ప్రజలే జగన్‌ను విడిపించుకుంటారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలే జగన్‌ను విడిపించుకుంటారు

ప్రజలే జగన్‌ను విడిపించుకుంటారు

Written By news on Thursday, July 25, 2013 | 7/25/2013

- కుట్రలు, కుతంత్రాలు ఇకపై సాగవు
- బెయిల్ విషయంలో సీబీఐ కుంటిసాకులు చెబుతోంది
- ‘సాక్షి’ చైతన్యపథంలో వక్తలు

భీమవరం, న్యూస్‌లైన్ : ‘జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా సాగిస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మాయలు, సీబీఐ చెబుతున్న సాకులన్నీ తేటతెల్లమయ్యాయి. ఈ కుట్రలు, కుతంత్రాలు మరెంతోకాలం సాగవు. వాటిని ప్రజలే తిప్పికొట్టి, జగన్‌ను విడిపించుకునే సమయం ఆసన్నమైంది. సీబీఐతో ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వేయిస్తూ బెయిల్ మంజూరు కాకుండా అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వం తీరు దేశ చరిత్రలోనే ఒక మరకలా నిలిచిపోయింది. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిన సీబీఐ విచారణ పేరుతో 14 నెలలపాటు జగన్‌ను జైల్లో ఉంచి చట్టాన్ని కూడా అపహాస్యం చేస్తోంది. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే.. అంటూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణవాసులు మండిపడ్డారు. 

భీమవరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో డీవీఎన్ కిషోర్ వ్యాఖ్యాతగా బుధవారం నిర్వహించిన ‘సాక్షి చైతన్యపథం’ సదస్సులో ప్రజలు, మేధావులు తమ మనోగతాన్ని వెల్లడించారు. మహిళలు, యువత భావోద్వేగానికి లోనై ప్రభుత్వం, దానికి సహకరిస్తున్న టీడీపీ, వాటి చేతిలో కీలుబొమ్మగా మారిన సీబీఐ తీరుపై దుమ్మెత్తిపోశారు. సీనియర్ న్యాయవాది రాయప్రోలు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ మంత్రులు, ప్రజా ప్రతినిధులను పక్కనపెట్టి ఫిర్యాదులో 52వ స్థానంలో ఉన్న జగన్‌ను మాత్రమే అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. లోక్ అదాలత్ సభ్యుడు ఎండీ మగ్ధూం అలీ మాట్లాడుతూ చట్టప్రకారం 90 రోజుల్లో బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుకోవడం న్యాయ సమ్మతం కాదని తెలిపారు. 

ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ మాట్లాడుతూ భూ కేటాయింపుల్లో లబ్ధిపొందిన వారు జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారనే అభియోగాలతో ఇన్ని రోజులు జైల్లో పెట్టడం దారుణమని చెప్పారు. వినియోగదారుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎంఏ అన్సారీ మాట్లాడుతూ బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుకోవడం సరికాదన్నారు. వత్సవాయి ఇంజినీరింగ్ కళాశాల వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనివాసరాజు..మహిళా నాయకురాలు.. పులిదిండి కనకదుర్గ మాట్లాడుతూ వైఎస్ మరణానంతరం ఆయన పేరును క్విడ్ ప్రోకో పేరిట వేసిన కేసులో ఇరికించారన్నారు. సీబీఐ కీలుబొమ్మగా మారిందన్నారు.
Share this article :

0 comments: