జన హృదయ నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మిక అస్తమయం రాష్ట్రంలో ఓ మహా విషాదాన్నే మిగిల్చింది. రాష్ట్రం గుండెలవిసేలా రోదించింది. ఆత్మీయ ఆసరా కోల్పోయినట్లు తెలుగుజాతి యావత్తూ విలవిల్లాడింది. ఆయన మరణాన్ని తట్టుకోలేని వందలాది మంది ప్రాణాలొదిలారు. వారి కుటుంబాలను ఓదార్చడానికి వచ్చిన జగన్‌లో రాష్ట్రం యావత్తూ రాజన్నను చూసుకుంది. నిరుపేదల ఇంటికి పెద్ద దిక్కుగా, తోబుట్టువుగా జగన్ ప్రజాదరణ పొందారు. అందుకే ఎండనక, వాననక, రేయనక, పగలనక ఆయన కోసం ఎదురుచూశారు. కరచాలనాలు చేశారు. అక్కున చేర్చుకున్నారు. ముద్దాడారు. కష్టాలు చెప్పుకున్నారు. కన్నీరు కార్చారు. కంచంలో కూటిని నోటికి అందించారు.
![]() - టి.మదనమోహన్, కన్నెమడుగు, చిత్తూరు జిల్లా సుప్రీమ్‌ని కూడా సీబీఐ అపహాస్యం చేస్తోంది! ప్రజాస్వామ్య సౌధానికి చట్టం (లెజిస్లేచర్), న్యాయం (జ్యుడీషియరీ), పాలనాయంత్రాంగం (ఎగ్జిక్యూటివ్), పత్రికలు (ప్రెస్)... ఈ నాలుగూ మూలస్తంభాలు. వీటిల్లో మూడు కూలిపోగా, ప్రస్తుతం న్యాయం అనే స్తంభం ఒక్కటే బలంగా నిలబడి ఉందనిపిస్తోంది! సుదీర్ఘంగా ఆలోచించి, సహేతుకమైన తీర్పు చెప్పడం న్యాయస్థానాల ముఖ్య ఉద్దేశం. అయితే ఆ సుదీర్ఘత వల్ల ఒక్కోసారి రాజ్యాంగంలోని 21వ అధికరణ ఇచ్చిన స్వేచ్ఛను, జీవించే హక్కును నిందితులు కోల్పోతున్న సందర్భాలున్నాయి. సీబీఐ వంటి దర్యాప్తుసంస్థల తీరుతో నిరపరాధులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. సమన్లు జారీ చేశాక అరెస్టు చెయ్యడానికి వీల్లేదని హైకోర్టు చెప్పినా సీబీఐ జగన్‌ను అరెస్ట్ చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీట్‌ను దాఖలు చెయ్యాలని సుప్రీంకోర్టు చెప్పినా, కోర్టు ఆదేశాన్ని బేఖాతరు చేసి మరో నాలుగు నెలలు గడువు కోరింది. కోర్టు నుంచి బయటి కి వచ్చిన సీబీఐ లాయరు ‘‘నాలుగు నెలలే అనేముందీ? ఇంకో నాలుగు నెలల గడువు అడుగుతాం’’ అని న్యాయస్థానాన్ని అపహాస్యం చేశాడు. జగన్ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలైన ప్రతిసారీ సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ వాదిస్తోంది! ఒకపక్క మంత్రులు తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగపరంగా, చట్టపరంగా సరైనవేనని ముఖ్యమంత్రి చెబుతుంటే, ఇక సాక్ష్యుల్ని ప్రభావితం చేయడమన్నది ఏముంటుంది? సీబీఐ వైఖరిని సుదీర్ఘంగా గమనిస్తున్న సుప్రీంకోర్టు తాజా నాలుగు నెలల గడువు తర్వాతనైనా జగన్‌కి బెయిల్ ఇవ్వాలని వేడుకుంటున్నాం. - కందుల రాజేశ్వరి, ఒంగోలు |
Home »
» జగనన్నని విడిపించుకుంటాం...గెలిపించుకుంటాం!
జగనన్నని విడిపించుకుంటాం...గెలిపించుకుంటాం!
Written By news on Thursday, July 11, 2013 | 7/11/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment