ప్రజల ఆవేదనను తీర్చవలసింది విజ్ఞులైన మన న్యాయమూర్తులే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల ఆవేదనను తీర్చవలసింది విజ్ఞులైన మన న్యాయమూర్తులే

ప్రజల ఆవేదనను తీర్చవలసింది విజ్ఞులైన మన న్యాయమూర్తులే

Written By news on Sunday, July 7, 2013 | 7/07/2013

రాజీవ్‌గాంధీ జీవించి ఉన్నప్పుడు బోఫోర్సు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి. వై.ఎస్.ఆర్.గారు జీవించి ఉండగా ఏ కేసులోనూ ఆరోపణలు ఎదుర్కోని వ్యక్తి. రాజీవ్‌గాంధీ మరణించిన తర్వాత బోఫోర్సు కేసులో ఆయన పేరు తొలగించారు. వై.ఎస్.ఆర్. మరణించిన తర్వాత జగన్ ఆస్తుల కేసులో ఆయన పేరు చేర్చారు! ఢిల్లీ కక్షకు, వివక్షకు ఇంతకన్న నిదర్శనం ఏంకావాలి? కాంగ్రెస్ పార్టీ సీబీఐతో కుమ్మక్కు రాజకీయం చేస్తోందని చెప్పడానికి ఇంతకన్నా ఏం రుజువు కావాలి? 2012లో 18 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఫ్యాన్ గాలికి కాంగ్రెస్, టీడీపీలు డిపాజిట్లు కోల్పోయాయి. దాంతో, జగన్ ప్రజాక్షేత్రంలో ఉంటే తమ దుకాణాలు ఎక్కడ బంద్ అవుతాయోనన్న భయంతో ఆయన్ని జైల్లోనే ఉంచి, బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలూ సీబీఐని అడ్డు పెట్టుకున్నాయి. సీబీఐకి ఏ కేసు విషయంలోనూ లేని అత్యుత్సాహం జగన్‌కేసులోనే ఎందుకు కలిగిందో! చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల కేసు విచారించడానికి తమ దగ్గర సిబ్బంది లేదని నిస్సిగ్గుగా చెప్పుకున్న ఈ దర్యాప్తు సంస్థకు జగన్ కేసులో అంతమంది సిబ్బంది రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకువచ్చినట్లో మరి!

నూరుమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ, ఒక నిర్దోషికి శిక్ష పడరాదన్న విశాల దృక్పథంతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. సమయానికి అందించని న్యాయం కూడా అన్యాయంతోనే సమానం అంటోంది న్యాయశాస్త్రం. కనుక మన న్యాయమూర్తులు కూడా సీబీఐ కుంటిసాకులకు ముకుతాడు వేయాలి. సత్వరం జగన్‌కి న్యాయం ప్రసాదించాలి.

ఎవరికి అన్యాయం జరిగినా ఆశ్రయించేది న్యాయస్థానాలనే. భారత పౌరులకు న్యాయస్థానాల మీద అంత నమ్మకం. ఆ నమ్మకం వమ్ము కాకూడదు. జగన్ కంపెనీల్లో క్విడ్ ప్రోకో పెట్టుబడులు ఉన్నాయని సీబీఐ వాదిస్తోంది. అయినా రెండేళ్లుగా ఒక్కసాక్ష్యాన్ని కూడా సంపాదించలేకపోయింది. ఇక జగన్‌కు బెయిల్ ఇవ్వడానికి అవరోధం ఏమిటి? ఆనాడు... సీబీఐ తనను అరెస్టు చేస్తుందేమోనని జగన్ ముందస్తు బెయిల్ అడిగితే ‘అలా ఎందుకు అనుకోవాలి?’ అని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు, నేడు... జగన్‌ని వదిలిపెడితే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడేమోనని సీబీఐ వాదిస్తున్నప్పుడు ‘అలా ఎందుకు అనుకోవాలి’ అని అడగలేకపోతున్నారేం? ఏది ఏమైనా జగన్ అన్యాయంగా జైలు పాలయ్యారు. ఆ బాధ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆ బాధను పోగొట్టాల్సిన బాధ్యత విజ్ఞులైన మన న్యాయమూర్తులదే.

- బొగ్గుల వెంకట కోటిరెడ్డి, కొణతాలపల్లి, నల్గొండజిల్లా

ఇదెక్కడి న్యాయమో...ఆ భగవంతుడే విచారణ జరపాలి!

మాదొక మారుమూల కుగ్రామం. నాగరికతకు దూరంగా విసిరివేయబడిన ఊరు. పల్లెలో అంతా పాకలు, పూరి గుడిసెలు. అయినా సరే, రాజకీయంగా ఎటు చూసినా చైతన్యమే వెల్లివిరుస్తుంది. పండితులు చాలా తక్కువ. పామరులే ఎక్కువ.

పూరిపాకల్లో కూడా దూరదర్శన్ ప్రసారాలు, ఆకాశవాణి వార్తలు ఎల్లవేళలా వినిపిస్తుంటాయి. వార్తాపత్రికలు మాత్రం ఏ కొద్దిమంది చేతుల్లోనో కనిపిస్తుంటాయి. ప్రస్తుతం మా ఊరిలో నేను దినమూ వింటున్న ప్రజావాణి ఏమిటంటే - ‘‘అకారణంగా ఆ యువకుడిని చెరసాల పాల్జేయడం అన్యాయం గదా! అధికారమదోన్మత్తులై ఇష్టారాజ్యంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు 2014 జూన్‌లో వచ్చి తీరుతుంది’’ అని. కాంగ్రెస్ అధిష్టానానికి తన చెప్పుచేతల్లో ఉంటే దొంగ కూడా దొరే. తన మాట కాదంటే నిర్దోషి కూడా దొంగే! ఇదెక్కడి న్యాయమో ఆ భ గవంతుడే విచారణ జరపాలి.

కోట్లాది ప్రజాబాహుళ్య స్పందన చూస్తుంటే ఆ 38 ఏళ్ల యువకుడు చంచల్‌గూడ చెరసాలలో కాదు, జనహృదయాల్లో సురక్షితంగా ఉన్న బందీ అనిపిస్తోంది. రకరకాల కల్పిత కారణాలతో ఆయన్ని ఇంకా నిర్బంధించదలిస్తే అందుకు ప్రతీకారంగా ప్రజావాహిని తగిన బుద్ధి చెబుతుంది. ఏడాది నాటికి తన తీర్పును స్పష్టంగా చెప్పి తీరుతుంది. దాంతో హస్తిన అహంకారం వదిలిపోతుంది. మత్తు దిగి, నేత్రాలు తెరుచుకుంటాయి.

- ఉప్పలమర్తి చినమస్తాన్‌రెడ్డి, ఆల్తుర్తి, పొదలకూరు (మం), నెల్లూరు జిల్లా
Share this article :

0 comments: