Home »
» ఆసుపత్రి లేక సచ్చిపోతన్నాం
ఆసుపత్రి లేక సచ్చిపోతన్నాం
బూర్జ/పాలకొండ రూరల్, న్యూస్‌లైన్: ‘‘మా ఊరిలో సిన్న ఆసపత్రియినా నేదు. డాక్టర్లెవరూ రారు. వైద్యమందక సచ్చిపోతన్నామమ్మా.. కష్టమొచ్చినప్పుడు బూర్జో, శ్రీకాకులమో, పాలకొండో ఎలతన్నాం. జబ్బు పెద్దదైతే సచ్చిపోవడం తప్ప మరోటి లేదు. ఊరికి రోడ్డు కూడా లేదు. అత్యవసరమైనప్పుడు మంచాలపై రోగులను తీసుకెల్తన్నాం. ఈలోపే పేనాలు పోతన్నాయి. మా కట్టాలు తీరేదెప్పుడమ్మా’’ అని శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొండపేట గ్రామస్తులు షర్మిల ముందు తమ బాధలు చెప్పుకొన్నారు. ‘‘సుక్క నీటి కోసం ఎంతో దూరం ఎలతన్నాం. మండలంలో ఏ ఒక్క గ్రామానికి కూడా తాగునీరు అందడం నేదు. స్కూలు పిల్లలు కూడా నీల్లు తాగడానికి బోర్ల దగ్గరికి పరుగులు తీత్తున్నారు. ఆ నీరు తాగి రోగాలు తెచ్చుకుంతన్నాం’’ అని తమ పిల్లలతో కలిసి మొర పెట్టుకున్నారు. ‘‘మరికొద్ది రోజుల్లో జగనన్న రాజ్యం వస్తుంది.. మన కష్టాలన్నీ తీరిపోతాయి.. మీరంతా అన్నను మంచి మనసుతో ఆశీర్వదించండి’’ అని షర్మిల వారికి భరోసా ఇచ్చి ముందుకు సాగారు.
0 comments:
Post a Comment