‘మహానేత మళ్లీ పుడితే’ చిత్రం షూటింగ్ ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మహానేత మళ్లీ పుడితే’ చిత్రం షూటింగ్ ప్రారంభం

‘మహానేత మళ్లీ పుడితే’ చిత్రం షూటింగ్ ప్రారంభం

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013


ఇడుపులపాయ, న్యూస్‌లైన్: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌లో సోమవారం ‘మహానేత మళ్లీ పుడితే’ అనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. లిమ్కా బుక్ రికార్డు గ్రహీత, దర్శకుడు పీసీ ఆదిత్య ఇడుపులపాయలోని వైఎస్ విగ్రహం వద్ద తొలి షాట్‌కు క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాను మహానేత వైఎస్ మృతి చెందిన రోజైన సెప్టెంబర్ 2న విడుదల చేస్తామని ఆదిత్య తెలిపారు. వైఎస్‌ఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే ఆయన మళ్లీ పుడితే ఎలా ఉంటుందనే అంశంపై చిత్రం నిర్మిస్తున్నట్లు వివరించారు.

వైఎస్‌ఆర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన విజయమ్మ
మహానేత వైఎస్ జీవిత చరిత్రకు సంబంధించి ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే పుస్తకాన్ని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. ఎడిటర్ అశోక్ రచించిన ఈ పుస్తకంలో వైఎస్‌ఆర్ 60 ఏళ్ల చరిత్రకు సంబంధించిన విషయాలు ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు కడప జియోన్ కళాశాల ప్రిన్సిపల్ రాజారత్నం ఐజాక్ పేర్కొన్నారు.
Share this article :

0 comments: