్మాపురం, మెళియాపుట్టి, చాపర గ్రామాల మీదుగా పట్టుపురం చేరుకుంటారు. అనంతరం అక్కడికి సమీపంలో రాత్రి బస చేస్తారు.

జిల్లాలో పదో రోజు పర్యటించే ప్రాంతాలు
సూర్యనారాయణపురం, తిడ్డిమి, సుందరాడ,
సిరియాకండి, పెద్దపద్మాపురం, మెళియాపుట్టి,
చాపర, పట్టుపురం
Share this article :

0 comments: