- వీహెచ్‌ను సవాల్ చేసిన గోనె
సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ముందుగా ఆయన చరిత్ర ఏమిటో గుర్తుచేసుకుంటే మంచిదని ఆర్టీసీ మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు గోనె ప్రకాష్‌రావు మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఆయనకు కేటాయించిన ఎంపీ లాడ్స్ నిధులు, గతంలో ఉన్న గ్యాస్ మరియు టెలిఫోన్ కనెక్షన్ల కోటాను ఎవరికి కేటాయించారన్న అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వైఎస్సార్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం గోనె విలేకరులతో మాట్లాడారు. గతంలో పార్లమెంట్ సభ్యులకు ఉండే గ్యాస్, టెలిఫోన్ కనెక్షన్లను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్న చరిత్ర వీహెచ్‌దని విమర్శించారు. ఎంపీ లాడ్స్ నిధుల కేటాయింపులో 20 శాతం వరకు కమీషన్లు తీసుకుంటార న్న ప్రచారం ఉందని చెప్పారు. రాజమండ్రి హత్య కేసు నిందితుడికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి ఇచ్చినట్టుగానీ.. అతనితో షర్మిల, జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.
కానీ కోలా కృష్ణమోహన్, రామకృష్ణగౌడ్ లాంటి నేరస్థులు టీడీపీలో ఉండేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ఒకరు నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నడిబొడ్డున క్లబ్ నిర్వహించి నెలకు రూ. మూడు కోట్ల సంపాదన మూటగట్టుకున్నారని ఆరోపించారు. వీహెచ్ ఎవరిదగ్గర ఎంత వసూలు చేసి ఇంత స్థాయికి ఎదిగారో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. వీహెచ్ ఉంటున్న ఇంటి స్థలం ఆయన కొన్నారా, అసలది పట్టా భూమేనా? అని ప్రశ్నించారు. రాహుల్ కోటరీలో కీలకంగా ఉండే దిగ్విజయ్ సింగ్ ఇటీవల వైఎస్‌ను కీర్తిస్తూ మాట్లాడారని.. వీహెచ్ అసూయతో వైఎస్ కుటుంబంపై విమర్శలు చేసినంత మాత్రానే పదవులు వస్తాయనుకోవడం వీహెచ్ అవివేకమని విమర్శించారు. వీహెచ్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు.

0 comments:
Post a Comment